చెరువులో పడి పెయింటర్ మృతి
ఆకివీడు: స్థానిక భుజబలరాయుడు మంచినీటి చెరువులో పడి పెయింటర్ పోతురాజుల శ్రీనివాస్(48) ఆదివారం మృతి చెందాడు. స్థానిక సంతపేట ఇల్లాపు వారి వీధిలో నివసిస్తున్న శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతూ చల్లదనం కోసం చెరువు గట్టు వద్దకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్ మృతితో ఆ ప్రాంతంలో విషాద చాయలు అలుముకున్నాయి.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పెంటపాడు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై స్వామి తెలిపారు. పెంటపాడుకు చెందిన సత్తి సూర్యచంద్రారెడ్డి (69) బైక్‌ఫై శనివారం గణపవరం మండలం పిప్పర వెళ్లి తిరిగి వస్తుండగా గూడెం నుంచి భీమవరం వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతనిని 108 అంబులెన్స్‌లో గూడెంలోని ఒక ప్రేవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.


