రేపు వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమావేశం
కై కలూరు: వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం మంగళవారం ఉదయం 9 గంటలకు ఏలూరు మినీ బైపాస్ రోడ్డు క్రాంతి కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ఆదివారం తెలిపారు. రా నున్న రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన కార్యచరణపై చర్చ ఉంటుందన్నారు. ముఖ్య అతిథులుగా శాసనమండలి ప్రతిపక్ష నేత, ఉభయగోదావరి జిల్లాల పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ బొ త్స సత్యనారాయణ, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, పార్లమెంట్ కో–ఆర్డినేటర్ కా రుమూరి సునీల్‌కుమార్, ఉంగుటూరు, ఏలూ రు, దెందులూరు, నూజివీడు, చింతలపూడి, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు పుప్పాల వాసుబాబు, మామిళ్లపల్లి జయప్రకాష్, కొఠారు అబ్బయ్యచౌదరి, మేక వెంకట ప్రతాప్ అప్పారావు, కంభం విజయరాజు, తెల్లం బాలరాజు హాజరవుతారన్నారు. జిల్లాలో ని ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణు లు తప్పక హాజరుకావాలని డీఎన్నార్ కోరారు.
నేడు అర్జీల స్వీకరణ
ఏలూరు(మెట్రో): ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)ను సోమవారం నిర్వహించనున్నట్టు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు తెలిపారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి నూజివీడు సబ్ కలెక్టర్ కా ర్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. కలెక్టరేట్, డివిజన్, మండల స్థాయి లో అధికారులు అర్జీలు స్వీకరిస్తారన్నారు.


