Suicide Forest Japan: Interesting Facts about Japan Suicide Forest in Telugu - Sakshi
Sakshi News home page

భయారణ్యం.. ఇదో ఆత్మహత్యల అడవి

Published Mon, May 16 2022 9:41 AM | Last Updated on Mon, May 16 2022 11:12 AM

Aokigahara Forest Also Called As Suicide Forest - Sakshi

ప్రపంచంలోని చాలా వింతలు, రహస్యాలు తదనంతర కాలంలో వణుకు పుట్టించే గాథలుగా ప్రచారంలోకి వస్తాయి. అలాంటిదే  జపాన్‌ లోని ఓకిగహారా అడవి. దీనికే  సూసైడ్‌ ఫారెస్ట్‌ అనే పేరూ ఉంది. ఈ అడవిలోకి అడుగుపెట్టిన మొదట్లోనే  ‘మీ పిల్లలు, కుటుంబం గురించి ఒకసారి ఆలోచించండి, మీ జీవితం మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన విలువైన బహుమతి’ అనే కొటేషన్స్‌ కనపడతుంటాయి. ఎందుకంటే ఈ అడవి ప్రపంచంలోని ఆత్మహత్యల ప్రదేశాలలో రెండవ స్థానంలో ఉంది.  

జపాన్‌ రాజధాని టోక్యో నుంచి రెండు గంటల దూరంలో ఫుజీ పర్వతానికి వాయవ్యంలో ఉన్న ఈ అడవి.. 35 చదరపు కి.మీ. మేర విస్తరించి ఉంది. ఇది చాలా దట్టంగా, అందంగా ఉంటుంది. అధికారిక రికార్డుల ప్రకారం.. ఈ అడవిలో సుమారు 105 మృతదేహాలు లభించాయి. ఈ అడవిలో మొబైల్‌ ఫోన్‌  పని చేయదు. దాంతో అడవిలో చిక్కుకున్న వారు బయటికి రావడం అసాధ్యం. రాత్రిపూట అడవి నుంచి అరుపులు, వింత శబ్దాలు వస్తాయని స్థానికులు చెబుతుంటారు. ఈ వనంలో 300 సంవత్సరాల కిందటి పురాతన జాతుల చెట్లు ఉన్నాయని సమాచారం. అయితే ఈ అడవిలో  ఉన్న మిస్టరీ ఏంటో నేటికీ కనిపెట్టలేకపోయారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement