కొత్త కొత్తగా స్టయిలిష్‌ బార్బెక్యూ.. | Automatic Food making machine available Nowadays | Sakshi
Sakshi News home page

కొత్త కొత్తగా స్టయిలిష్‌ బార్బెక్యూ..

Published Sun, Oct 24 2021 7:11 PM | Last Updated on Mon, Oct 25 2021 4:26 PM

Automatic Food making machine available Nowadays - Sakshi

శ్రమ తెలియకుండా రుచి, ఆరోగ్యం రెండు అందించే ఫుడ్‌ మేకర్స్‌కి ఈ రోజుల్లో చాలా డిమాండ్‌ ఉంది. చిత్రంలోని ఈ డివైజ్‌లో ఒకే సమయంలో నాలుగైదు వెరైటీలను వండుకోవచ్చు. ఎడమవైపు ఉన్న హాట్‌ పాట్‌లో.. సూప్స్, రైస్‌ ఐటమ్స్, కర్రీస్‌ వంటివి చేసుకుంటే.. కుడివైపు పైభాగంలో బార్బెక్యూ గ్రిల్‌ లేదా ఫ్రైయిడ్‌ పాన్‌ పెట్టుకుని నాన్‌ వెజ్, వెజ్‌ ఐటమ్స్‌ని గ్రిల్‌ చేసుకోవచ్చు.

ఇక దాని కింద భాగంలో ఉన్న ఖాళీలో రెండు పాన్‌ ప్లేట్స్‌ అమర్చుకునే వీలుంటుంది. వాటిపైన పాన్‌ కేక్స్, ఆమ్లెట్స్, దోసెలు ఎట్‌సెట్రా వేసుకోవచ్చు. ఇరువైపులా టెంపరేచర్‌ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి విడివిడిగా రెండు రెగ్యులేటర్స్‌ ఎడమవైపు ఉంటాయి. కుకింగ్‌ హాట్‌ పాట్‌కు ట్రాన్స్‌పరెంట్‌ మూతతో పాటు.. ప్రత్యేకమైన హ్యాండిల్స్‌ ఉంటాయి. అలాగే పాన్‌ ప్లేట్స్‌కి కూడా పొడవాటి హ్యాండిల్స్‌ ఉంటాయి.
ధర 
179 డాలర్లు
 (రూ.13,383)


హైక్వాలిటీ మల్టీఫంక్షనల్‌ మేకర్‌

ఈ తరానికి ‘సింపుల్‌ అండ్‌ ఈజీ’ పద్ధతిని అలవాటు చేసిన టెక్నాలజీ.. నిత్యం ‘అంతకు మించి’ అనే పాలసీని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త సౌకర్యాలను అందిస్తూనే ఉంటుంది. అందులో భాగమే ఈ మేకర్‌. ఇందులో పెద్దపెద్ద నాన్‌ వెజ్‌ ముక్కలతో పాటు.. రకరకాల రైస్‌ ఐటమ్స్, గ్రిల్‌ ఐటమ్స్‌ ఎక్కువ మోతాదులో తయారు చేసుకోవచ్చు. అలాగే కట్లెట్స్, శాండ్విచ్‌లతో పాటు.. చికెన్, మటన్, రొయ్యలు వంటివి క్రిస్పీగా గ్రిల్‌ చేసుకోవచ్చు. ఒకే సమయంలో మూడు వెరైటీలను తయారు చేసుకునేందుకు వీలుగా పాన్‌ బౌల్, ఫ్రైయిడ్‌ పాన్‌లతో పాటు.. పొంగనాల పాన్‌ కూడా లభిస్తుంది. టెంపరేచర్‌ పెంచుకోవడానికి మేకర్‌ కిందభాగంలో సెటింగ్‌ ఆప్షన్స్‌ ఉంటాయి. ఇక బౌల్స్‌ అండ్‌ పాన్స్‌ గాడ్జెట్‌ నుంచి విడిగా తీసుకుని క్లీన్‌ చేసుకోవడం తేలిక.
ధర 
344 డాలర్లు
 (రూ.25,720)



కంఫర్ట్‌ చార్కోల్‌ గ్రిల్‌
ఎన్ని సదుపాయాలొచ్చినా.. ఎంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా.. రోటి పచ్చడిలానే బొగ్గులపైన చేసే వంటకీ ఓ ప్రత్యేకత ఉంది. మెషిన్స్‌ అందివ్వలేని ఏదో కమ్మని రుచి అందులో ఉందంటారు కొందరు భోజనప్రియులు. అలాంటి వారికోసమే ఈ చార్‌కోల్‌ గ్రిల్‌. చిత్రంలోని ఇంతపెద్ద మేకర్‌ని.. సులభంగా ఫోల్డ్‌ చేసి చిన్న బ్యాగ్‌లో పెట్టుకుని.. ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. కింద భాగంలో బొగ్గులు రాజేసి.. గ్రిల్‌ మీద కావాల్సినవన్నీ కుక్‌ చేసుకోవచ్చు. వంటకు కావాల్సిన వస్తువులతో పాటు తయారైన ఫుడ్‌ని పక్కన పెట్టుకోవడానికి వీలుగా.. ఇరువైపులా ప్రత్యేకమైన స్టోరేజ్‌ బాస్కెట్స్‌ ఉంటాయి. కుడివైపు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బేకింగ్‌ నెట్, ఎడమవైపు ఫ్రైయిడ్‌ పాన్‌ అడ్జెస్ట్‌ చేసుకోవచ్చు. ఇక ఈ డివైజ్‌ కింద భాగంలో పెద్ద సొరుగు ఉంటుంది. వంటకు కావాల్సిన బాక్స్‌లు, పాత్రలు అందులో పెట్టుకోవచ్చు. ఇక నాలుగువైపులా ఉండే స్టాండ్స్‌ కావాల్సిన హైట్‌ని బట్టి అడ్జెస్ట్‌ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. 
ధర 
79 డాలర్లు
 (రూ.5,906)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement