Bathukamma Songs 2022: Sri Lakshmi Deviyu Chandamama Song Lyrics In Telugu - Sakshi
Sakshi News home page

Bathukamma Songs: బతుకమ్మ: పుట్టిన రీతి జెప్పె చందమామ! పూర్వకాలం నాటి పాట!

Published Tue, Sep 27 2022 5:20 PM | Last Updated on Tue, Sep 27 2022 5:58 PM

Bathukamma 2022: Sri Lakshmi Deviyu Chandamama Song Lyrics In Telugu - Sakshi

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఆరంభమైంది. తొమ్మిది రోజులు వేడుకగా సాగే ఈ సంబురంలో పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. బతుకమ్మా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ.. కోలాటాలతో ఆడబిడ్డలంతా కథాగానం చేస్తూ గౌరమ్మను పూజిస్తారు. ఈ పండుగ వేళ బతుకమ్మ జననం గురించి చెప్పే 200 ఏళ్ల నాటి పాట మీకోసం..

‘‘శ్రీలక్ష్మీ దేవియు చందమామ- సృష్టి బతుకమ్మాయె చందమామ
పుట్టిన రీతి జెప్పె చందమామ- భట్టు నరసింహకవి చందమామ
ధర చోళదేశమున చందమామ- ధర్మాంగుడను రాజు చందమామ
ఆరాజు భార్యయు చందమామ- అతి సత్యవతి యంద్రు చందమామ

నూరునోములు నోచి చందమామ- నూరు మందిని గాంచె చందమామ
వారు శూరులయ్యె చందమామ- వైరులచే హతమైరి చందమామ
తల్లిదండ్రులపుడు చందమామ- తరగనీ శోకమున చందమామ
ధనరాజ్యమునుబాసి చందమామ- దాయాదులను బాసి చందమామ

వనితతో ఆ రాజు చందమామ- వనమందు నివసించె చందమామ
కలికి లక్ష్మిని గూర్చి చందమామ- పలికె వరమడుగుమని చందమామ
వినుతించి వేడుచు చందమామ- వెలది తన గర్భమున చందమామ
పుట్టుమని వేడగా చందమామ- పూబోణి మది మెచ్చి చందమామ

సత్యవతి గర్భమున చందమామ- జన్మించె శ్రీలక్ష్మి చందమామ
అంతలో మునులునూ చందమామ- అక్కడికి వచ్చిరి చందమామ
కపిలగాలవులునూ చందమామ- కశ్యపాంగీరసులు చందమామ
అత్రి వశిష్టులూ చందమామ- ఆ కన్నియను జూచి చందమామ
బతుకు గనె ఈ తల్లి చందమామ- బతుకమ్మ యనిరంత చందమామ’’

చదవండి: Bathukamma Songs: పుట్టింటికి వెళ్లేందుకు అనుమతి! కలవారి కోడలు ఉయ్యాలో..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement