Gastric Problem Solution in Telugu: Best Health Tips to Get Rid of Gas Problem Fodmap Food - Sakshi
Sakshi News home page

Gas Problem Solution: గ్యాస్‌ సమస్యా... పాస్తా, కేక్‌ బిస్కెట్స్, ఉల్లి, బీట్‌రూట్స్ తింటే గనుక అంతే!

Published Mon, Jan 31 2022 4:17 PM | Last Updated on Mon, Jan 31 2022 6:35 PM

Best Health Tips To Get Rid Of Gas Problem Fodmap Food - Sakshi

కింది నుంచి గ్యాస్‌ పోవడం చాలామందిని ఇబ్బంది పెట్టే అంశం. ఎవరికీ చెప్పుకోలేని బాధ కూడా. అయితే ‘లో–ఫోడ్‌మ్యాప్‌’ ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. ఆ ఆహారం ఏమిటో తెలుసుకునే ముందు అసలు ‘లో–ఫోడ్‌మ్యాప్‌’ అంటే ఏమిటో తెలుసుకుందాం. ‘ఫర్మెంటబుల్‌ ఆలిగో శాకరైడ్స్‌’, ‘డై–శాకరైడ్స్‌’, ‘మోనో–శాకరైడ్స్‌’, ‘పాలీయాల్స్‌’ అనే రకాల ఆహారాల ముందు మాటలను కలిపి అవి ఓ సంక్షిప్తాక్షరం(ఏక్రోనిమ్‌)గా రూపొందించడం వల్ల ఏర్పడిన పదమే ‘ఫోడ్‌మ్యాప్‌’.

ఆయా పదార్థాలు తక్కువగా ఉండే ఆహారమే ‘లో–ఫోడ్‌మ్యాప్‌’ న్యూట్రిషన్‌. వీటిని బట్టి తీసుకోవాల్సిన, తీసుకోకూడని పదార్థాలేమిటో చూద్దాం.
ప్రధానాహారాలుగా- వరి అన్నం, గ్లూటెన్‌ ఫ్రీ బ్రెడ్‌


పండ్లలో- అరటి, నేరేడు, ద్రాక్ష, కివీ, నిమ్మ, బత్తాయి, నారింజ, బొప్పాయి, పైనాపిల్, స్ట్రాబెర్రీ
వెజిటబుల్స్‌లో- క్యారట్, దోస, అల్లం, మిరియాలు, లెట్యూస్, ఆలుగడ్డ, పాలకూర, టొమాటో
ప్రోటీన్లలో- చికెన్, ఫిష్‌


నట్స్‌లో- పల్లీలు, వాల్‌నట్స్‌ వంటివి తీసుకోవాల్సిన పదార్థాలు. 

అలాగే తీసుకోకూడని పదార్థాలు:
పాస్తా, కేక్‌ బిస్కెట్స్, పండ్లలో పియర్, ప్రూన్, పీచ్, చెర్రీస్, వెజిటబుల్స్‌లో బ్రాకలీ, కాలీఫ్లవర్, ఉల్లి, వెల్లుల్లి, బీట్‌రూట్స్, ప్రోటీన్స్‌లో బీన్స్, సోయాబీన్స్‌ వంటివి. వీటి నుంచి దూరంగా ఉండాలి. 
ఈ తరహా ఆహారాలలో తీసుకోవల్సినవి తీసుకుంటూ, మిగతావాటికి దూరంగా ఉండటం వల్ల కిందినుంచి గ్యాస్‌పోయే సమస్యతో పాటు ఐబీఎస్‌ (ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌) వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం దొరుకుతుంది.

చదవండి: Health Tips: లేత మాంసం, కోడిగుడ్లు, చికెన్ తిన్నపుడు విడుదలయ్యే హార్మోన్ల వల్ల.. 
Beauty Tips In Telugu: టమాటా... సీ సాల్ట్‌.. మృతకణాలు ఇట్టే మాయం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement