మేనరికపు పెళ్లిళ్లు లేదా రక్తసంబంధీకులు లేదా దగ్గరి బంధువుల మధ్య వివాహాలు జరిగితే... వాళ్లకు పుట్టబోయే బిడ్డల్లో అంగవైకల్యాలు, ఆరోగ్య సమస్యలు ఎందుకొస్తాయో తెలుసుకుందాం. సంక్షిప్తంగా చెప్పాలంటే... బిడ్డకు తల్లి నుంచి 23, తండ్రి నుంచి∙23 క్రోమోజోములు వస్తాయి. ఈ క్రోమోజోములు తల్లిదండ్రుల నుంచి పుట్టబోయే బిడ్డలకు వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తాయి. కాసేపు దంపతులిద్దరూ రక్తసంబంధీకులు కాదని అనుకుందాం.
అప్పుడు ఒక సమాచారాన్ని బిడ్డకు చేరవేసే ఒక జన్యువు తండ్రిలో లోపభూయిష్టంగా ఉందనుకుంటే... తల్లి తాలూకు మంచి జన్యువుతో ఆ లోపం భర్తీ అవుతుంది. అదే తల్లిలో ఉండే లోపభూయిష్టమైన అదే తరహా జన్యువును తండ్రి తాలూకు జన్యువు డామినేట్ చేసి, బిడ్డలో లోపం రాకుండా చూస్తుంది. కానీ ఇద్దరూ ఒకే కుటుంబాలకు సంబంధించిన వారైతే ఒకవేళ ఇద్దరిలోనూ సదరు సమాచారాన్ని తీసుకెళ్లే జన్యువులో లోపం ఉందనుకుందాం. అప్పుడు దాన్ని అధిగమించేలా చేయడానికి డామినెంట్ జన్యువు ఏదీ లేకపోవడంతో బిడ్డలో జన్యుపరమైన లోపం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ.
చదవండి: అది అఫైర్ కాదు, ఆమె మీద నాకున్న ప్రేమ!
Comments
Please login to add a commentAdd a comment