కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పని ఒత్తిడి కారణంగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY)సంస్థలో 26 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ మృతిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఒత్తిడిని ఎదుర్కొనేందుకు అంతర్గత బలం అవసరమని, ఇది దైవత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. దీనిపై అనుచిత వ్యాఖ్యలు అంటూ ప్రతిపక్ష నాయకులతో సహా పలువురు సోషల్ మీడియా వినియోగదారులు మండిపడుతున్నారు.
చెన్నై మెడికల్ కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా అన్నా సెబాస్టియన్ కేంద్ర మంత్రి స్పందిస్తూ ఇంటి నుండి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో పిల్లలకు నేర్పించాలని, దేవునిపై ఆధారపడటం ద్వారా మాత్రమే ఒత్తిడిని ఎదుర్కోవచ్చని అన్నారు. ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి అంతర్గత శక్తి ఉండాలని పేర్కొన్నారు. “భగవంతుని నమ్మండి, మనకు భగవంతుని అనుగ్రహం ఉండాలి. దేవుణ్ణి వెతకండి, మంచి క్రమశిక్షణ నేర్చుకోండి. మీ ఆత్మ శక్తి దీని నుండి మాత్రమే పెరుగుతుంది. పెరుగుతున్న ఆత్మశక్తితోనే అంతర్గత బలం వస్తుంది...విద్యా సంస్థలు దైవత్వం మరియు ఆధ్యాత్మికతను తీసుకురావాలి. అప్పుడే మన పిల్లలకు అంతర్గత బలం వస్తుంది. అది వారి ప్రగతికి, దేశాభివృద్ధికి దోహదపడుతుంది. అదే నా దృఢమైన నమ్మకం,” అని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు అంబానీ, అదానీ దిగ్గజాల బాధ తప్ప సామాన్యుల బాధ కనిపించదు, ఎన్నో ఆశలతో వస్తున్న అన్నా లాంటి యువకులు కార్పొరేట్ కంపెనీల దోపిడీకి బలైపోతున్నారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థ), కెసి వేణుగోపాల్ ట్వీట్ చేశారు.
Dear Nirmala Sitaraman ji,
Anna had inner strength to handle the stress that came with pursuing a gruelling Chartered Accountancy degree. It was the toxic work culture, long work hours that took away her life which needs to be addressed. Stop victim shaming and atleast try to be… pic.twitter.com/HP9vMrX3qR— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) September 23, 2024
చార్టర్డ్ అకౌంటెన్సీ డిగ్రీని చదవడంలోనే అన్నా అంతర్గత బలం ఎంతోఉంది. కానీ విషపూరితమైన పని సంస్కృతి, సుదీర్ఘ పని గంటలు ఆమె జీవితాన్ని నాశనం చేశాయి. దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. బాధితురాలిని అవమానించడం ఆపండి, కనీసం కొంచెం సున్నితంగా ఉండటానికి ప్రయత్నించండి, మీరు కోరుకుంటే దేవుడు మార్గనిర్దేశం చేస్తాడు అంటూ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు.
అటు అన్నా సెబాస్టియన్ మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) విచారణ చేపట్టింది. పని భారం వల్లే అన్నా మృతి చెందిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కమిషన్, ఈ వ్యవహారంలో స్వయంచాలకంగా విచారణ ప్రారంభించింది. నాలుగు వారాల్లోగా సమగ్ర దర్యాప్తు నివేదికను అందజేయాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖను కూడా కమిషన్ ఆదేశించింది. దీనిపై కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విచారణ జరుపుతోంది.
కాగా ఎర్నాకులం కున్నప్పిల్లికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ ఉద్యోగంలో చేరిలో నాలుగు నెలలకే, తీవ్ర ఒత్తిడి, గుండెపోటుతో మరణించింది. దీంతో ఆమె తల్లి కంపెనీ చైర్మన్‌కు ఈమెయిల్ రావడంతోఈ విషయంలో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment