Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

World Leader Supprot To Volodomyr Zelensky1
జెలెన్‌స్కీకి భారీగా పెరిగిన మద్దతు.. రష్యా స్పందన ఇదే..

కీవ్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump), జెలెన్‌స్కీ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. వైట్‌హౌస్‌లో ఇరువురి మధ్య భేటీ రసాభాసగా, వాగ్వాదంతో ముగిసింది. దీంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే జెలెన్‌స్కీ (Zelenskyy) వైట్‌హౌస్‌ను వీడారు. ఈ క్రమంలో పలు దేశాల నేతలు జెలెన్‌స్కీకి మద్దుతు తెలుపుతున్నారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.ట్రంప్‌, జెలెన్‌స్కీ భేటీ అనంతరం యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన నేతలు స్పందించారు. ఈ సందర్బంగా పోలిష్‌ ప్రధాన మంత్రి డొనాల్డ్‌ టస్క్‌ స్పందిస్తూ.. జెలెన్‌స్కీ మీరు ఒంటరి కాదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు సంఘీభావం తెలుపుతూ సందేశం విడుదల చేశారు.👉బ్రిటన్‌ ప్రధాన మంత్రి కీర్‌ స్టార్మర్‌ స్పందిస్తూ.. ఉక్రెయిన్‌కు మద్దుతు ఉంటుందన్నారు.👉ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్పందిస్తూ.. ఉక్రెయిన్ రక్షణ, భవిష్యత్తు గురించి చర్చించడానికి యూరోపియన్ దేశాలు, ఇతర మిత్రదేశాలతో అత్యవసర శిఖరాగ్ర సమావేశానికి పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌ అండగా ఉండాలన్నారు.Russia illegally and unjustifiably invaded Ukraine. For three years now, Ukrainians have fought with courage and resilience. Their fight for democracy, freedom, and sovereignty is a fight that matters to us all.Canada will continue to stand with Ukraine and…— Justin Trudeau (@JustinTrudeau) February 28, 2025👉కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో స్పందిస్తూ.. రష్యా చట్టవిరుద్ధంగా, అన్యాయంగా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. మూడు సంవత్సరాలుగా ఉక్రేనియన్లు ధైర్యంతో పోరాడుతున్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సార్వభౌమాధికారం కోసం వారి పోరాటం మనందరికీ మేలు కొలుపు. న్యాయమైన, శాశ్వత శాంతిని సాధించడంలో ఉక్రేనియన్లకు కెనడా అండగా నిలుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ నేతలకు జెలెన్‌స్కీ ధన్యవాదాలు తెలిపారు.ఇది కూడా చదవండి: జెలెన్‌స్కీతో ట్రంప్‌ వాగ్వాదం.. దద్దరిల్లిన వైట్‌హౌస్‌👉యూరోపియన్ యూనియన్ చీఫ్‌లు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ఆంటోనియో కోస్టా స్పందిస్తూ.. ఉక్రెయిన్‌ జెలెన్‌స్కీ ఎప్పుడూ ఒంటరి కాదు. మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మేమందరం మీతో న్యాయమైన, శాశ్వత శాంతి కోసం పని చేస్తూనే ఉంటాము. దైర్యంగా ఉండంటి అని అన్నారు.👉ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పందిస్తూ.. రష్యా అనే దురాక్రమణతో ముందుకు సాగుతోంది. ఉక్రెయిన్‌కు అందరం అండగా ఉండాలి. ఉక్రెయిన్‌కు సాయం చేయడానికి, రష్యాపై ఆంక్షలు విధించడానికి ముందుకు రావాలన్నారు.👉మరోవైపు.. రష్యా మాత్రం ఉక్రెయిన్‌పై మరోసారి సెటైరికల్‌ కామెంట్స్‌ చేసింది. ట్రంప్, జెలెన్‌స్కీ వాడీవేడీ చర్చపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్‌ స్పందిస్తూ.. ఈ పరిణామం ఉక్రెయిన్‌కు చెంపదెబ్బ లాంటిదన్నారు. జెలెన్‌ స్కీకి ఇలా జరగాల్సిందే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.JD Vance and Trump just put Zelensky in his place. Wow. Watch this.pic.twitter.com/zndgjKEPKz— End Wokeness (@EndWokeness) February 28, 2025జరిగింది ఇదీ..ఇదిలా ఉండగా.. రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్‌స్కీ శుక్రవారం వైట్‌ హౌస్‌కి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ఇది ట్రంప్‌నకు ఆగ్రహం తెప్పించింది. అనంతరం, అరుపులు, బెదిరింపులతో వాగ్వాదానికి దారితీసింది. ఉక్రెయిన్‌ (Ukraine) తీరు మూడో ప్రపంచయుద్ధానికి దారితీయవచ్చని.. జెలెన్‌స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్‌ కోపంగా చెప్పారు. కానీ, జెలెన్‌స్కీ మాత్రం ఉక్రెయిన్‌ ప్రజల కోసం ట్రంప్‌ బెదిరింపులకు లొంగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం, జెలెన్‌స్కీని టార్గెట్‌ చేస్తూ ట్రంప్‌ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రష్యాతో శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సుముఖంగా లేరని అన్నారు. ఇదే సమయంలో పుతిన్‌ మాత్రం శాంతి కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు.

Rohit Sharma managing injury very well, on top of it: ten Doeschate2
Champions Trophy: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌​..

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో టీమిండియా త‌మ ఆఖ‌రి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మైంది. ఆదివారం(మార్చి 2) దుబాయ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఇప్ప‌టికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి టేబుల్ టాప‌ర్‌గా లీగ్ స్టేజిని ముగించాల‌ని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భార‌త్‌కు గుడ్ న్యూస్ అందింది.తొడ కండరాల గాయంతో బాధ‌ప‌డుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఈ గాయం కార‌ణంగా రెండు రోజుల పాటు ప్రాక్టీస్ సెష‌న్‌కు దూరంగా ఉన్న రోహిత్‌.. తిరిగి మ‌ళ్లీ నెట్స్‌లో అడుగుపెట్టాడు. శుక్ర‌వారం దాదాపు 95 నిమిషాల పాటు రోహిత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ విష‌యాన్ని భారత క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ ధ్రువీకరించాడు."రోహిత్ శ‌ర్మ గాయంపై ఎటువంటి ఆందోళ‌న అవ‌స‌రం లేదు. అత‌డు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. నెట్స్‌లో చాలా సమయం పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఫీల్డింగ్ ప్రాక్టీస్‌లో కూడా అత‌డు భాగ‌మ‌య్యాడు. అత‌డికి ఈ గాయాన్ని ఎలా మెనెజ్ చేయాలో బాగా తెలుసు" అని ప్రీ మ్యాచ్ కాన్ఫ‌రెన్స్‌లో టెన్ డెష్కాట్ పేర్కొన్నాడు. మ‌రోవైపు జ్వ‌రం బారిన ప‌డిన ఓపెన‌ర్ శుబ్‌మ‌న్ గిల్ కూడా కివీస్‌తో మ్యాచ్‌కు సిద్దంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ కోసం భార‌త జ‌ట్టు శ‌నివారం త‌మ ఆఖ‌రి ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గోనుంది. కాగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ కోసం భార‌త తుది జట్టులో ఎటువంటి మార్పులు చోటుచేసుకోపోవ‌చ్చు.తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జ‌ట్టునే ఈ మ్యాచ్‌కు కొన‌సాగించే అవ‌కాశ‌ముంది. దీంతో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్‌, యువ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ మ‌రోసారి బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి.భారత తుది జట్టు (అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.చదవండి: Champions Trophy: సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌..

Telangana SLBC Tunnel Rescue: Relatives Reached BJP Leaders Visit Updates3
SLBC టన్నెల్‌ వద్ద గుండెలు అవిసేలా రోదనలు

నాగర్‌ కర్నూల్‌, సాక్షి: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. ప్రమాదం జరిగిన వారం రోజులకు.. ఎనిమిది మంది మృతదేహాల అవశేషాలను గుర్తించిన సంగతి తెలిసిందే. భారీగా పేరుకుపోయిన బురదను తొలగించి.. మృతదేహాలను వెలికి తీసే పనిలో సహాయక బృందాలు ఉన్నాయి.ప్రమాదం జరిగిన స్థలంలో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. శుక్రవారం రాత్రి.. జీపీఆర్‌, అక్వాఐతో బురదలో ఊరుకుపోయిన అవశేషాలను గుర్తించగలిగారు. మట్టిని తొలగించి మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నాల్లో ఉన్నాయి. లోకో ట్రైన్‌ను 13.5 కిలోమీటర్‌ వరకు తీసుకొచ్చి.. బంధువుల సాయంతో మృతదేహాలను గుర్తించాలనుకుంటున్నారు.ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద ఎనిమిదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. NDRF, SDRF, ఆర్మీ, నేవీ, సింగరేణి, ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌, రైల్వే రెస్క్యూ టీంలు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి బురదను డబ్బాల్లో బయటకు పంపుతూనే ఉన్నారు.మరోవైపు టన్నెల్‌ వద్దకు ఉస్మానియా ఫోరెన్సిక్‌ బృందం చేరుకుంది. ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ శ్రీధర్‌ చారితో పాటు ఇద్దరు సిబ్బంది, మరో ఇద్దరు పీజీ వైద్యులు, నాగర్‌ కర్నూల్‌ డీఎంహెచ్‌వో కూడా టన్నెల్‌ వద్దకు చేరుకున్నారు. కార్మికుల కుటుంబాల రోదనలతో టన్నెల్‌ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవాళ ఎలాగైనా మృతదేహాలను వెలికి తీసి.. బంధువులకు అప్పగించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాల గుర్తింపు కోసం బంధువులను లోపలికి తీసుళ్లేందుకు జేపీ కంపెనీ లోకో ట్రైన్‌ సిద్ధం చేస్తోంది.ఐదు రోజులెందుకు పట్టింది?: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిటన్నెల్ కట్టింగ్‌ చేయలనీ నిర్ణయం తీసుకోవడానికి 5 రోజులు సమయం ఎందుకు పట్టిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఆయన నేతృత్వంలో ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు SLBC ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. SLBC ఘటన బాధాకరం. సంఘటన స్థలానికి సీఎం వెళ్లకపోవడం దురదృష్టకరం. మంత్రులేమో పిక్నిక్ గా వెళ్లి వచ్చారు. కనీస ఆలోచన లేకుండా పనులు చేస్తున్నారు. నత్తనడకన నడుస్తున్న ప్రాజెక్టు ఇది. గత కాంగ్రెస్, BRS ప్రభుత్వాలు SLBC నీ నిర్లక్ష్యం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో కేటాయించిన నిధుల్లో సగం SLBC కి కేటాయిస్తే ప్రాజెక్టు ఈపాటికి పూర్తి అయ్యేది. ఎనిమిది మంది ప్రాణాలను ప్రభుత్వం తీసింది.. ప్రభుత్వ హత్యలే ఇవి అని మండిపడ్డారాయన.

LPU 2025 Btech Final Year Student Bags Rs 1.03 Cr Placement Package4
ఎల్‌పీయూ విద్యార్థికి రూ.1.03 కోట్ల ప్యాకేజీ

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్‌ ఇయర్‌ బీటెక్‌ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్‌ డూపర్‌ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్‌పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్‌ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్‌వర్క్స్, నుటానిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కో, పేపాల్‌ అమెజాన్‌ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్‌ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్‌ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్‌లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్‌మెంట్లు.గత ప్లేస్‌మెంట్‌ సీజన్‌ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్‌ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్‌ (రూ.48.64 LPA), ఇన్‌ట్యూట్‌ లిమిటెడ్‌ (రూ. 44.92 LPA), సర్వీస్‌ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్‌ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్‌వాల్ట్‌ (రూ. 33.42 LPA), స్కేలర్‌ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్‌పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్‌, క్యాప్‌జెమినీ, టీసీఎస్‌ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్‌, సీనియర్‌ అనలిస్ట్‌ రోల్స్‌ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పొజిషన్‌ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ కూడా 418 మంది విద్యార్థులను జెన్‌సీ రోల్స్‌ కోసం తీసుకుంది. ఎల్‌పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్‌ (279 మంది), టీసీఎస్‌ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్‌ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్‌మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, సిలికాన్‌ ల్యాబ్స్‌, ట్రైడెంట్‌గ్రూప్‌, నుటానిక్స్‌, ఆటోడెస్క్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. ఎల్‌పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్‌పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్‌పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్‌మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్‌ సాధించిన రికార్డు ఎల్‌పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్‌పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్‌పీయూ ఫౌండర్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ మిట్టల్‌ వివరించారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

Today Gold and Silver Price March 1st 20255
అమాంతం తగ్గిన గోల్డ్ రేటు: కొనేందుకు త్వరపడాల్సిందే!

వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గోల్డ్ రేటు నేడు (మార్చి 1)న గరిష్టంగా రూ. 220 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 79,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,620 వద్ద నిలిచాయి. నిన్న రూ. 500, రూ. 540 తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 200 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 220 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,400 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,620 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 79,550 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 86,770 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు తగ్గినప్పటికీ.. వెండి ధరలు మాత్రం నేడు స్థిరంగా ఉన్నాయి. దీంతో ఈ రోజు (మార్చి 1) కేజీ సిల్వర్ రేటు రూ. 1,05,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Bigg Boss 9: Nagarjuna Out From Hosting The Telugu Bigg Boss Season 96
Bigg Boss 9: నాగార్జున ఔట్‌.. హోస్ట్‌గా మరో స్టార్‌ హీరో!

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌(Bigg Boss)కు దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్‌ ఉంది. అన్ని భాషల్లోనూ ఈ షోని ఆదరిస్తున్నారు. ఇక తెలుగులో ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ప్రారంభమైన ఈ షో.. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లను దిగ్విజయంగా ముగించుకుంది. రెండో సీజన్‌కి నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. ఇక మూడో సీజన్‌ నుంచి ఎనిమిదో సీజన్‌ వరకు కింగ్‌ నాగార్జుననే బిగ్‌బాస్‌ సోకి వ్యాఖ్యాతగా ఉన్నారు. తనదైన మాటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆటలో తప్పొప్పులను ఎత్తి చూపుతూ నాగార్జున చేసే విశ్లేషణ బిగ్‌బాస్‌ షోకి మరింత ప్లస్‌ అయింది. వారం మొత్తం చూడకపోయినా సరే.. శని,ఆదివారాలు షో చూసేవారు చాలా మందే ఉన్నారు. అందుకే ఎనిమిది సీజన్లు దిగ్విజయంగా ముగిశాయి. ఇక త్వరలోనే తొమ్మిదో సీజన్‌(Bigg Boss 9 Telugu) ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్‌కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించడం లేదట. ఆయన ప్లేస్‌లో ఓ యంగ్‌ హీరో రాబోతున్నట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.కొత్తదనం కోసం కొత్త హోస్ట్‌!బిగ్‌బాస్‌ షోకి మొదట్లో ఉన్న ఆదరణ ఇప్పుడు లేడు. షో రొటీన్‌గా సాగడం, పెద్ద సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా పాల్గొనకపోవడంతో ఎనిమిదో సీజన్‌ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో తొమ్మిదో సీజన్‌ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దబోతున్నారట. కొత్తదనం కోసం హోస్ట్‌ని కూడా మార్చబోతున్నారట మేకర్స్‌. ఈ షోకి మరింత క్రేజ్ పెంచడానికి ఓ యంగ్‌ హీరోని రంగంలోకి దించబోతున్నారట. గేమ్‌లోనూ భారీ మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. ఇక హోస్ట్‌గా రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ వ్యవహరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మేకర్స్‌ విజయ్‌ని సంప్రదించారట. భారీ రెమ్యునరేషన్‌ కూడా ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఎక్స్‌పీరియన్స్‌ కోసం విజయ్‌ కూడా హోస్ట్‌గా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది మేకర్స్‌ చెబితే తప్ప తెలియదు.కంటెస్టెంట్స్‌ ఎంపికలో కొత్తట్రెండ్‌బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ కొత్తగా ఉండబోతుందట. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ వేటలో పడ్డారు మేకర్స్‌. ఈ సారి బాగా తెలిసిన ముఖాలనే హౌస్‌లోకి పంపిస్తారట. గత సీజన్లలో ఒక కామన్‌ మ్యాన్‌ కచ్చితంగా హోస్‌లోకి వెళ్లేవాడు. కానీ ఆ సారి ఆ రూల్‌కి బ్రేక్‌ వేశారట. ఈ సారి సెలెబ్రీలను మాత్రమే తీసుకోబోతున్నారట. అంతేకాదు గేమ్‌లోనూ మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఓ యంగ్‌ హీరో సైతం ఈసారి కంటెస్టెంట్‌గా పాల్గొనబోతున్నాడట. అలాగే ఓ కమెడిన్‌, ప్రముఖ సింగర్‌, కొరియోగ్రాఫర్‌ కూడా ఈ సారి హౌస్‌లో సందడి చేయబోతున్నట్లు సమాచారం. గత సీజన్లలో చేసిన తప్పులను మళ్లీ రిపీట్‌ చేయకుండా.. చాలా పకడ్భందీగా తొమ్మిదో సీజన్‌ని ప్లాన్‌ చేస్తున్నారు.

Feeling Cool due to Rain and Light winds in many areas of Delhi7
ఢిల్లీలో ఉదయాన్నే వర్షం.. హిమాచల్‌ను ముంచెత్తిన మంచు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌(Delhi NCR)లోని పలు ప్రాంతాల్లో ఈరోజు(శనివారం) ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. చల్లని గాలులు కూడా వీస్తున్నాయి. రెండు రోజుల క్రితం వరకూ వేడి వాతావరణంలో ఇబ్బంది పడిన ప్రజలకు రెండు రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలు ఉపశమనాన్ని అందిస్తున్నాయి. వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో స్థానికులు ఎంజాయ్‌ చేస్తున్నారు. #WATCH | Delhi: Rain lashes several parts of the National Capital. (Visuals from Central Secretariat) pic.twitter.com/8MajN4O8tD— ANI (@ANI) March 1, 2025వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావం వల్ల ఢిల్లీలో వర్షం కురుస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. సాయంత్రం తేలికపాటి వర్షం పడటంతోపాటు చల్లని గాలులు వీచాయి. అయితే ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోలేదు. శుక్రవారం గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు(Maximum and minimum temperatures) పెరుగుతూనే ఉన్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 5.9 డిగ్రీలు ఎక్కువగా ఉంది. అంతకు ముందు గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 19.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.మార్చి ఒకటి నుండి పశ్చిమ హిమాలయ ప్రాంతాన్ని కొత్త పశ్చిమ అల్పపీడనం తాకబోతోంది. దీని ప్రభావం పర్వత ప్రాంతాల్లో అధికంగా కనిపించనుంది. ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో స్వల్ప ప్రభావం చూపనుంది. రాబోయే మూడు రోజుల్లో ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత తగ్గనుంది. ప్రస్తుతం 15-19 డిగ్రీల మధ్య ఉన్న ఉష్ణోగ్రత 13-15 డిగ్రీల మధ్యకు చేరు​కోనుంది. శుక్రవారం రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రం తేలికపాటి వర్షం కురిసింది. వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.హిమాచల్ ప్రదేశ్‌లో..హిమాచల్ ప్రదేశ్‌లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అలాగే భారీగా కురుస్తున్న హిమపాతం స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపధ్యంలో చంబా, కులు, లాహౌల్-స్పితి, మండీలోని కర్సోగ్ సబ్-డివిజన్, సిమ్లా జిల్లాలోని రోహ్రు సబ్-డివిజన్, కిన్నౌర్ జిల్లాలోని విద్యా సంస్థలను మూసివేశారు. ఈ మేరకు విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రా జిల్లాల్లో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. శుక్రవారం ఉదయం సిమ్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. హిమపాతం కారణంగా, ఎగువ సిమ్లాలోని అనేక మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.రాష్ట్రంలో వర్షాలు, హిమపాతం మరియు కొండచరియలు విరిగిపడటం వల్ల వందలాది రోడ్లు దెబ్బతిన్నాయి. సిమ్లా-రాంపూర్, సిమ్లా-బిలాస్‌పూర్ హైవేలు, రాష్ట్ర రహదారి సిమ్లా-సున్నీ తట్టపాణి జాతీయ రహదారులను అతకష్టం మీద పునరుద్ధరించారు. చౌపాల్ రాష్ట్ర రహదారిని మంచు కారణంగా మూసివేశారు. రాష్ట​ంలోని ములింగ్‌లో హిమపాతం కారణంగా, పర్యాటక వాహనం రోడ్డు మధ్యలో చిక్కుకుంది. వాహనంలోని పర్యాటకుడిని ములింగ్ పంచాయతీ డిప్యూటీ ప్రధాన్‌తో పాటు కొంతమంది యువకులు కాపాడారు.ఇది కూడా చదవండి: Himachal: ఎడతెగని హిమపాతం.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత

 IIT Baba Alleges Beaten Up During TV News Debate Video Viral8
టీవీ డిబెట్‌లో ఐఐటీ బాబాపై దాడి.. వీడియో వైరల్‌

ఢిల్లీ: కుంభామేళాతో పాపులర్‌ అయిన ఐఐటీ బాబా అభయ్‌ సింగ్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. కొందరు వ్యక్తులు ఆయనపై కర్రలతో దాడి చేశారు. అభయ్‌ సింగ్‌లో ఓ టీవీ ఛానల్‌లో డిబెట్‌లో పాల్గొన్న సమయంలో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఐఐటీ బాబా అభయ్‌ సింగ్‌ తాజాగా నోయిడాలో ఓ ప్రైవేటు టీవీ ఛానల్‌లో డిబెట్‌లో పాల్గొన్నారు. డిబెట్‌ కొనసాగుతున్న సమయంలో కాషాయ దుస్తులు ధరించి వచ్చిన కొంత మంది వ్యక్తులు అక్కడికి వచ్చారు. అనంతరం, అభయ్‌సింగ్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కర్రలతో దాడి చేసినట్టు తెలుస్తోంది. దాడి తర్వాత ఆయన డిబెట్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా తనకు న్యాయం చేయాలని పోలీస్‌ అవుట్ పోస్టు ఎదుట బైఠాయించారు. దీంతో, పోలీసులు.. ఆయనకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.I know, This is all Media Strategy but still I think, Media is mentally exploiting this IIT Baba for its TRP, This Baba should not go to such programs.pic.twitter.com/w7j0z0FAQC— Harsh (@harsht2024) February 28, 2025ఎవరీ ఐఐటీ బాబా..?ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుకున్న అభ‌య్ సింగ్ ఇప్పుడు బాబాగా అవ‌త‌రించారు. ఐఐటీ బాబాగా (IIT Baba) పిలుస్తున్నారు. అభ‌య్ సింగ్‌ది హ‌ర్యానా రాష్ట్రం. మహా కుంభమేళా సందర్భంగా ఐఐటీ బాబా పేరుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లోనే ఉద్యోగం.. కొంతకాలం కార్పొరేట్‌లో పనిచేసిన ఆయన.. దాన్ని వదులుకొన్నారు. ఫొటోగ్రఫీపై మక్కువతో అటువైపు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు. మహా కుంభమేళాకు వచ్చిన ఆయన.. ఓ వార్తా ఛానెల్‌ ఇంటర్వ్యూతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారారు. ఐఐటీ బాబా, ఇంజినీర్‌ బాబాగా నెటిజన్లు ఆయన్ను పేర్కొంటున్నారు. సైన్స్‌ ద్వారా ఆధ్యాత్మికతను మరింత ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు. నెటిజన్లకు క్షమాపణలు..ఇదిలా ఉండగా.. చాంపియన్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌‌పై భారత్‌ గెలవదంటూ ఐఐటీ బాబా (IIT Baba) జోష్యం చెప్పిన విషయం తెలిసిందే. ‘ఈసారి భారత్ గెలవదు. విరాట్ కోహ్లీ సహా అందరికీ ఈ విషయం చెప్పండి. ఇండియా గెలవదని నేను చెబుతున్నానంటే ఇండియా గెలవదంతే’ అంటూ ఐఐటీ బాబా జోష్యం చెప్పారు. అయితే, మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఈ ఐఐటీ బాబాపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వెల్లువెత్తాయి. ఇలా జోష్యం చెప్పడం మానేయాలంటూ ఐఐటీ బాబాకు క్రికెట్‌ అభిమానులు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ట్రోలింగ్స్‌పై ఐఐటీ బాబా తాజాగా స్పందించారు. ఈ మేరకు క్షమాపణలు చెబుతూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు షేర్ చేశారు. ‘నేను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఇది పార్టీ టైం. కాబట్టి ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకోవాలి. భారత్ గెలవదని చెప్పాను కానీ, గెలుస్తుందని నా మనసుకు తెలుసు’ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు విరాట్ కోహ్లీ, టీమిండియా సంబరాలు చేసుకుంటున్న ఫొటోలను జోడించారు.

Dr Sumanth Reddy Dead At Warangal MGM Hospital9
డాక్టర్‌ మృతి.. భార్య, ప్రియుడు స్కెచ్‌?

సాక్షి, వరంగల్‌: వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ వైద్యుడు సుమంత్‌ రెడ్డి మృతిచెందారు. ఎనిమిది రోజులుగా మృత్యువుతో పోరాడిన సుమంత్ రెడ్డి శుక్రవారం అర్థరాత్రి చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. సుమంత్‌ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక, సుమంత్ రెడ్డి భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రెండు రోజుల క్రితం సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా, దాడికి సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్, సామ్యూల్‌లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరా మరియాలు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కాజీపేటలో సుమంత్ క్లినిక్‌ను నిర్వహిస్తుండగా, అతని భార్య ఫ్లోరా మరియా రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా పనిచేస్తోంది. అయితే, క్లినిక్ ప్రారంభించకముందు ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా సుమంత్ పనిచేసేవారు. ఆ సమయంలో ఫ్లోరా మరియా ఓ జిమ్‌లో చేరింది. అక్కడే ఆమెకు సామెల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది.దీంతో, వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఆ విషయం సుమంత్‌కు తెలిసిపోవడంతో భార్య ఫ్లోరాను మందలించాడు. అయినా, ఆమె వినిపించుకోలేదు. భర్తను వద్దనుకొని, ప్రియుడే కావాలని అనుకున్న ఆమె, చివరికి భర్తను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. ఇందుకోసం ప్రియుడు సామెల్‌, అతని స్నేహితుడు ఏఆర్‌ కానిస్టేబుల్‌ రాజును ఆమె పురమాయించింది. నేరం చేస్తే తన చేతికి మట్టి అంటకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో భర్తను ఎక్కడ, ఎలా హత్య చేయాలో ఫ్లోరా చెప్పింది.సుమంత్‌ను చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేసింది. ప్లాన్‌ ప్రకారం, యాక్సిడెంట్ ప్లాన్ విఫలమయ్యాక, ప్లాన్‌ బీ ప్రకారం ఈ నెల 20న రాత్రి ఖాజీపేట నుండి బట్టుపల్లి బైపాస్ రహదారిలో సమంత్‌ కారును అడ్డగించి, అతడిపై ఐరన్‌ రాడ్లతో దాడి చేశారు. చనిపోయాడనుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. కానీ చావుబతుకుల మధ్య ఉన్న బాధితుణ్ని స్థానికులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సుమంత్‌పై జరిగిన హత్యాయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కట్టుకున్న భార్య ఫ్లోరా మరియా, ఆమె ప్రియుడు సామెల్, సామెల్‌ స్నేహితుడు ఏఆర్‌ కానిస్టేబుల్‌ రాజు నిందితులని తేలింది.

Margadarsi Chit Fund Case Hearing adjourned to March 7th: Telangana10
రామోజీ లేరు.. విచారణా అక్కర్లేదు!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు.. యావద్భారతం ఒక కేస్‌ స్టడీగా గమనిస్తున్న వ్యవహారం.. ఆర్‌బీఐ యాక్ట్‌ సెక్షన్‌ 45 (ఎస్‌) ఉల్లంఘన జరిగిందా? లేదా? అన్నది ఆరు నెలల్లో తేలా్చలంటూ స్వయంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించిన నేరం.. సెక్షన్‌ 45 (ఎస్‌)ను ఉల్లంఘిస్తూ, అక్రమ డిపాజిట్ల సేకరణ జరిగిందంటూ స్వయంగా ఆర్‌బీఐ అఫిడవిట్‌ దాఖలు చేసిన పరిస్థితి.. నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది మంది డిపాజిటర్లపై తీవ్ర ప్రభావం చూపే ఆర్థిక లావాదేవీలు.. ప్రజల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు.. ఇందుకు భిన్నంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు చూసి విశ్లేషకులు, నిపుణులు నివ్వెర పోతున్న పరిస్థితి.. డిపాజిటర్ల వైపు నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు రామోజీ వైపు నిలబడుతున్న వైనం.. ఆర్‌బీఐ మాటలూ బేఖాతర్‌.. మరోవైపు చనిపోయిన రామోజీపై నేరం నెట్టేసి.. చేతులు దులుపేసుకునే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ ప్రయత్నం.. ఇప్పుడు ఈ అంశంపైనే సర్వత్రా ఆసక్తి...సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు వేల కోట్ల రూపా యల ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆధారాలతో సహా ఒకవైపు నిరూపిస్తుంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఊసే ఎత్తడం లేదు. పైపెచ్చు మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని ప్రస్తుత కర్త కిరణ్‌ను చట్ట ఉల్లంఘనల నుంచి కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను చాలా సూటిగా తెలంగాణ హైకోర్టుకు నివేదించింది.మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కర్త రామోజీరావు మరణించిన నేపథ్యంలో, ఈ వ్యాజ్యాలపై విచారణే అవసరం లేదని చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు తేల్చి చెప్పింది. అనవసరమైన విచారణ జరిపి సమయాన్ని వృథా చేసుకోవద్దని ఏకంగా హైకోర్టుకే సూచించింది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఆర్‌బీఐ చూసుకుంటుంది.!: ఏపీ మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ఫిర్యాదులు ఏవీ లేవని, పత్రికా ప్రకటనలు ఇచ్చిన తరువాత కూడా ఎవరూ ముందుకు రాలేదని, అందువల్ల విచారణ జరిపి ప్రయోజనం లేదని ఏపీ ప్రభుత్వం వివరించింది.ఒకవేళ తర్వాత ఎవరైనా ఫిర్యాదు చేస్తే, వారి సంగతి రిజర్వు బ్యాంక్‌ చూసుకుంటుందని ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే రీతిన వాదనలు వినిపించింది. అయితే కోర్టు తీర్పు మేరకు చర్యలు చేపడతామంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. ఏ వాదన వినిపిస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు లబ్ది చేకూరుతుందో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలాంటి వాదనలే వినిపించాయి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనల్లో ఎక్కడా మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావుల అక్రమాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విశేషం. మార్గదర్శి అక్రమాలకు ఆధారాలున్నా, కనీస స్థాయిలో కూడా వాటి గురించి ప్రస్తావించలేదు. డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమే: ఆర్‌బీఐ మరోవైపు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తన వైఖరిని పునరుద్ఘాటించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45 (ఎస్‌)కి విరుద్ధంగా ప్రజల నుంచి వేల కోట్ల రూపాయల మేర డిపాజిట్లు వసూలు చేశారని మరోసారి తేల్చి చెప్పింది. ఇలా చేయడం సెక్షన్‌ 58బీ(5ఏ) ప్రకారం అత్యంత శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసింది. రామోజీ లేరు కాబట్టి, పిటిషన్‌ను మూసివేయాలంటూ మార్గదర్శి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేయాలని హైకోర్టును అభ్యరి్థంచింది.రిజర్వ్‌ బ్యాంక్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపిస్తూ, రామోజీ చేసిన నేరానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ హెచ్‌యూఎఫ్‌ బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినందుకు క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ ఎదురోవాల్సిందేనని స్పష్టం చేశారు. కేసును మూసేయాలంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ చేసిన అభ్యర్థన సమర్థనీయం కాదన్నారు. చట్టవిరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించిందని, ఆర్‌బీఐ చట్టం సెక్షన్‌ 45(ఎస్‌)ను ఉల్లంఘించిందని ఆయన మరోసారి ధర్మాసనానికి గుర్తు చేశారు. హెచ్‌యూఎఫ్‌ కర్త రామోజీరావు మరణించినా కూడా విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. అప్పుడు అలా చెప్పి.. ఇప్పుడు ఇలా..: ఉండవల్లి మరోవైపు ఈ కేసులో కోర్టు సహాయకారిగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ, గతంలో అసలు ఎలాంటి అక్రమాలు జరగలేదని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ బల్లగుద్ది మరీ చెప్పిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఒకవేళ అక్రమాలు ఏవైనా జరిగి ఉంటే అందుకు రామోజీరావే బాధ్యత వహించాల్సి ఉందని ఇప్పుడు చెబుతోందన్నారు. మనిషి మరణించినా కూడా ప్రాసిక్యూషన్‌ ఆగదన్నారు. కుటుంబ సభ్యులు బాధ్యులు కారు: మార్గదర్శి కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను మార్చి 7కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ శ్యామ్‌ కోషి, జస్టిస్‌ కె.సుజనలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఆ రోజున ఉండవల్లి వాదనలు పూర్తిస్థాయిలో వింటామంది. అంతక్రితం మార్గదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, రామోజీ మృతి చెందినందున ఆయన నేర చర్యలకు కుటుంబ సభ్యులు బాధ్యులు కారని తెలిపారు. సివిల్‌ చర్యల విషయంలో వాదనలు వినిపిస్తామన్నారు. రామోజీరావు ఓ కంపెనీ యజమాని అని, ఆ కంపెనీ చర్యలకు యజమానే వహించాల్సి ఉంటుందన్నారు. యజమాని చనిపోయారు కాబట్టి మిగిలిన కుటుంబ సభ్యులు బాధ్యత వహించాల్సిన అవసరం లేదన్నారు. నేపథ్యం ఇదీ.. చట్ట నిబంధలను ఉల్లంఘించి ప్రజల నుంచి వేల కోట్ల రూపాయల మేర డిపాజిట్లు వసూలు చేసినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ అ«దీకృత అధికారి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును కొట్టేయాలంటూ మార్గదర్శి, రామోజీరావు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రజనీ, నాంపల్లి కోర్టులో అధికారి దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ 2018, డిసెంబర్‌ 31న తీర్పునిచ్చారు.ఈ తీర్పును సవాల్‌ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. అలాగే హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అన్నీ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, అ«దీకృత అధికారి ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు ఇచి్చన తీర్పును తప్పుపట్టింది. ఆ తీర్పును రద్దు చేసింది. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఉండవల్లి, ఏపీ సర్కార్‌ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. దీంతో తెలంగాణ హైకోర్టు 2024, జూన్‌ నుంచి తన విచారణను ప్రారంభించింది. అంతా ఆయన చేశారు..: మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ విచారణ కొనసాగుతుండగానే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ తన బాధ్యతలను తప్పించుకుని, వివాదాన్ని మరణించిన రామోజీ మీదకు తోసేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. ఈ మేరకు హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్‌) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కార్యకలాపాలు చేపట్టినందున దాని కర్త రామోజీరావు మాత్రమే బాధ్యడవుతారని, ఇతర కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని ఆ పిటిషన్‌లో పేర్కొంది. దీంతో న్యాయస్థానం తొలుత ఈ అనుబంధ పిటిషన్లపై వాదనలు వినేందుకు సిద్ధమైంది. కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రిజర్వ్‌ బ్యాంక్‌ను సైతం ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు వారు కూడా కౌంటర్లు దాఖలు చేశారు. తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ శ్యామ్‌ కోషి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
NRI View all
title
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను  ఈ మహా శ

title
అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్‌ టచింగ్‌ రీజన్‌

మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

title
USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్‌ క్లియర్‌

వాషింగ్టన్‌:  ఫిబ్రవ

title
Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

title
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం

డాలస్ :  ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

Advertisement
Advertisement