Health: అందాన్ని, ఆరోగ్యాన్ని అందించే డివైజ్‌! ధర ఎంతంటే! | Health And Beauty: Amazing Benefits With This Device Check | Sakshi
Sakshi News home page

Beauty: అందాన్ని, ఆరోగ్యాన్ని అందించే డివైజ్‌! ధర ఎంతంటే!

Published Sun, Feb 26 2023 10:01 AM | Last Updated on Sun, Feb 26 2023 10:03 AM

Health And Beauty: Amazing Benefits With This Device Check - Sakshi

‘ఆరోగ్యకరమైన జీవనానికి .. ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి’ అనేది తెలిసిన మాటే. కానీ బిజీ లైఫ్‌లో అదే వీలు కావట్లేదని ఫీలయ్యేవారికి ఈ డివైజ్‌ భలే మంచి చాయిస్‌. ఎందుకంటే.. ఇది సమయం వృథా కాకుండా.. అందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ మెషిన్‌ ఇంట్లో ఉంటే.. కూర్చున్నా, నిలుచున్నా ఫిట్‌నెస్సే మరి.

ఈ  డివైజ్‌ (ఎలక్ట్రో మజిల్స్‌ స్టిములేషన్‌ ఇన్‌హాన్స్‌ వైబ్రేటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఎక్సర్సైజర్‌).. మిమ్మల్ని ఎల్లప్పుడూ నాజూగ్గా ఉంచుతుంది. శరీరానికి కావాల్సిన వ్యాయామాన్ని అందిస్తుంది. అదెలా అంటే.. దీనిపైన నిలబడి.. డివైజ్‌కి అమర్చిన ఎక్సర్సైజ్‌ బ్యాండ్స్‌ని పట్టుకుంటే చాలు.. అరికాళ్ల నుంచి బాడీ మొత్తానికీ వైబ్రేషన్‌ పొందొచ్చు. దీనిపైన నిలబడితే.. బాడీ మొత్తంలో ఉండే కండరాల పనితీరు మెరుగుపడి.. రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది.

ల్యాప్‌టాప్‌లో పనిచేసుకుంటూనో.. కూరగాయలు తరుక్కుంటూనో.. ఇలా ఏ పని చేసుకోవాల్సి వచ్చినా ఆ పని చేసుకుంటూనే.. ఈ ఎక్సర్సైజర్‌ ప్రయోజనాలను పొందొచ్చు. చైర్లో కానీ.. సోఫాలో కానీ కూర్చుని.. కాళ్లను దీనిపై పెట్టుకుని ఆన్‌ చేసుకుంటే సరిపోతుంది. రిమోట్‌ సాయంతో ఆపరేట్‌ చేసుకోవచ్చు.

ఇందులో 3 ప్రీసెట్‌ మోడ్స్‌ ఉంటాయి. అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. అలాగే టైమింగ్‌ కూడా సెట్‌ చేసుకోవచ్చు. దీన్ని చిన్న చిన్న అపార్ట్‌మెంట్స్‌లో కూడా సులభంగా స్టోర్‌ చేసుకోవచ్చు. ఎక్కువ స్థలాన్ని తీసుకోదు. సోఫా కిందో, మంచం కిందో ఈజీగా పట్టేస్తుంది. ధర 458 డాలర్లు. అంటే 37,899 రూపాయలు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement