Iran Designer Robotic Crow: అచ్చం కాకిలా రూపొందించిన రోబోకాకి ఇది. ఇరాన్‌కు చెందిన కాన్సెప్ట్ డిజైనర్ అమీన్ అక్షీ ఈ రోబోకాకిని రూపొందించారు. ఇది ఉత్త రోబో మాత్రమే కాదు, డ్రోన్ కూడా. ఇందులో అన్నివైపులా కెమెరాలు, సెన్సర్లూ అమర్చడంతో ఎక్కడికంటే అక్కడకు ఎగురుతూ పోయి వాలగలదు.
రెక్కలను మెత్తగా జీవం ఉట్టిపడేలా రూపొందించడం, కాళ్ల పంజాలను ఎలాంటి ఉపరితలంపైన అయినా తేలికగా వాలి నిలబడేలా తీర్చిదిద్దడం ఇందులోని విశేషం. జనసమ్మర్దం ఉండే చోట్ల వాలడానికి కాకులు భయపడుతుంటాయని, వాటిలో ఆ భయం తొలగించే ఉద్దేశంతో ఈ రోబోకాకికి రూపకల్పన చేశానని అమీన్ చెబుతున్నారు.
చదవండి: Laser Comb: విగ్గు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. ఒత్తైన కురులు.. నొప్పి ఉండదు.. ధర ఎంతంటే!
Comments
Please login to add a commentAdd a comment