
యుద్ధంలో అప్పుడప్పుడు రహస్య పథకాలు, పన్నాగాలతో శత్రువులను గందరగోళంలో పడేస్తుండటం మామూలే! అయితే, ఇరాన్ సైన్యం మాత్రం తన రహస్యాలను తానే బట్టబయలు చేసుకుని, ఇతర దేశాలను భయపెట్టే ప్రయత్నం చేసింది. సముద్ర మట్టానికి 500 మీటర్ల దిగువన నిర్మించుకున్న రహస్య నౌకాదళ స్థావరాన్ని ఇరాన్ ఇటీవల ప్రారంభించింది.
అక్కడ ఉండే పెద్దపెద్ద భూగర్భ క్షిపణులతో పాటు, వారి వద్ద ఉన్న ఆయుధాలను కూడా బాహ్య ప్రపంచానికి చూపించింది ఇరాన్ సైన్యం. దీనికి సంబంధించిన వీడియోను స్థానిక టీవీ చానల్స్‌లో ప్రసారం చేస్తూ, ‘మేము పెద్ద, చిన్న శత్రువులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామ’ని ప్రకటించింది.
ఇదంతా చూస్తుంటే, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో డొనాల్ట్ ట్రంప్‌ను ఒక ఇంటర్వ్యూలో ఇరాన్‌తో యుద్ధానికి వెళ్లే అవకాశాల గురించి ప్రశ్నించగా.. ‘ఏదైనా జరగవచ్చు’ అని బదులిచ్చారు.
అందుకే ఇరాన్ సైన్యం ట్రంప్‌ను ఇలా పరోక్షంగా హెచ్చరిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఇరాన్ సైన్యం విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది. దీనిని గమనించిన ఇరాన్ ప్రభుత్వం ఆ వీడియోను తొలగించింది.
(చదవండి: పెళ్లే అవ్వదనుకున్నారు..అలాంటిది ప్రెగ్నెంట్ అయ్యింది..ఏకంగా 36 సార్లు..!)
Comments
Please login to add a commentAdd a comment