వేసవి రాగానే పనస కాయలు, పనస పండ్లు విరివిగా లభిస్తాయి. చాలామంది పనస తొనలను తిసేసి, వాటి గింజలను పారవేస్తుంటారు. అయితే ఈ గింజలలోని ప్రయోజనాలు తెలిస్తే వాటిని అస్సలు పారవేయరు.
పనస గింజలు మనకు యాపిల్‌కు మించిన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అలాగే వీటిలో బాదంపప్పుతో సమానమైన పోషకాలు లభిస్తాయి. పనసపండు బాగా పండినప్పుడు దాని తొనలు తియ్యగా, మరింత మెత్తగా తయారవుతాయి. దీంతో దానిలోని గింజలను తొలగించడం మరింత సులభమవుతుంది. ఈ గింజలను ఆహారంలో ఉపయోగించడం వలన అనేక ప్రయోజనాలు అందుతాయి. అయితే పనసపండులోని గింజలను ఎలా తినాలో, ఫలితంగా ఒనగూరే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పనస గింజలను ఉడకబెట్టి, పైనున్న తొక్క తీసిన తర్వాత తినవచ్చు. ఈ గింజలతో కూర తయారుచేసి కూడా తినవచ్చు. జాక్‌ప్రూట్ గింజలు తినేందుకు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇవి మనకు పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
హిమోగ్లోబిన్ పెరుగుదల
జాక్‌ఫ్రూట్ గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ గింజలను తినడం వలన శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. శరీరంలో ఎర్ర రక్త కణాలు పెరిగినప్పుడు, సహజంగా రక్తం పరిమాణం కూడా పెరుగుతుంది.
శరీరానికి శక్తి లభిస్తుంది
పనస గింజలు తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. వీటిని తీసుకోవడం ద్వారా శరీరంలో విటమిన్ బి లోపాన్ని నివారించుకోవచ్చు. జాక్‌ఫ్రూట్ గింజలు మన శరీరంలోని కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి.
జీర్ణక్రియ మెరుగుదల
జాక్‌ఫ్రూట్ గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. జాక్‌ఫ్రూట్ గింజలు చర్మానికి, జుట్టుకు కూడా మేలు చేస్తాయి.
స్థూలకాయాన్ని తగ్గిస్తాయి
జాక్‌ఫ్రూట్ గింజల్లో అధిక మొత్తంలో ప్రొటీన్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. చాలా సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి.
రోగనిరోధక శక్తి పెరుగుదల
ఈ గింజలు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇది కొత్త వైరస్‌లతో పోరాడేందుకు శరీరానికి శక్తిని అందిస్తుంది. జాక్‌ఫ్రూట్ గింజల్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment