nutritious
-
పనస గింజలు ఇలా తినండి
వేసవి రాగానే పనస కాయలు, పనస పండ్లు విరివిగా లభిస్తాయి. చాలామంది పనస తొనలను తిసేసి, వాటి గింజలను పారవేస్తుంటారు. అయితే ఈ గింజలలోని ప్రయోజనాలు తెలిస్తే వాటిని అస్సలు పారవేయరు.పనస గింజలు మనకు యాపిల్‌కు మించిన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అలాగే వీటిలో బాదంపప్పుతో సమానమైన పోషకాలు లభిస్తాయి. పనసపండు బాగా పండినప్పుడు దాని తొనలు తియ్యగా, మరింత మెత్తగా తయారవుతాయి. దీంతో దానిలోని గింజలను తొలగించడం మరింత సులభమవుతుంది. ఈ గింజలను ఆహారంలో ఉపయోగించడం వలన అనేక ప్రయోజనాలు అందుతాయి. అయితే పనసపండులోని గింజలను ఎలా తినాలో, ఫలితంగా ఒనగూరే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.పనస గింజలను ఉడకబెట్టి, పైనున్న తొక్క తీసిన తర్వాత తినవచ్చు. ఈ గింజలతో కూర తయారుచేసి కూడా తినవచ్చు. జాక్‌ప్రూట్ గింజలు తినేందుకు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇవి మనకు పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.హిమోగ్లోబిన్ పెరుగుదల జాక్‌ఫ్రూట్ గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ గింజలను తినడం వలన శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. శరీరంలో ఎర్ర రక్త కణాలు పెరిగినప్పుడు, సహజంగా రక్తం పరిమాణం కూడా పెరుగుతుంది.శరీరానికి శక్తి లభిస్తుంది పనస గింజలు తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. వీటిని తీసుకోవడం ద్వారా శరీరంలో విటమిన్ బి లోపాన్ని నివారించుకోవచ్చు. జాక్‌ఫ్రూట్ గింజలు మన శరీరంలోని కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి.జీర్ణక్రియ మెరుగుదల జాక్‌ఫ్రూట్ గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. జాక్‌ఫ్రూట్ గింజలు చర్మానికి, జుట్టుకు కూడా మేలు చేస్తాయి.స్థూలకాయాన్ని తగ్గిస్తాయి జాక్‌ఫ్రూట్ గింజల్లో అధిక మొత్తంలో ప్రొటీన్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. చాలా సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి.రోగనిరోధక శక్తి పెరుగుదల ఈ గింజలు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇది కొత్త వైరస్‌లతో పోరాడేందుకు శరీరానికి శక్తిని అందిస్తుంది. జాక్‌ఫ్రూట్ గింజల్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. -
‘బాలామృతం’లో పురుగులు
నాగిరెడ్డిపేట: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం పేరుతో సరఫరా చేసే బాలామృతంలో పురుగులు ప్రత్యక్ష్యమవుతున్నాయి. నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామపంచాయతీ పరిధిలో గల టేకులచెర్వు తండాలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు సరఫరా చేసిన బాలామృతం ప్యాకెట్లో పురుగులు కనిపించాయి. కేంద్రానికి వచ్చే నిఖితకు ప్రతి నెలా మాదిరిగానే ఈ నెల కూడా కార్యకర్త స్వరూప బాలామృతం ప్యాకెట్‌ను అందజేసింది. ఇంటికి వచ్చిన అనంతరం ప్యాకెట్‌ను విప్పి చూడగా అందులో తెల్ల, నల్ల పురుగులు ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆమె అవాక్కయింది. పిల్లలకు పౌష్టికాహారం పేరిట అందించే బాలామృతంలో పురుగులు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరానికి చెందిన ప్యాకెట్లను ఇప్పుడు పంపిణీ చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సరైన ఆహారంతో స్వైన్‌ఫ్లూకి చెక్
న్యూఢిల్లీ: సరైన ఆహారమే స్వైన్‌ఫ్లూకి అడ్డుకట్ట వేస్తోందని ఆరోగ్య రంగ నిఫుణలు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే స్వైన్‌ఫ్లూ బారినపడి సుమారు 1,100 మంది మరణించారు. అయితే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే స్వైన్‌ఫ్లూకి దొరక్కుండా తప్పించుకోవచ్చని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. ‘శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో ఎక్కువ మందికి స్వైన్‌ఫ్లూ సోకింది. దీనిని ఎదుర్కోవడంలో బలవర్ధకమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది’ అని న్యూఢిల్లీకి చెందిన ప్రముఖ న్యూట్రీషియనిస్ట్ శిఖా శర్మ చెప్పారు. ‘ఆకలి తగ్గిపోవడం కూడా స్వైన్‌ఫ్లూ రోగ చిహ్నాల్లో ఒకటి. అందుకని బలవంతంగా మాత్రం తినొద్దు. వీలైనప్పుడల్లా మిత ఆహారం తీసుకోండి. తాజా పండ్లు, కూరగాయలను తినడం ఉత్తమం. ఆపిల్, ద్రాక్ష వంటి పండ్ల రసాలు, క్యాబేజి, బచ్చలి ఆకు వంటి కూరగాయలు తీసుకోవాలి. వీటిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే కూరగాయల సూప్ తీసుకోవాలి. ఇతరులతో ఆహార పదార్థాలు, పానీయాలు పంచుకోవద్దు. ఇది తప్పనిసరిగా పాటించాల్సిన అంశం’ అని ఆమె అన్నారు. ముఖ్యంగా విటమిన్-సి ఉండే ఆహార పదార్థాలను తినాలని పేర్కొన్నారు. అలాగే ప్రొటీన్లు అధికంగా ఉండే చికెన్, చేప, సోయాతో చేసిన ఆహారాన్ని కూడా తీసుకోవచ్చని తెలిపారు. క్యారెట్, ఉసిరి, బచ్చలి ఆకుతో చేసిన పండ్ల రసాలు తీసుకోవాలన్నారు. తద్వారా హెచ్1ఎన్1 వైరస్‌ను దీటుగా ఎదుర్కోవచ్చని చెప్పారు. అల్లం, పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు, గుమ్మడి కాయ విత్తనాలను డైట్లో భాగంగా మలుచుకోవాలని పేర్కొన్నారు. ‘తులసి, వెల్లుల్లి, పసుపు వంటి మూలికలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వెల్లుల్లి ఈ వ్యాధి నిరోధకానికి తోడ్పాటునందిస్తుంది. యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియాగా పసుపు కీలక పాత్ర పోషిస్తుంది’ అని వెయిట్ మానిటర్.కామ్ వెబ్సైట్ ఫౌండర్ ఇషీ ఖోస్లా తెలిపారు. -
ఆ అంగన్వాడీ టీచర్ మాకొద్దు
బి.కోడూరు : విధులకు సరిగా రాకుండా పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించని అంగన్వాడీ టీచర్ మాకు వద్దు అంటూ శుక్రవారం మండలంలోని మరాటిపల్లె గ్రామప్రజలు సీడీపీఓకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే అంగన్వాడీ టీచర్ వెంకటసుబ్బమ్మ పనితీరు బాగా లేదంటూ గ్రామస్తులు రెండు వారాల కిందట గ్రీవెన్స్‌సెల్‌కు వెళ్లి కలెక్టర్‌కు తెలియచేశారు. దీనిపై శుక్రవారం సీడీపీఓ రాజమ్మ విచారించారు. బాలింతలకు, గర్భవతులకు, పిల్లలకు పౌష్టికాహారాన్ని ఎలా అందిస్తున్నారని గ్రామంలో అడిగారు. అలాగే రికార్డులను పరిశీలించా రు. పౌష్టికాహారాన్ని సరిగా అందించడం లేదని, ఏ ఒక్క రోజు కూడా అంగన్వాడీ కేంద్రానికి రావడం లేదన్నారు. ఆమె అంగన్వాడీ టీచర్‌గా ఉన్నంత వరకు ఆ కేంద్రానికి తమ పిల్లలను పం పమని తెగేసి చెప్పారు. దీంతో అధికారులు అంగన్వాడీ టీచర్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విచారణ నివేదికలను జిల్లా అధికారులకు పంపుతామని, వారి ఆదేశానుసారం చర్య లు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సువర్ణ, ఆయా, గ్రామస్తులు పాల్గొన్నారు.