‘బాలామృతం’లో పురుగులు
‘బాలామృతం’లో పురుగులు
Published Mon, Aug 8 2016 11:35 PM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
నాగిరెడ్డిపేట: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం పేరుతో సరఫరా చేసే బాలామృతంలో పురుగులు ప్రత్యక్ష్యమవుతున్నాయి. నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామపంచాయతీ పరిధిలో గల టేకులచెర్వు తండాలోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు సరఫరా చేసిన బాలామృతం ప్యాకెట్‌లో పురుగులు కనిపించాయి. కేంద్రానికి వచ్చే నిఖితకు ప్రతి నెలా మాదిరిగానే ఈ నెల కూడా కార్యకర్త స్వరూప బాలామృతం ప్యాకెట్‌ను అందజేసింది. ఇంటికి వచ్చిన అనంతరం ప్యాకెట్‌ను విప్పి చూడగా అందులో తెల్ల, నల్ల పురుగులు ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆమె అవాక్కయింది. పిల్లలకు పౌష్టికాహారం పేరిట అందించే బాలామృతంలో పురుగులు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరానికి చెందిన ప్యాకెట్లను ఇప్పుడు పంపిణీ చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement