ఆ అంగన్వాడీ టీచర్ మాకొద్దు
బి.కోడూరు : విధులకు సరిగా రాకుండా పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించని అంగన్వాడీ టీచర్ మాకు వద్దు అంటూ శుక్రవారం మండలంలోని మరాటిపల్లె గ్రామప్రజలు సీడీపీఓకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే అంగన్వాడీ టీచర్ వెంకటసుబ్బమ్మ పనితీరు బాగా లేదంటూ గ్రామస్తులు రెండు వారాల కిందట గ్రీవెన్స్‌సెల్‌కు వెళ్లి కలెక్టర్‌కు తెలియచేశారు. దీనిపై శుక్రవారం సీడీపీఓ రాజమ్మ విచారించారు. బాలింతలకు, గర్భవతులకు, పిల్లలకు పౌష్టికాహారాన్ని ఎలా అందిస్తున్నారని గ్రామంలో అడిగారు. అలాగే రికార్డులను పరిశీలించా రు. పౌష్టికాహారాన్ని సరిగా అందించడం లేదని, ఏ ఒక్క రోజు కూడా అంగన్వాడీ కేంద్రానికి రావడం లేదన్నారు. ఆమె అంగన్వాడీ టీచర్‌గా ఉన్నంత వరకు ఆ కేంద్రానికి తమ పిల్లలను పం పమని తెగేసి చెప్పారు. దీంతో అధికారులు అంగన్వాడీ టీచర్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విచారణ నివేదికలను జిల్లా అధికారులకు పంపుతామని, వారి ఆదేశానుసారం చర్య లు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సువర్ణ, ఆయా, గ్రామస్తులు పాల్గొన్నారు.