కొన్ని కిచెన్‌లో ఉపయోగించే సరుకులు పాడవ్వకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తులు తీసుకోవాలో తెలియదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొసారి పాడేపోతాయి. దీనికి తోడు ఆయా సీజన్‌లు కూడా తోడైతే కొన్నింటిని నిల్వ చేయడం కష్టంగా ఉంటుంది. అలాంటి వారకోసమే ఈ వంటింటి చిట్కాలు ఇక మీరు ఆ విధమైన సమస్యల నుంచి ఈజీగా బయటపడండి.
పచ్చిమర్చి తాజాగా ఉండాలంటే..
మార్కెట్ నుంచి తెచ్చిన పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తడిలేకుండా ఆరిన మిరపకాయల తొడిమలు తీసేసి టిష్యూపేపర్‌లో వేసి చుట్టి, జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి రిఫ్రిజిరేటర్‌లో ్చనిల్వ చేయాలి. ఇలా పెట్టిన పచ్చి మిరపకాయలు నెలరోజులపాటు పాడవకుండా చక్కగా ఉంటాయి.
ఇంట్లో చేసే నూడుల్స్ రెస్టారెంట్లలోలాగా పొడిపొడిగా రావాలంటే...
నీటిలో రెండు టీస్పూన్ల నూనె, కొద్దిగా ఉప్పువేసి నూడుల్స్‌ను మరిగించాలి. నూడుల్స్ చక్కగా ఉడికిన తరువాత వేడి నీటి నుంచి తీసి చల్లటి నీటితో కడగాలి. నీరంతా పోయేలా వంపేసి నూడుల్స్ పైన టీస్పూన్ నూనెను వేసి కలుపుకుంటే నూడుల్స్ పొడిపొడిగా వస్తాయి. వీటికి మసాలా జోడిస్తే ఎంతో రుచిగా ఉంటాయి.
పనీర్‌ను నీటిలో వేసి, పైన కాటన్ వస్త్రాన్ని కప్పి ఉంచి రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే రెండు మూడు వారాలపాటు తాజాగా ఉంటుంది. పనీర్ ముక్కలు మునిగే అన్ని నీళ్లు పోయాలి. ఈ నీటిని రెండు మూడు రోజులకొకసారి మార్చుకుంటూ ఉంటే మరిన్ని రోజులపాటు తాజాగా ఉంటుంది.
(చదవండి: మట్టి పాత్రల్లో వండటం మంచిదే! కానీ..)
Comments
Please login to add a commentAdd a comment