సీజేరియన్‌ తర్వాత బరువు పెరుగుతారా..? | Misconception That Women Gain Weight After Cesarean Section | Sakshi
Sakshi News home page

సీజేరియన్‌ తర్వాత బరువు పెరుగుతారా..?

Published Sun, Aug 18 2024 9:25 AM | Last Updated on Sun, Aug 18 2024 9:25 AM

 Misconception That Women Gain Weight After Cesarean Section

సాధారణంగా సిజేరియన్‌ తర్వాత మహిళలు బరువు పెరుగుతారనే అ΄ోహ చాలామందిలో ఉంటుంది. సిజేరియన్‌ తర్వాత కొందరు కాస్తంత బరువు పెరిగినప్పటికీ అందుకు కారణం సిజేరియన్‌ మాత్రం కాదు. దేహానికి తగినంత శారీరక శ్రమలేక΄ోవడం వల్ల లేదా మరికొన్ని వేర్వేరు అంశాల వల్ల అలా జరిగినప్పుడు దాన్ని సిజేరియన్‌కు ఆపాదించడం జరుగుతుంది. 

బరువు పెరగకుండా ఉండేందుకు సిజేరియన్‌ అయిన పదిహేను రోజుల తర్వాత నుంచే నడక లేదా శరీరంపై భారం పడకుండా  తేలిక΄ాటి వ్యాయామాలు మొదలుపెట్టవచ్చు. అయితే ఏవైనా ఇతరత్రా కారణాలతో కొందరు మహిళలను డాక్టర్లు ప్రత్యేకంగా విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వారు తప్ప అందరూ తమకు తగిన వ్యాయామాలను చేయవచ్చు. 

బరువు పెరగకుండా ఉండేందుకు సూచనలు:
చిన్నారులకు తల్లి΄ాలు పట్టించడం వల్ల మహిళలు బరువు పెరగకుండా ఉంటారు. దీనివల్ల తల్లికీ, బిడ్డకూ ఇరువురికీ లాభమే. నడక వ్యాయామం అందరికీ ప్రయోజనకరం. మహిళలు నడక మొదలుపెట్టినప్పుడు రోజుకు కేవలం పది నిమిషాలు మాత్రమే నడుస్తూ కాలవ్యవధిని క్రమంగా పెంచుకుంటూ ΄ోవాలి. ఇలా చేస్తూపోతే మూడు నెలల నుంచి మహిళలు తమ అదనపు కొవ్వు కోల్పోతారు. ΄÷ట్ట కూడా మామూలు స్థితికి వచ్చి సెంట్రల్‌ ఒబేసిటీ కూడా తగ్గుతుంది.  

(చదవండి: బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ మోనోట్రోఫిక్‌ డైట్‌: నిపుణులు ఏమంటున్నారంటే..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement