Cesarean
-
లగ్న జననం!
ఒకప్పుడు బిడ్డ పుట్టిన వెంటనే మావోడు ఏ ముహూర్తంలో పుట్టాడో చెప్పండి అని పండితులు, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లేవాళ్లు. ఇప్పుడు పుట్టకముందే జ్యోతిష్యుడి వద్దకు వెళ్లి డెలివరీకి ముహూర్తం పెట్టండి అని అడుగుతున్నారు. ముహూర్తం చూసుకుని శుభ ఘడియల్లో అమ్మ కడుపులోని బిడ్డను బయటకు తీస్తున్నారు. ఎక్కువ మంది రెండో బిడ్డ ప్రసవానికి ఈ లగ్నం పెడుతున్నారు. తొలి కాన్పు సిజేరియన్ అయితే, రెండో కాన్పు ఎలాగూ సిజేరియనే కదా అని నెలలు నిండక ముందే తేదీ నిర్ణయించేస్తున్నారు. రెండు మూడు రోజుల ముందు, మరి కొందరైతే వారం, పక్షం రోజుల ముందే బిడ్డను బయటకు తెచ్చేస్తున్నారు. ఈ ప్రసవం తరువాత తల్లికి బిడ్డకూ ఎన్నో సమస్యలు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలి. కాణిపాకం: సిజేరియన్ పేరు చెబితే ఒకప్పుడు గర్భిణులంతా భయపడిపోయేవారు. కానీ ఇప్పుడు అదే పదం మాటిమాటికీ వినిపిస్తోంది. బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, గర్భిణి నీరసంగా ఉన్నప్పుడు, ఉమ్మ నీరు పోతున్నప్పుడు తదితర అత్యవసర పరిస్థితుల్లోనే ఇది వరకు సిజేరియన్ చేసేవారు. కానీ ఇప్పుడు అవసరం ఉన్నా, లేకపోయినా కత్తి వాడుతున్నారు. కత్తి గాటు పడనిదే బిడ్డ బయటకు రావడం లేదు. సహజ కాన్పులో వేదన తప్ప కలిగే ప్రయోజనంపై అవగాహన లేకపోవడంతో అంతా ఈ పద్ధతికే ఓటేస్తున్నారు. ఫలితంగా చిత్తూరు జిల్లాలో సిజేరియన్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మారుమూల పల్లె వాసులు కూడా సిజేరియన్‌కు వెళ్తుండడం గమనార్హం. జిల్లా కేంద్రమైన చిత్తూరుతో పాటు పలు పట్టణాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏటా జరుగుతున్న ప్రసవాల్లో సగటున 30 నుంచి 40 శాతం వరకు సిజేరియన్లు ఉంటున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ శాతం మరింత ఎక్కువగా ఉంటోంది. ముహూర్తం పెట్టుకుని మరీ సిజేరియన్లపై జిల్లావాసులు ఎంతగా మక్కువ చూపుతున్నారంటే.. ఆపరేషన్లకు ముందుగానే ముహూర్తం పెట్టుకుని మరీ వస్తున్నారు. అంటే ప్రసవానికి ముందే వారు సిజేరియన్ చేసుకోవాలని నిర్ణయించు కుంటున్నారు. వారే అలా సిద్ధమయ్యే సరికి డాక్టర్లదేముంది. ఎలాగూ డబ్బులు వస్తాయి కదా అని వారికి అవగాహన కల్పించకుండా ఆపరేషన్ చేయడానికి సిద్ధమై పోతున్నారు. కొందరు డాక్టర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నా జనం మాత్రం వినిపించుకోకపోవడం విడ్డూరం. పండుగల్లో ప్రత్యేకం శ్రావణమాసం, మాఘమాసం, కార్తీక మాసం, రంజాన్ మాసం, క్రిస్మస్ పండుగ రోజులలో డెలివరీల సందడి కనిపిస్తోంది. మంచి రోజులు వస్తాయంటే ఒకపక్క పెళ్లిళ్ల సందడి ఉండగా, మరోపక్క ఈ సమయంలోనే బిడ్డ పుడితే జాతకంతోపాటు భవిష్యత్తు బంగారంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. బిడ్డపైన ప్రభావం » బిడ్డ జననం సహజంగా జరిగితే అది చిన్నారి మానసిక, శారీరక వికాసానికి ఎంతో దోహదం చేస్తుంది. » అసహజ రీతిలో చేసే కత్తిగాట్ల వల్ల తల్లి పడే బాధ బిడ్డపై ప్రభావం చూపుతుంది. కీలకమైన సమయంలో ఆ పరిస్థితి శిశువు స్పందనలపై పడుతుంది. శిశువుల జ్ఞానాత్మక అభివృద్ధిలో తేడాలు అధికంగా చూపుతాయి. » బిడ్డలో ఆ సమయానికి కొన్ని రకాల హార్మోన్లు అవసరమైన దాని కంటే ఎక్కువగాను లేదా తక్కువగాను విడుదలై అవి భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయి. ఇదీ వ్యాపారమే! ఒక సిజేరియన్‌కు జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆస్పత్రుల వారు సుమారు రూ.40వేల నుంచి రూ.80 వేలు వరకు వసూలు చేస్తున్నారు. అంటే ఇది ఓ మేజర్ ఆపరేషన్‌కు తీసుకున్నంత మొత్తంలో ఉంటోంది. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు సగటున 50 నుంచి 90 వరకు వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. వీటిలో 80 శాతం వరకు సిజేరియన్ కేసులే ఉంటాయి. సిజేరియన్ చేస్తే ఆస్పత్రిలో ఆరు నుంచి 8 రోజుల వరకు ఉండాలి. ఖర్చు కూడా ఎక్కువే. సహజ ప్రసవానికి రూ.20 వేలు లోపు ఖర్చు అవుతోంది. తల్లీ బిడ్డా రెండు రోజుల్లో ఇంటికి వెళ్లిపోవచ్చును. ముహూర్తాల వెర్రి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్న వారిలో చాలామంది ముహూర్తాలను చూసుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాదాపు 30 నుంచి 40 శాతం మంది తిథి, ఘడియలు, నక్షత్రాలు చూసుకుని ఆస్పత్రులకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రసవానికి ఇంకా సమయమున్నా ముహూర్తాల వెర్రిలో పడి వారం, పదిరోజుల ముందే ఆపరేషన్‌కు సిద్ధమవడం కరెక్టు కాదని పెద్దలు సూచిస్తున్నారు. ఎందుకంటే బిడ్డ తల్లి కడుపులో తొమ్మిది నెలలు నిండేవరకు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటుంది. రెండు, మూడు రోజుల వ్యవధిలో చేసినా ఏం కాదుగానీ, పది, పదిహేనురోజుల తేడాతో బిడ్డను బయటికి తీస్తే అనేక సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. సిజేరియన్ ఎప్పుడు చేస్తారంటే.. » గర్భిణికి రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు » గర్భంలో బిడ్డ అడ్డం తిరగడం » గర్భాశయ ముఖ ద్వారాన్ని మాయ కమ్మేయడం వంటి అత్యవసర సమయాల్లో సిజేరియన్లు చేస్తారు. » తల్లి ప్రాణాలకు ముప్పు ఉన్న పరిస్థితుల్లో సిజేరియన్ చేస్తారు. అది భగవంతుడి నిర్ణయంపుట్టుక అనేది భగవంతుడు నిర్ణయించింది. ఆ సమ యంలోనే జననం జరగాలి. డెలివరీ డేట్లు ఒక రోజు అటు, ఇటు ముహూర్తం అడుగుతు న్నారు. వారం, తిథి, నక్షత్రం, తారాబలం, లగ్నబలం చూసుకున్న తర్వాతనే కాన్పుకెళుతున్నారు. రెండు, మూడు ఏళ్ల కిందట అంతగా లేకపోయినా, ప్రస్తుతం మంచిరోజు చూసుకునే సిజేరియన్ చేసుకుంటున్నారు. – సుధాకర్ గురుక్కల్, అర్చకులు, చిత్తూరు కడుపు కోత మంచిది కాదు చాలా మంది ముహూ ర్తం పెట్టి సిజేరియన్‌కు సిద్ధమవుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బిడ్డను ఆ సమయంలోనే ఆపరేషన్ చేసి తీయాలని చెప్పడం కరెక్ట్ కాదు. దీని వల్ల తల్లీ బిడ్డకు ప్రమాదం. సిజేరియన్ అనేది అత్యవసర మైతేనే చేయాలి. అది కూడా సమయాన్ని బట్టి సిజేరియన్ చేస్తాం. సిజేరియన్ విషయంలో వైద్యులపై ఒత్తిడి తేరాదు. – ప్రభావతి, డీసీహెచ్ఎస్, చిత్తూరు -
సీజేరియన్ తర్వాత బరువు పెరుగుతారా..?
సాధారణంగా సిజేరియన్ తర్వాత మహిళలు బరువు పెరుగుతారనే అ΄ోహ చాలామందిలో ఉంటుంది. సిజేరియన్ తర్వాత కొందరు కాస్తంత బరువు పెరిగినప్పటికీ అందుకు కారణం సిజేరియన్ మాత్రం కాదు. దేహానికి తగినంత శారీరక శ్రమలేక΄ోవడం వల్ల లేదా మరికొన్ని వేర్వేరు అంశాల వల్ల అలా జరిగినప్పుడు దాన్ని సిజేరియన్‌కు ఆపాదించడం జరుగుతుంది. బరువు పెరగకుండా ఉండేందుకు సిజేరియన్ అయిన పదిహేను రోజుల తర్వాత నుంచే నడక లేదా శరీరంపై భారం పడకుండా తేలిక΄ాటి వ్యాయామాలు మొదలుపెట్టవచ్చు. అయితే ఏవైనా ఇతరత్రా కారణాలతో కొందరు మహిళలను డాక్టర్లు ప్రత్యేకంగా విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వారు తప్ప అందరూ తమకు తగిన వ్యాయామాలను చేయవచ్చు. బరువు పెరగకుండా ఉండేందుకు సూచనలు:చిన్నారులకు తల్లి΄ాలు పట్టించడం వల్ల మహిళలు బరువు పెరగకుండా ఉంటారు. దీనివల్ల తల్లికీ, బిడ్డకూ ఇరువురికీ లాభమే. నడక వ్యాయామం అందరికీ ప్రయోజనకరం. మహిళలు నడక మొదలుపెట్టినప్పుడు రోజుకు కేవలం పది నిమిషాలు మాత్రమే నడుస్తూ కాలవ్యవధిని క్రమంగా పెంచుకుంటూ ΄ోవాలి. ఇలా చేస్తూపోతే మూడు నెలల నుంచి మహిళలు తమ అదనపు కొవ్వు కోల్పోతారు. ΄÷ట్ట కూడా మామూలు స్థితికి వచ్చి సెంట్రల్ ఒబేసిటీ కూడా తగ్గుతుంది. (చదవండి: బాలీవుడ్ నటి అనుష్క శర్మ మోనోట్రోఫిక్ డైట్: నిపుణులు ఏమంటున్నారంటే..!) -
ప్రెగ్నెన్సీ ఐదో నెల..సిజేరియన్‌కి వెళ్లొచ్చా?.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
నేను ప్రెగ్నెంట్‌ని. ఇప్పుడు అయిదవ నెల. ఎలాంటి పరిస్థితిలో సిజేరియన్‌కి వెళ్లొచ్చో చెప్తారా? – సీహెచ్. రమోల, చెన్నై మీకిప్పుడు అయిదవ నెల అంటున్నారు. సాధారణంగా సుఖ ప్రసవమా? లేక సిజేరియనా అనేది తొమ్మిదవ నెలలో అయితే కచ్చితంగా చెప్పగలుగుతాం. తల్లీ, బిడ్డ కండిషన్‌ను ఫిజికల్ ఎగ్జామ్, స్కానింగ్ ద్వారా చెప్పవచ్చు. కానీ కొన్ని కండిషన్స్‌లో మాత్రం తప్పకుండా సిజేరియనే చేయాల్సి ఉంటుంది. మీకు ఇంతకుముందేమైనా గర్భసంచికి సంబంధించిన సర్జరీ, రెండు లేదా ఎక్కువసార్లు సిజేరియన్ అయినా, మైయోమెక్టమీ (ఫైబ్రాయిడ్‌ను తొలగించే శస్త్రచికిత్స) సర్జరీ అయినా, యూటరైన్ అనామలీస్ (పుట్టకతోనే గర్భసంచీకి సంబంధించిన సమస్య) ఉన్నా, తొమ్మిదోనెలలో మాయ కిందకి ఉన్నా, పొట్టలో బిడ్డ ట్రాన్స్వర్స్ పొజిషన్ లేదా బ్రీచ్ పొజిషన్లో ఉన్నా, కవలలు, ట్రిప్లెట్స్ ఉన్నా. బిడ్డ రక్తప్రసరణకు సంబంధించిన సమస్యలు ఉన్నా, బిడ్డ నాలుగున్నర కేజీల కన్నా ఎక్కువ బరువు ఉన్నా, బీపీతో ఫిట్స్ వచ్చినా, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా, తొమ్మిదవనెలలో 38–39 వారాల మధ్య ముందుగానే అనుకుని సిజేరియన్ చేస్తారు. ఒకవేళ సాధారణ కాన్పులో నొప్పులు వస్తున్నప్పుడు.. బిడ్డ హార్ట్ బీట్ తగ్గినా, రక్తస్రావం అధికంగా అవుతున్నా.. ప్రోగ్రెస్ సరిగా లేనప్పుడు ఎమర్జెన్సీగా సిజేరియన్ చేయాల్సి వస్తుంది. ఏ ప్రాబ్లమ్ లేకపోయినా ఈ మధ్య మెటర్నల్ రిక్వెస్ట్ మీద కొంతమందికి ఆపరేషన్ చేస్తున్నారు. ఇది తల్లి ఆరోగ్యానికి అంత మంచిదికాదు. పేషంట్, కుటుంబానికి కౌన్సెలింగ్ చేసి.. సాధారణ కాన్పుతో ఉన్న ఉపయోగాలను, ఆపరేషన్ వల్ల కలిగే ఇబ్బందులను వివరించి అనవసరమైన సిజేరియన్ ఆపరేషన్లను ఆపుతున్నారు. -
పక్కా కమర్షియల్.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్‌కే మొగ్గు
బిడ్డకు జన్మనివ్వడం అంటే ప్రతి తల్లికీ పునర్జన్మ వంటిదే. సహజంగా సాధారణ (నార్మల్) డెలివరీ, సిజేరియన్ అని రెండు పద్ధతులు ఉంటాయి. సాధారణ పద్ధతిలో కాకుండా శస్త్రచికిత్స ద్వారా బిడ్డకు జన్మనివ్వడాన్ని సిజేరియన్ లేదా సీ – సెక్షన్ డెలివరీ అంటారు. సాధారణ పద్ధతిలో డెలివరీ జరగడం కష్టం అనుకున్నప్పుడు తల్లి, బిడ్డ ప్రాణాలను రక్షించడానికి సిజేరియన్ చేస్తారు. అయితే కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నా కాసుల కోసం.. లేనిపోని భయాందోళనలు సృష్టించి సిజేరియన్ ఆపరేషన్‌కు ఒప్పిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: = గుత్తి మండలానికి చెందిన లక్ష్మీదేవి గత బుధవారం పురిటినొప్పులు రాగానే అనంతపురంలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌హోంకు వచ్చింది. నాలుగు గంటల వ్యవధిలోనే ఆమెకు సిజేరియన్ చేసి కాన్పు చేశారు. పూర్తి స్థాయిలో రక్తపరీక్షలు చేయకుండానే కోత కాన్పు కానిచ్చేశారు. = ఉవరకొండకు చెందిన 21 ఏళ్ల సుల్తానా రజియా రెండో కాన్పు కోసం అనంతపురం వచ్చింది. మొదటి కాన్పు సుఖప్రసవం అయినా రెండో కాన్పులో మాత్రం ఆ అవకాశం లేదని సిజేరియన్ చేయాలని ఓ నర్సింగ్ హోం డాక్టర్లు చెప్పారు. దీంతో విధిలేక సిజేరియన్ ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సుఖప్రసవం జరిగి తల్లీ బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వ ఆకాంక్ష. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వాస్పత్రిలోనూ అవసరమైన అన్ని వసతులూ కల్పించింది. సిజేరియన్ ప్రసవాలు అత్యవసరమైతేనే చేయాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ ప్రైవేటు ఆస్పత్రులు యథేచ్ఛగా కోత కాన్పులు (సిజేరియన్లు) చేస్తూనే ఉన్నాయి. పేషెంటు రావడమే ఆలస్యం... ఏదో ఒక కారణం చెప్పి సిజేరియన్ ప్రసవం చేస్తున్నారు. సిజేరియన్ ద్వారా ప్రసవం చేయడం అటు తల్లికీ బిడ్డకూ మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదే పదే హెచ్చరిస్తున్నా ప్రైవేటు ఆస్పత్రుల్లో కోతల ప్రసవాలకు నియంత్రణే లేకుండాపోతోంది. వ్యాపారంగా మారిన ప్రసవాలు ప్రసవాలు పక్కా వ్యాపారమయ్యాయి. సాధారణ ప్రసవమైతే నర్సింగ్‌హోంలో రూ.10 వేలు కూడా బిల్లు కాదు. అదే సిజేరియన్ అయితే ఆస్పత్రి శ్రేణులను బట్టి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేస్తారు. మూడు రోజులు ఇన్పేòÙంటుగా ఉంటే కనిష్టంగా రూ.50వేలు వేయొచ్చు. దీనికోసమే ఎక్కువ నర్సింగ్ హోంలలో సిజేరియన్ ప్రసవాలకే మొగ్గుచూపుతున్నారు. అదే ప్రభుత్వాస్పత్రుల్లో ప్రైవేటుతో పోల్చుకుంటే చాలా తక్కువ సిజేరియన్ ప్రసవాలుంటాయి. ఇకనైనా ప్రైవేట్ వైద్యులు తల్లీబిడ్డల ఆరోగ్యం దృష్ట్యా సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని ప్రజలు సూచిస్తున్నారు. అనవసరంగా సిజేరియన్ చేయొద్దు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్ చేశామంటే దానికి ఆడిట్ జరుగుతుంది. కారణం కచ్చితంగా చెప్పాలి. అందుకే ప్రభుత్వాస్పత్రుల్లో విధిలేకపోతే తప్ప సిజేరియన్ చేయం. ప్రైవేటు ఆస్పత్రులకు కూడా నియంత్రణ ఉంది. డీఎంహెచ్ఓ పర్యవేక్షణలో ఉంటుంది. ఎవరైనా సరే ప్రత్యేక కారణం లేకుండా సిజేరియన్ ప్రసవం చేయకూడదు. –డాక్టర్ కృష్ణవేణి, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్), అనంతపురం సిజేరియన్ డెలివరీతో నష్టాలు = డెలివరీ సమయంలో తల్లికి ఎక్కువగా రక్తస్రావం జరుగుతుంది. = సిజేరియన్ గాయం వల్ల తల్లికి భవిష్యత్‌లో ఇతర సమస్యలు రావచ్చు. = ఒక్కోసారి ఇన్ఫెక్షన్లు సోకితే తల్లికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. = సాధారణ ప్రసవమైతే వెంటనే శిశువుకు తల్లిపాలు వస్తాయి. సిజేరియన్ అయితే ఆలస్యం కావచ్చు. = సిజేరియన్ ప్రసవం వల్ల శిశువుకు శ్వాసకోశ సమస్యలు రావచ్చు. = ఒకసారి సిజేరియన్ అయితే రెండోసారి గర్భం దాల్చినప్పుడు మరిన్ని సమస్యలుంటాయి. = సిజేరియన్ వల్ల దీర్ఘకాలంలో వెన్నుపూస సమస్యలు లేదా ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువ. -
వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి?
భద్రాచలం అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రిలో సిజేరియన్ చేయించుకున్న ఓ మహిళ తీవ్ర రక్తస్రావంతో మృతి చెందడం వివాదాస్పదమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణానికి చెందిన రేష్మ(21)ను ఆదివారం మొదటి కాన్పు కోసం కుటుంబ సభ్యులు మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. సాధారణ ప్రసవం చేసేందుకు వీలుకాక పోవడంతో అక్కడి వైద్యులు సిజేరియన్ చేసి డెలివరీ నిర్వహించారు. రేష్మ సుమారు రెండు కేజీలు బరువు ఉన్న మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ సమయంలో, ఆ తర్వాత అధికంగా రక్తస్రావం కావడంతో రేష్మను మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో కుటుంబీకులు వెంటనే అక్కడికి తరలించినప్పటికీ రక్తస్రావం అదుపులోకి రాకపోవడంతో ఆమె మృతి చెందింది. భద్రాచలం ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే రేష్మ మృతి చెందిందన్న వాదనలు తొలుత వెల్లువెత్తాయి. అయితే భద్రాచలం డాక్టర్లు మాత్రం ఆస్పత్రికి వచ్చేలోగానే రేష్మ మృతి చెందిందని, తమ నిర్లక్ష్యం లేదని చెబుతున్నారు. మణుగూరులో రేష్మకు ఆపరేషన్ చేస్తున్న సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా? రక్తస్రావం కావడంతో పాటు రక్తం తక్కువగా ఉన్న విషయం ముందే తెలిసినప్పటికీ ఆపరేషన్ చేసేశారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సిఉంది. జిల్లావైద్యాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబసభ్యులు కోరుతున్నారు. భద్రాచలం వచ్చేలోపే మృతి చెందింది మణుగూరు ఆస్పత్రి నుంచి భద్రాచలంఆస్పత్రికి వచ్చేలోపే బాలింత ఆరోగ్య పరిస్థితి విషమించింది. స్పృహ కోల్పోయి, అప్పటికే మృతి చెందింది. మా దగ్గర వైద్యులు సకాలంలోనే స్పందించారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు పంచనామా నిర్వహించాం. –డాక్టర్ రామకృష్ణ, భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ మా నిర్లక్ష్యం లేదు.. రేష్మకు సిజేరియన్ చేసి కాన్పు జరిపారు. చికిత్స అందించడంతో మా దగ్గర వైద్యుల నిర్లక్ష్యమేమీ లేదు. ఆపరేషన్ తర్వాత బ్లీడింగ్ ఎక్కువ కావడంతో భద్రాచలం ఆస్పత్రికి రిఫర్ చేశాం. –డాక్టర్ విజయ్ కుమార్, మణుగూరు ఆస్పత్రి సూపరింటెండెంట్ -
షాకింగ్ ఘటన.. 5 ఏళ్లుగా మహిళ పొట్టలోనే కత్తెర..!
తిరువనంతపురం: ఆపరేషన్ చేస్తూ పొట్టలోనే కత్తెర, బ్లెడ్ వంటివి వదిలేసే సంఘటనలు సినిమాల్లో చూసే ఉంటారు. అయితే, నిజ జీవితంలో అలాంటి షాకింగ్ సంఘటన కేరళలోని కోజికోడ్‌లో వెలుగు చూసింది. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 5 ఏళ్ల పాటు ఓ మహిళ పొట్టలోనే కత్తెర ఉండిపోయిన ఈ సంఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. ఐదేళ్ల తర్వాత ఆపరేషన్ చేసి మహిళ పొట్టలోంచి 11 సెంటీమీటర్ల పొడవైన కత్తెరను తొలగించారు వైద్యులు. ఐదేళ్ల క్రితం హర్షీనా అశ్రఫ్ అనే మహిళకు ఆపరేషన్ చేసిన క్రమంలో పొట్టలోనే కత్తెరను వదిలేశారు వైద్యులు. ఏం జరిగిందింటే? 2017లో మూడో కాన్పు కోసం కోజికోడ్‌లోని వైద్య కళాశాలకు వెళ్లింది బాధితురాలు హర్షీనా అశ్రఫ్. ఆపరేషన్ చేసిన తర్వాత పొట్టలో విపరీతమైన నొప్పి ఏర్పడిందని.. నొప్పి తీవ్రమవటం వల్ల మరో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంది. స్కానింగ్ తీయగా పొట్టలో కత్తెర ఉన్నట్లు తెలిసింది. ‘2017, సెప్టెంబర్ 30 ఆపరేషన్ కోసం వెళ్లాను. ఆ తర్వాత నాకు విపరీతమైన నొప్పి వచ్చింది. పలువురు వైద్యులను కలిసినా నా నొప్పికి పరిష్కారం లభించలేదు. ఆ తర్వాత సిటీ స్కాన్ చేయగా అసలు విషయం తెలిసింది. పొట్టలో ఇనుప వస్తువు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత కత్తెరగా చెప్పారు.’ అని బాధితురాలు తెలిపారు. కత్తెర ఉన్నట్లు తెలిసిన తర్వాత మళ్లీ తనకు ఎక్కడైతే ఆపరేషన్ చేశారో అదే ఆసుపత్రికి వెళ్లారు బాధితురాలు. వైద్యులకు విషయం తెలపగా.. ఆపరేషన్ చేసి కత్తెరను తొలగించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తాను అనుభవించిన నరకంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్‌లకు ఫిర్యాదు చేశారు బాధితురాలు హర్షీనా అశ్రఫ్. దీంతో ఈ అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని ఆరోగ్య శాఖ అదనపు చీఫ్ సెక్రెటరీని ఆదేశించారు ఆరోగ్య మంత్రి. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: దేశంలోనే తొలి ‘సోలార్’ గ్రామంగా మొధేరా.. ప్రధాని మోదీ ప్రకటన -
కాళ్లు మొక్కుతం, కనికరించండన్నా.. పట్టించుకోలేదు!
‘సారూ..బిడ్డ పురిటినొప్పులతో బాధపడ్తోంది..ఆ గోస సూడలేకపోతున్నం.. బాంచెన్.. ఆపరేషన్ జేయుండ్రి.. మీ కాళ్లు మొక్కుతం..కనికరం సూపుండ్రి..’అని కాళ్లుపట్టుకుని వేడుకున్నా వైద్యులు, సిబ్బంది పట్టించుకోలేదు. పండంటి బిడ్డ పుట్టబోతుందని ఆశపడ్డ ఆ తల్లికి వైద్యులు సిజేరియన్ చేసి చనిపోయిన శిశువును చేతిలో పెట్టడంతో నిరాశ ఎదురైంది. మెట్పల్లి(కోరుట్ల): జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన ఎర్రబోయిన అశోక్ భార్య సుజాత(22)కు ఇటీవలే నెలలు నిండాయి. తొలికాన్పు కావడంతో ఈనెల 19న మెట్‌పల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు పురిటినొప్పులు మొదలయ్యాయి. అయితే, సాధారణ ప్రసవం కోసం మరుసటిరోజు సాయంత్రం వరకూ వైద్యసిబ్బంది ప్రయత్నం చేశారు. ప్రసవం కాకపోవడంతో సిజేరియన్ చేయాలని, లేదంటే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తామని కుటుంబసభ్యులు వేడుకున్నారు. సిబ్బంది అంగీకరించకపోగా, కుటుంబసభ్యులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం వరకూ పురిటినొప్పులతో బాధపడ్తున్న సుజాతకు చివరికి వైద్యులు సిజేరియన్ చేశారు. అయితే.. అప్పటికే కడుపులో బిడ్డ చనిపోయింది. దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే బిడ్డ చనిపోయిందని కుటుంబసభ్యులు ఆపరేషన్ థియేటర్ వద్ద ఆందోళనకు దిగారు. తర్వాత జాతీయ రహదారిపై బైఠాయించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని బాధ్యులైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. ఈ విషయంపై ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ సాజిద్‌ను¯ ఆరాతీయగా..సుజాతకు ఈనెల 21న ప్రసవం చేయాల్సి ఉందన్నారు. అప్పటిదాకా సాధారణ ప్రసవం కోసం యత్నించామని తెలిపారు. వీలుకాకపోవడంతో సిజేరియన్ చేశామని, మృతశిశువు జన్మించిందని, ఇందులో సిబ్బంది పొరపాటు ఏమీలేదని స్పష్టం చేశారు. -
ఎమర్జెన్సీలోనూ నార్మలే..! కడుపు కోతలకు చెక్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో సాధారణ కాన్పులపై దృష్టి సారించిన వైద్యారోగ్యశాఖ అధికారులు అత్యవసర సమయాల్లోనూ నార్మల్ డెలివరీ చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. తల్లికో, బిడ్డకో ప్రాణహాని ఉంటే తప్ప సిజేరియన్ డెలివరీ చేయకూడదు. కానీ సిజేరియన్ డెలివరీతో ఎదురుకానున్న ఆరోగ్య సమస్యలపై అవగాహన లేకపోవడం, ముహూర్తాలు చూసుకుని ప్రసవాలు చేయడం వంటి కారణంగా చాలా మటుకు సిజేరియన్ డెలివరీకే మొగ్గు చూపుతుంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గర్భిణులకు మొదటి వైద్య పరీక్షల నుంచి వారిలో సాధారణ ప్రసవాల ఆవశ్యకతపై ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, ఇతర ఆరోగ్య సిబ్బంది వారిలో అవగాహన పెంచుతున్నారు. పుట్టిన బిడ్డకు మొదటి గంటలో ఇచ్చే తల్లిపాలు బిడ్డకు జీవితాంతం రోగనిరోధకశక్తిని పెంచేందుకు దోహదం చేస్తుందన్న విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ చర్యలు చాలా మట్టుకు ఫలితాలిస్తోంది. వారంపాటు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనూ వైద్యారోగ్యశాఖ ముందుజాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. డెలివరీ తేదీలు దగ్గరలో ఉన్న గర్భిణులను ముందస్తుగా ప్రభుత్వాస్పత్రులకు, మాతాశిశు సంరక్షణ కేంద్రాలకు తరలించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సర్కారు దవాఖానాలో గైనకాలజీ, మత్తు డాక్టర్లు లేనందున పూర్తిగా నార్మల్ డెలివరీలే జరుగుతున్నాయి. నార్మల్ డెలివరీ కావడం సంతోషంగా ఉంది నాలుగు రోజుల క్రితం నొప్పులు రావడంతో మా కుటుంబ సభ్యులు సిద్దిపేట గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పారు. ఒక రోజు అనంతరం నార్మల్ డెలివరీతో బాబు పుట్టాడు. సంతోషంగా ఉంది. నార్మల్ డెలివరీ గురించి రెండు నెలల క్రితం ఆస్పత్రికి వచ్చిన అప్పటి నుండే వైద్యులు, సిబ్బంది అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ కావడంతో రూ.30వేల నుంచి రూ.40 వేలు ఆదా అయ్యింది. కేసీఆర్ కిట్ కూడా ఇచ్చారు. – పద్మ, బాలింత, నర్మెట నిర్మల్ ప్రభుత్వాస్పత్రిలో.. గర్భిణితో వ్యాయామం చేయిస్తున్న ఈ దృశ్యం నిర్మల్ ప్రభుత్వాస్పత్రిలోనిది. నార్మల్ డెలివరీ అయ్యేలా గర్భిణులకు ఇలా వ్యాయామంతోపాటు, కౌన్సెలింగ్ ఇస్తున్నారు. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో గర్భిణులకు సాధారణ ప్రసవాల ఆవశ్యకతను వివరిస్తున్నారు. పడవలో వాగు దాటించారు పడవలో తీసుకొస్తున్న ఈ గర్భిణి పేరు మోర్రం పార్వతి. ములుగు జిల్లా రామచంద్రాపురం గ్రామం. గురువారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో ట్రాక్టర్లో పాత్రపురం తీసుకొచ్చి అక్కడి నుంచి పడవలో వాగు దాటించారు. అక్కడి నుంచి 108 వాహనంలో వెంకటాపురం ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి అత్యవసర సమయంలోనూ వైద్యారోగ్యశాఖ అధికారులు ఆమెకు నార్మల్ డెలివరీ చేయగలిగారు. పార్వతికి పండంటి బాబు పుట్టాడు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ముందుజాగ్రత్త చర్యగా.. భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా బీమారం గ్రామానికి చెందిన శ్రావణి అనే గర్భిణిని ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యారోగ్యశాఖ సిబ్బంది మంచిర్యాలలోని మాతాశిశుసంరక్షణ కేంద్రానికి తరలించారు. రెండు రోజుల క్రితం వైద్యులు ఆమెకు నార్మల్ డెలివరీ చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడటంతో నార్మల్ డెలివరీ అయిందని శ్రావణి తెలిపింది. చదవండి: నూతన జోనల్ విధానం ఆధారంగా గురుకులాల్లో ఉద్యోగుల కేటాయింపులు -
Health: సిజేరియన్.. కుట్ల నుంచి చీము.. ఏమైనా ప్రమాదమా?
నాకు సిజేరియన్ అయ్యి మూడు నెలలవుతోంది. మా ఊళ్లో చేశారు. కుట్ల దగ్గర చాలా నొప్పి వస్తోంది. యాంటీబయాటిక్స్ వాడినా ఫలితం లేదు. ఈ మధ్య అంటే ఓ పదిరోజులగా కుట్ల నుంచి పస్ కూడా వస్తోంది. నేను సిటీకి వెళ్లి చూపించుకోవాలా? ఏమైనా ప్రమాదమా? – టి. హర్షిత, దేశాయిపేట, తెలంగాణ సిజేరియన్ ఆపరేషన్ తర్వాత కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ రావటం సాధారణమే.పేషంట్ బరువును బట్టి, వాడిన యాంటీబయాటిక్స్, సర్జరీ టైమ్‌ను బట్టి రిస్క్ పెరుగుతుంది. కానీ ఇది చాలాసార్లు ఆపరేషన్ మొదటి, రెండు వారాల్లో బయటపడుతుంది. మీకు మూడు నెలల తర్వాత రావడం.. అంత మంచిది కాదు. దీనిని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇప్పుడు చీము వస్తోంది అన్నారు. కాబట్టి వెంటనే సీనియర్ డాక్టర్‌ను కలవండి. చీము వస్తున్న చోటు నుంచి దూదితో వూండ్ స్వాబ్ తీస్తారు. దానిని బట్టి అందులో ఏ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంది, ఎలాంటి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి అనేది తెలుస్తుంది. కొన్ని కేసెస్‌లో యాంటీబయాటిక్స్ వాడినా పస్ తగ్గదు. అప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో పస్ లోపలి కుట్ల దగ్గర నుంచి వస్తోందా? ఏదయినా sinus tractలాగా ఫామ్ అయిందా అని చూస్తారు. ఎమ్ఆర్ఐ స్కాన్ కూడా చేయాల్సిరావచ్చు. జనరల్ సర్జన్ అభిప్రాయం కూడా తీసుకోవాలి. మళ్లీ చిన్న ఆపరేషన్ చేసి ఆ చీమునంతా తీసేసి క్లీన్ చేసి ఏ ట్రాక్ట్ ఫామ్ అయిందో దానిని మూసేసి.. యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. ఈ ట్రాక్ట్ నుంచి తీసినదంతా మళ్లీ టెస్ట్‌కు పంపాలి. కొంతమందిలో టీబీ వల్ల కూడా ఇలా సిజేరియన్ అయిన చాలా నెలల తర్వాత ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యాంటీ–టీబీ ట్రీట్మెంట్ ద్వారానే ఇవి పూర్తిగా నయమవుతాయి. ఇలాంటి కేసెస్‌ను క్లోజ్‌గా ఫాలో అప్ చేయాలి. కుట్లకు వాడే కొన్ని రకాల మెటీరియల్స్ వల్ల కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Vasectomy Operations: వెసక్టమీ చేయించుకుంటే పురుషులు శక్తిహీనులవుతారా? Lump In Breast During Pregnancy: ఐదో నెలలో రొమ్ములో గడ్డలు తగలడం నార్మల్ కాదు! వెంటనే.. -
ప్రైవేట్ ఆస్పత్రులు తగ్గేదేలే.. 94 శాతం సిజేరియన్లే!
భైంసాటౌన్(ముధోల్): జిల్లాలో సిజేరియన్ కాన్పులు ఎక్కువగా జరుగుతున్నాయని, సాధారణ ప్రసవాలపై దృష్టి పెట్టాలని సాక్షాత్తు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు గత మార్చిలో జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు, అంగన్వాడీలకు సూచించారు. సిజేరియన్లపై దృష్టి పెట్టాలని సూచించగా, ఆరునెలల్లో మార్పు వస్తుందని కలెక్టర్ సైతం మంత్రికి హామీ ఇచ్చారు. ఈ మేరకు తరచూ వైద్యాధికారులు, అంగన్వాడీలతో సమావేశాలు నిర్వహిస్తూ సాధారణ కాన్పులు పెంచాలని కలెక్టర్ సూచిస్తున్నారు. అలాగే జిల్లాలో సిజేరియన్ కాన్పులు ఎక్కువగా నిర్వహిస్తున్న పలు ఆస్పత్రులపై చర్యలు సైతం తీసుకున్నారు. అయినా సానుకూల మార్పు కనిపించడం లేదని వైద్యారోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తుండడం గమనార్హం. 94 శాతం సిజేరియన్లే... రాష్ట్రంలో 2021–22లో సిజేరియన్ ఆపరేషన్లపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన నివేదికలో నాలుగు జిల్లాల్లో 94శాతం సిజేరియన్లే నమోదైనట్లు వెల్లడైంది. ఇందులో నిర్మల్ జిల్లా మూడో స్థానంలో ఉండడం కలవరపాటుకు గురి చేస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే కడుపుకోతలు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. ఈఏడాది జనవరి నుంచి మే వరకు జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో 2600 వరకు ప్రసవాలు జరుగగా, వీటిలో 2146 సిజేరియన్లే కావడం గమనార్హం. కేవలం 454 సాధారణ కాన్పులు జరిగాయి. అదే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిశీలిస్తే.. 2,925 ప్రసవాలు జరుగగా, 1171 సాధారణ, 1754 సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. ప్రైవేట్‌తో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉన్నా.. ఇంకా తగ్గాల్సిన అవసరముంది. అవగాహన కల్పిస్తేనే... ఒకప్పుడు సర్కారు దవాఖాన్లలో లేదంటే ఇళ్లలోనే ఎక్కువగా కాన్పులు చేసేవారు. చాలావరకు సాధారణ కాన్పులే జరిగేవి. ఇంటి వద్ద నొప్పులొస్తే మంత్రసాని ఇంటికే వచ్చి ప్రసవం చేసేది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో మారిన ఆçహార అలవాట్ల కారణంగానో, నొప్పులు భరించలేకనో సిజేరియన్ ప్రసవాలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతోపాటు కొందరు సమయం, ముహూర్తం చూసుకుని మరీ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. సిజేరియన్లతో తల్లీబిడ్డ ఇద్దరికీ ప్రమాదమేనని చెబుతున్న ప్రభుత్వం సాధారణ ప్రసవాలపై దృష్టి పెట్టాలని పదేపదే సూచిస్తోంది. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వంటి పథకాలు ప్రవేశపెట్టి మరీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులపై దృష్టి పెట్టింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అవగాహన లేకనో, గర్భిణుల బంధువుల ఒత్తిడితోనో సిజేరియన్లు చేస్తున్నారు. సుఖప్రసవానికి వీలులేనప్పుడో, కడుపులో బిడ్డ సరిగా లేనప్పుడో చేయాల్సిన సిజేరియన్లు.. అవసరం లేకున్నా చేస్తున్నారని విమర్శలున్నాయి. ఫలితంగా కడుపు కోతల్లో నిర్మల్ జిల్లా టాప్‌లిస్ట్‌లోకి చేరింది. అనవసరంగా సిజేరియన్లు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే జిల్లాలో వీటిని తగ్గించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవగాహన కల్పిస్తున్నాం ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలపై దృష్టి పెడుతున్నాం. తరచూ నిర్వహించే సమావేశాల్లోనూ సిజేరియన్ కాన్పులు తగ్గించాలని సూచిస్తున్నాం. కలెక్టర్ సైతం ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులతో సిజేరియన్లు తగ్గించాలని సూచిస్తున్నారు. మార్పు రాని పక్షంలో చర్యలు తీసుకుంటాం. –ధన్‌రాజ్, డీఎంహెచ్‌వో -
కడుపుకోతల్లో కరీంనగర్ టాప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 60.7శాతం ప్రసవాలు సిజేరియన్ పద్ధతిలో జరుగుతున్నాయని తెలంగాణ జనాభా, ఆరోగ్య నివేదిక వెల్లడించింది. కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ప్రచురించిన ఈ రిపోర్టును గణాంకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం విడుదల చేశారు. నివేదిక ప్రకారం... సిజేరియన్ ప్రసవాలు కుమ్రం భీం జిల్లాలో అత్యంత తక్కువగా 27.2% జరుగుతున్నాయి. అత్యంత అధికంగా కరీంనగర్ జిల్లాలో 82.4% జరుగుతున్నాయి. ఇక ప్రైవేట్ ఆసుపత్రు ల్లో 81.5% ప్రసవాలు సిజేరియన్ పద్ధతిలో జరుగుతుండగా, అందులో అత్యధికంగా కరీంనగర్ జిల్లా లో 92.8% జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో మొత్తం 44.5% మాత్రమే సిజేరియన్‌లుండగా, అత్యధికంగా జనగాంజిల్లాలో 73% సిజేరియన్ ప్రసవాలు అవుతున్నాయి. నివేదికలోని ముఖ్యాంశాలు... ►15 ఏళ్ల లోపు జనాభా అధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. అక్కడి జనాభాలో 27.8% మంది ఆ వయస్సులోపు వారే. ఆ వయస్సువారి తెలంగాణ సరాసరి జనాభా 22.5%. ►రాష్ట్రంలో వెయ్యి మంది పురుషులకు 1,049 మంది స్త్రీలు ఉన్నారు. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 1,219 మంది ఉండగా, హైదరాబాద్‌లో అత్యంత తక్కువగా 959 మంది ఉన్నారు. ►తెలంగాణలో 95.8 శాతం మంది ఇళ్లల్లో అయోడైజ్డ్ ఉప్పు వాడుతున్నారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 99.1శాతం మంది వాడుతున్నారు. ►రాష్ట్రంలో 60.8శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా ఉంది. అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లాలో 72శాతం మందికి ఉంది. ►రాష్ట్రంలో 15–19ఏళ్ల వయస్సులో తల్లులైనవారు, గర్భిణీలుగా ఉన్నవారు 5.8% ఉండగా, వీరిలో అత్యంత తక్కువగా సిద్దిపేట జిల్లాలో ఒక శాతం ఉన్నారు. అత్యంత ఎక్కువగా జోగులాంబ గద్వాల జిల్లాలో 15.9శాతం ఉన్నారు. ►రాష్ట్రంలోఆసుపత్రుల్లో ప్రసవాలు సరాసరి 97% ఉండగా, వరంగల్ రూరల్ జిల్లాలో వంద శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. ►రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 49.7% జరుగుతుండగా, ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 66.8శాతం ఉన్నాయి. ►రాష్ట్రంలో 15ఏళ్లు పైబడినవారిలో తీవ్రమైన షుగర్ వ్యాధితో మందులు వాడుతున్న పురు షులు 18.1శాతం ఉన్నారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 26.8 శాతం మంది ఉన్నారు. కాగా, మహిళల్లో 15 ఏళ్లు పైబడిన వారిలో 14.7శాతం ఉండగా, హైదరాబాద్‌లో 21.2శాతం ఉన్నారు. -
73 ఏళ్ల వయసులో గర్భం
-
73 ఏళ్ల వయసులో అమ్మ కాబోతున్న బామ్మ
గుంటూరు: తల్లి కావాలన్న ఆమె కల ఎట్టకేలకు నెరవేరే రోజొచ్చింది. 73 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన ఆమెకు గురువారం వైద్యులు సిజేరియన్ చేసి పురుడుపోయనున్నారు. ఐవీఎఫ్ స్పెషాలిటీ వైద్య నిపుణుడు, గుంటూరు అహల్యా హాస్పిటల్ అధినేత డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపూడికి చెందిన యర్రమట్టి రామరాజారావుతో మంగాయమ్మకు 1962లో వివాహమైంది. రైతు కుటుంబానికి చెందిన రామరాజారావు దంపతులు వివాహమైన నాటి నుంచి సంతానం కోసం ప్రయత్నించారు. మంగాయమ్మకు 73 ఏళ్లు రావడంతో పిల్లలు పుట్టడం లేదన్న బాధతో వారు గతేడాది చెన్నై వెళ్లి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ద్వారా సంతానం పొందాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. 2018 నవంబర్‌లో ఆ దంపతులు గుంటూరు అహల్యా ఆస్పత్రిని సంప్రదించగా.. ఐవీఎఫ్ పద్ధతిలో భార్య గర్భం దాల్చింది. దీంతో ఆమెకు ఆస్పత్రిలోనే ప్రత్యేక గదిని ఏర్పాటుచేసి వైద్యసేవలందించారు. బీపీ, షుగర్ లేకపోవడంతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఎదిగింది. గుండె వైద్య నిపుణుడు పీవీ మనోహర్, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణుడు శనక్కాయల ఉదయ్‌శంకర్ పర్యవేక్షణలో రోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ తల్లి, గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు మంగాయమ్మకు ఆపరేషన్‌చేసి పురుడుపోయనున్నట్లు డాక్టర్ ఉమాశంకర్ చెప్పారు. 73 ఏళ్ల వృద్ధురాలు గర్భం దాల్చడం దేశంలో ఇదే మొదటిసారని వివరించారు. -
అదేమైనా సమస్యా?
‘హెవీ పీరియడ్స్’ అనే మాటను ఇటీవల ఎక్కడో చదివాను. అదేమైనా సీరియస్ సమస్యనా? అది రావడానికి గల కారణాలను తెలియజేయగలరు? – పీఆర్, సూర్యాపేట సాధారణంగా పీరియడ్స్ సమయంలో ఒక్కొక్కరి శరీరతత్వాన్నిబట్టి మూడు నుంచి అయిదు రోజుల వరకు బ్లీడింగ్ అవ్వడం సాధారణం. వారికి ఆ సమయంలో 10 ఎమ్ఎల్ నుంచి 35 ఎమ్ఎల్ వరకు రక్తం పోవడం జరుగుతుంది. కొందరిలో రెండు నుంచి ఏడు రోజుల వరకు మామూలుగా బ్లీడింగ్ అవ్వొచ్చు. మరికొందరిలో బ్లీడింగ్ చాలా ఎక్కువగా అవుతుంది. ఇది ఏడు రోజులకంటే ఎక్కువగా హెవీ బ్లీడింగ్ అవ్వడం, బ్లీడింగ్‌లో 80 ఎమ్ఎల్ వరకు రక్తం పోవడాన్ని, అలాగే అయిదు రోజులు అయినా సరే అదే 80 ఎమ్ఎల్ రక్తం పోవడాన్ని ‘హెవీ పీరియడ్స్’ అంటారు. దీనికి అనేక రకాల కారణాలు ఉంటాయి. గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్, అండాశయాల్లో గడ్డలు, సిస్ట్లు, థైరాయిడ్, హార్మోన్ అసమతుల్యత, ఇతర హార్మోన్లలో మార్పులు, కాపర్ టీ వల్ల, రక్తం గూడుకట్టే గుణంలో సమస్యలు, అరుదుగా గర్భాశయ, అండాశయ క్యాన్సర్ వంటి ఎన్నో కారణాల వల్ల హెవీ పీరియడ్స్ రావొచ్చు. ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో ఎక్కువగా బ్లీడింగై రక్తం పోవడంవల్ల రక్తహీనత ఏర్పడటం, తద్వారా బలహీనత, నీరసం, ఆయాసం, ఒళ్లు నొప్పులు, ఇన్ఫెక్షన్స్ వంటి ఇతర సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత మరీ ఎక్కువగా ఉండి, అశ్రద్ధ చేస్తే అది ప్రాణాపాయస్థితికి దారి తీసే అపాయం ఉంది. కాబట్టి హెవీ పీరియడ్స్‌ని నిర్లక్ష్యం చేయకుండా ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. హెవీ బ్లీడింగ్‌కు గల కారణాలను తెలుసుకోవడానికి సీబీపీ, ప్లేట్లెట్ కౌంట్, సీటీ, బీటీ, స్కానింగ్, ప్యాప్ స్మియర్ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఆ తర్వాత సమస్యనుబట్టి చికిత్స తీసుకోవడం మంచిది. రక్తహీనత ఉంటే పౌష్టికాహారంతో పాటు ఐరన్ మాత్రలు కూడా వేసుకోవాలి. ఎండాకాలమైనా సరే వేడినీళ్లతో స్నానం చేయడం నాకు అలవాటు. ప్రెగ్నెన్సీ సమయంలో వేడినీళ్లతో స్నానం చేయడం మంచిదేనా? ‘హీట్ స్ట్రెస్’ అంటే ఏమిటి? – లహరి, కాకినాడ ప్రెగ్నెన్సీ సమయంలో వేడి నీళ్లతో స్నానం చెయ్యడంకన్నా గోరువెచ్చని నీళ్లతో చేయడం మంచిది. ఎండాకాలంలో మరీ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కొంత సమయం పాటు చెమటలు పట్టి అలసటగా అనిపిస్తుంది. దానివల్ల కడుపులో బిడ్డకు ఎటువంటి హానీ ఉండదు. ఎండలో ఎక్కువసేపు ఉండటం, పని చెయ్యడం, ఊపిరాడకుండా చేసేటటువంటి బిగుతుగా ఉండే బట్టలు ఎక్కువసేపు వేసుకొని ఉండటం, ఎక్కువగా విరామం లేకుండా శారీరక శ్రమ వంటి ఇతర పనుల వల్ల, ఒంట్లో ఉష్ణోగ్రత కంటే బయటి ఉష్టోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల కలిగే లక్షణాలను, ఇబ్బందులను ‘హీట్ స్ట్రెస్’ అంటారు. ఇందులో డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, కళ్లు తిరగటం, చెమటలు పట్టడం, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. నా వయసు 29 సంవత్సరాలు. మాకు ఒక బాబు. వాడికి ఒకటిన్నర ఏళ్లు. నా మొదటి కాన్పు సిజేరియన్ ద్వారా జరిగింది. అప్పట్లో కోలుకోవడానికి కాస్త టైమ్ పట్టింది. ఇప్పుడు రెండో కాన్పుకు వెళ్లాలనుకుంటున్నాం. కాన్పుకూ కాన్పుకూ మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? – ఆర్. వందన, ఖమ్మం తొమ్మిది నెలల పాటు గర్భంలో పెరిగే బిడ్డ, తల్లి నుంచి పోషకాలు తీసుకోవడం వల్ల... కాన్పు తర్వాత తల్లిలో అలసట, కండరాల బలహీనత, నడుము నొప్పి, రక్తహీనత, క్యాల్షియం లోపం వంటి సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువ. కాన్పు తర్వాత బిడ్డకు పాలిచ్చేటప్పుడు ఈ ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. ఈ బలహీనత నుంచి తల్లి పూర్తిగా కోలుకొని మామూలుగా అవ్వడానికి కనీసం రెండు సంవత్సరాలైనా పడుతుంది. ఇంకా పూర్తిగా కోలుకోకుండానే మళ్లీ గర్భం దాలిస్తే, బలహీనత ఇంకా ఎక్కువగా ఉండి, నడుము నొప్పులు, నీరసం, రక్తహీనత వంటి సమస్యలతో ఇబ్బందిపడాల్సి వస్తుంది. అంతేకాకుండా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఎక్కువ బరువు పెరగక పోవడం, నెలలు నిండకుండా కాన్పులు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొదటి కాన్పు సిజేరియన్ ద్వారా జరిగితే, గర్భాశయానికి వేసే కుట్లు మాని, మళ్లీ సాధారణస్థితికి రావడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. ఇంకా తొందరగా గర్భం దాల్చితే బిడ్డ పెరిగే కొద్దీ గర్భాశయం సాగటం జరుగుతుంది. అలాగే ముందు వేసిన కుట్లు పల్చబడి, కుట్ల దగ్గర నొప్పి ఎక్కువగా రావటం, కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తే కుట్లు తెరుచుకొని గర్భాశయం పగిలి, బిడ్డకి, తల్లికి ప్రాణాపాయం ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఆపరేషన్ అయినవాళ్లకు కాన్పుకి, కాన్పుకి మధ్య మూడు సంవత్సరాలు గ్యాప్ ఉంటే తల్లికి, బిడ్డకి మంచిది. లేదంటే కనీసం రెండు సంవత్సరాలైనా గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. - డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
ఆ కడుపుకోతకు కారణమెవరు?
లబ్బీపేట (విజయవాడ తూర్పు): మెరుగైన వైద్యం అందుతుందని విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రికి వస్తే బాలింత ప్రాణాలే పోయాయి. వచ్చేటప్పటికీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నా ఆపరేషన్ చేసే సమయంలో పొరపాటు జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండవల్లి మండలం గున్ననపూడికి చెందిన వంగా చిట్టెమ్మ శస్త్రచికిత్సను సీనియర్ రెసిడెంట్ చేయడం వల్లే పొరపాటు జరిగిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంట్రా వాస్కులర్ ప్రాబ్లమ్‌తో పాటు యూరిన్ బ్లాడర్ కూడా దెబ్బతినడంతో అనుభవం లేని వైద్యురాలు చేయడం వల్లే అలా జరిగి ఉండవచ్చని నిపుణులు అంచనాకు వస్తున్నారు. ఎస్‌ఆర్‌లకు బాధ్యత ఉంటుందా? ఒక ఏడాది కంపల్సరీ సర్వీస్ చేసేందుకు వచ్చిన సీనియర్ రెసిడెంట్లు ఎంతవరకు బాధ్యతగా విధులు నిర్వహిస్తారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం శాశ్వత వైðద్యుల కొరత తీవ్రంగా ఉండటంతో ఎస్‌ఆర్‌లపై ఆధారపడక తప్పట్లేదు. దీంతో చిట్టెమ్మ లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రసూతి విభాగంలోనే కాకుండా అన్ని విభాగాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సీనియర్ వైద్యులు చెబుతున్నారు. వారిపై ఆధారపడితే ఆస్పత్రి పరువు పోతుందంటున్నారు. సూపరింటెండెంట్ సార్.. ఇప్పుడేమంటారు? ఏడాది విధులు నిర్వహించి వెళ్లే వారిపై ఎలా ఆధారపడతామని, శాశ్వత వైద్యులు కావాలంటూ ఇటీవల జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ డి.రాజ్యలక్ష్మి కలెక్టర్‌ను కోరారు. తమ విభాగంలో తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుందని, అర్హత ఉన్న వైద్యులను నియమించాలన్నారు. ఈ సమయంలో సూపరింటెండెంట్ డాక్టర్ చక్రధర్ జోక్యం చేసుకుని ఎస్‌ఆర్‌లతో చేయించుకోవాలంటూ వితండవాదం చేశారు. కలెక్టర్ సాక్షిగా ఈ వాదన జరగ్గా, ఇప్పుడు ఎస్ఆర్ చేసిన సర్జరీ వికటించి బాలింత మృతిచెందగా, సూపరింటెండెంట్ ఏం సమాధానం చెబుతారనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి నిరుపేదల జీవితాలతో ఆడుకోకుండా వైద్యులను నియమించాల్సిన అవసరం ఉంది. వీఆర్ఎస్పై వెళ్లిన గత హెచ్‌వోడీ తమ విభాగంలో తీవ్రమైన వైద్యుల కొరత ఉందని, సౌకర్యాలతో పాటు వైద్యుల సంఖ్య పెంచాలని ఆరోగ్యశాఖ మంత్రితో పాటు ఇతర అధికారులు మంత్రులతో జరిగిన సమావేశంలో గత హెచ్‌వోడీ ప్రాధేయపడ్డారు. ఆమె మొరను ఎవరూ ఆలకించలేదు. పైగా ఏదైన ఘటన జరిగితే వైద్యులనే నిందించడం ప్రారంభించారు. దీంతో ఇక్కడ చేయలేమని భావించిందో ఏమో వీఆర్‌పై వెళ్లిపోయింది. ఆమె వెళ్లి రెండేళ్లు గడస్తున్నా పరిస్థితిలో ఏమీ మార్పు రాలేదు. ఇప్పుడున్న వైద్యులు సైతం అలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. అన్నీ చేశామంటారు.. ఇక్కడేం లేవు ప్రభుత్వాస్పత్రులకు అన్నీ చేశాం.. నాలుగేళ్లలో కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లామని వైద్యమంత్రి తరచూ గొప్పలు చెప్పుకుంటారు. కానీ, ఇక్కడ పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా ఉంది. పడకలు 90 నుంచి 240కు పెంచారు. పెరిగిన పడకలకు వైద్యులు, సిబ్బంది ఎక్కడ నుంచి వస్తారనే ఆలోచన చేయలేదు. నాలుగేళ్ల కిందటే ప్రస్తుతం ప్రసూతి విభాగంలో మూడు యూనిట్లు ఉండగా, ఆరు యూనిట్లు చేయాలని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ, దానిపై ఇప్పటికీ స్పందన లేదు. మరి నిరుపేదలకు మెరుగైన వైద్యం ఎక్కడి నుంచి అందుతుందని ప్రశ్నిస్తున్నారు. ఒక్కరే అసిస్టెంట్.. పది సిజేరియన్లు రోజూ సాయంత్రం 4 నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకూ ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ విధుల్లో ఉంటారు. ఆ సమయంలో పది సిజేరియన్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరో పది నుంచి పదిహేను సాధారణ డెలివరీలు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి ఇద్దరికి చేయాలంటే ఎస్‌ఆర్‌లపై ఆధారపడక తప్పదు. నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటే అలాంటి పరిస్థితి తలెత్తదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిపుణులైన వైద్యులు మరింత మందిని నియమించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
అమ్మో.. సిజేరియన్
తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఒక్క రోజు నిరీక్షిస్తే సహజ ప్రసవమవుతుంది. అలా అయితే తమ జేబులు ఎలా నిండుతాయి? బిడ్డ అడ్డం తిరిగే ప్రమాదం ఉంది, వెంటనే సిజేరియన్ చేయాల్సిందే. ఆలస్యం చేస్తే తల్లీబిడ్డుకు ముప్పు. మీరు ఆలోచించుకుని చెబుతామంటే కుదరదు, ఆపరేషన్ థియేటర్లో అన్నీ సిద్ధం. ...ఇదీ బెంగళూరులో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుల హడావుడి. ఎలాగైనా సిజేరియన్ ప్రసవం చేయాలి, ఫీజులు వసూలు చేయాలి అనే ధోరణితో పాటు ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పుల వల్ల కూడా కోత ప్రసవాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. బెంగళూరు (యశవంతపుర): కోత ప్రసవాలు (సిజేరియన్ కాన్పులు) గత 10 ఏళ్ల నుంచి క్రమక్రమంగా పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. బెంగళూరుతో పాటు రాష్ట్రంలోనూ సాధారణ ప్రసవాల స్థానాన్ని సిజేరియన్లు ఆక్రమిస్తున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సమీక్ష–4లో ఈ చేదు వాస్తవం వెల్లడైంది. కాసుల కక్కుర్తితో ప్రైవేట్ ఆస్పత్రులు అవసరం లేకపోయినా కోత ప్రసవాలు చేసి లక్షల రూపాయలు గుంజుతున్నాయన్న ఆరోపణలకు బలం చేకూరింది. కోత ప్రసవాలదే జోరు ♦ సమీక్ష తెలిపిన మేరకు.. రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు 8 శాతం పెరిగాయి. 2005–2006లో ప్రతి వంద కాన్పుల్లో 31.9 శాతం ఉన్న సిజేరియన్లు 2015–2016లో నాటికి గణనీయంగా పెరిగి 40.3 శాతానికి చేరాయి. ♦ పదేళ్లతో పోల్చితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్లు 0.3 శాతం తగ్గాయి. నగరంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 21 శాతం, గ్రామీణ సార్వజనిక ఆస్పత్రుల్లో 14.8 శాతం సిజేరియన్ల కాన్పులే నమోదవుతున్నాయి. ♦ బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రులలో ప్రతి వంద కాన్పుల్లో 50–60 శాతం సిజేరియన్లే. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం సిజేరియన్ ప్రసవాలు 10–15 శాతం మించరాదు. తల్లీబిడ్డ ప్రాణాలకు ముప్పున్న సమయంలో మాత్రమే సిజేరియన్‌ను ఎంచుకోవాలని ఆరోగ్య సంస్థ నిర్దేశిస్తోంది. ♦ రాష్ట్రంలో 2005–2006లో 15.5 శాతం ఉన్న సిజేరియన్లు 2016 వచ్చేసరికి 26.2 శాతం నమోదైయింది. నగర ఆస్పత్రులలో 29.2 శాతం సిజేరియన్ ద్వారానే శిశువులు జన్మిస్తున్నారు. ఎప్పుడు అవసరం అంటే... ‘శిశువు పెద్దిగా, తూకం ఎక్కువగా ఉండటం వల్ల సహజ ప్రసవం కాదు. గర్భంలో శిశువు తలకిందులుగా ఉండటం వల్ల శస్త్రచికిత్స తప్పనిసరి అవుతుంది. ఇక గర్భిణి మరీ బలహీనంగా ఉండడం, ఉమ్మనీరు పోవడం, సహజ ప్రసవాన్ని భరించే పరిస్థితి లేకపోవడం, తీవ్రమైన రక్తహీనత వల్ల అశక్తత తదితర సమయాల్లో సిజేరియన్లు అవసరం. తల్లీబిడ్డ పరిస్థితి డోలాయమానంగా ఉన్నప్పుడు కూడా సిజేరియన్ తప్పనిసరి అవుతుంది. అయితే ఈ పరిస్థితి లేకపోయినప్పటికీ అనేక ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్‌హోంలలో సిజేరియన్ ప్రసవాలు చేసి రూ.70–80 వేల వరకు బిల్లు చేతిలో పెడుతున్నారు’ అని ఒక గైనకాలజిస్టు చెప్పారు. నొప్పుల సమస్యకు పరిష్కారంగానూ.. నేటి మహిళల్లో ఎక్కువమంది కాన్పు నొప్పులను తట్టుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తల్లిదండ్రులు, భర్త సిజేరియన్ చేయాలని కోరుతున్నారని కొందరు ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కొందరు సహజ ప్రసవం వరకు ఆగకుండా కోత ప్రసవం ద్వారా వెంటనే సంతానాన్ని చూడాలనుకుంటున్నారని బెంగళూరుకు చెందిన ప్రముఖ ప్రసవ వైద్యురాలు డాక్టర్ శాంత తెలిపారు. అడిగి మరీ సిజేరియన్ సిజేరియన్ పద్ధతిని మధ్య, సంపన్న కుటుంబాలవారు నిస్సంకోచంగా ఎంచుకుంటున్నారు. ఫలానా రోజున ప్రసవం జరగవచ్చని వైద్యులు లేక్కతేల్చుతారు. అయితే ఆరోజున విదేశీ ప్రయాణం ఉందనో, అత్యవసర పని ఉందనో, లేక అమావాస్య, మంచిరోజు కాదు.. తదితర కారణాలతో నచ్చిన రోజు సిజేరియన్ ప్రసవానికి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనైతే.. మీ అమ్మాయి ప్రసవవేదనను భరించే స్థితిలో లేదు అని వైద్యులే ఒత్తిడి చేసి కోత ప్రసవంతో బిడ్డను తీస్తున్నారు. గ్రామీణ గర్భిణీల్లో సహజ ప్రసవాలే అధికం కావడం గమనార్హం. శారీరక కష్టం చేయడంతో పాటు ఇప్పుడు పోషకాహారం లభించడం తదితరాల వల్ల వారికి సిజేరియన్ల బెడద నగరవాసులతో పోలిస్తే తక్కువేనని ఆరోగ్య సర్వే తేల్చింది. ♦ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది: సిజేరియన్లు 10–15 శాతం మించరాదు. ♦ ఏం జరుగుతోంది: ప్రస్తుతం సిజేరియన్ కాన్పులు 40 శాతానికి చేరాయి. -
కడుపుకోత!
► రాష్ట్రంలో 58 శాతం ప్రసవాలు సిజేరియన్లే ► దేశంలోనే టాప్ తెలంగాణ బిడ్డకు జన్మనిస్తున్న అమ్మ కడుపుకోతకు గురవుతోంది.. అత్యవసర పరిస్థితిలో ఆదుకోవాల్సిన సిజేరియన్ విధానం.. అనవసరంగా, అడ్డదిడ్డంగా ఆపరేషన్లు చేసే విచ్చలవిడి వ్యవహారానికి మూలంగా మారిపోయింది. అసలు ప్రసవం అంటేనే ‘కోత’అన్నట్లుగా తయారైంది. అందులోనూ మన రాష్ట్రంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ నమోదవుతున్న ప్రసవాల్లో ఏకంగా 58 శాతం సిజేరియన్లే కావడం ఆందోళనకరంగా మారింది. దీనికి వైద్యులు, ఆస్పత్రుల ధన దాహం ప్రధానంగా కారణమవుతోంది. బిడ్డ అడ్డం తిరిగిందని భయపెడుతూనో, మరేదో కారణం చెబుతూనో సిజేరియన్ చేస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వాల నిర్లక్ష్యం, తగిన నైపుణ్యం లేని వైద్య సిబ్బంది, మహిళల ఆరోగ్య పరిస్థితులు, అవగాహన లేమి వంటివి కూడా ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో.. మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీసే సిజేరియన్ల నియంత్రణ విషయంలో ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో 75 శాతం, ప్రభుత్వాస్పత్రులలో 41 శాతం సిజేరియన్లు జరుగుతుండటం గమనార్హం. ప్రైవేటు ఆస్పత్రుల ధన దాహం, వాటిపై సర్కారు నియంత్రణ లేకపోవడం, వైద్యశాఖలో నిఘా, చర్యలు తీసుకునే యంత్రాంగం పెద్దగా లేకపోవడం వంటివి ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ.. జాతీయ స్థాయిలో చూస్తే సిజేరియన్లు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్ల శాతం అధికంగా ఉండటం ఆందోళనకరం. హైదరాబాద్‌లోని మూడు బోధనాస్పత్రుల్లో సిజేరియన్ల శాతం 38 నుంచి 43 వరకు ఉంది. జిల్లాల్లోని ఆస్పత్రుల్లోనైతే ఈ శాతం ఇంకా ఎక్కువగా ఉంది. వైద్యులు, సౌకర్యాల కొరత పెరుగుతున్న గర్భిణుల సంఖ్యకు తగినట్లుగా ప్రభు త్వాస్పత్రుల్లో వైద్య సిబ్బంది, సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల వైపు మొగ్గు పెరుగుతోందని కేంద్ర నివేదిక స్పష్టం చేసింది. ఇక సాధారణ కాన్పు కోసం ప్రయత్నించినప్పుడు ఏదైనా అయితే వైద్యుల నిర్లక్ష్యమంటూ రోగుల బంధువులు గొడవపడటం, న్యాయస్థానాలను ఆశ్రయించడం పెరిగిపోతోంది. దీంతో వైద్యులు ముందు జాగ్రత్తగా ఆపరేషన్ల వైపు మొగ్గుచూపుతున్నారు. సిజేరియన్లు 15% మించకూడదు దేశంలో ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్న సిజేరియన్ కాన్పులు, వాటితో వచ్చే దుష్ప్రభావాలు, సిజేరియన్లను తగ్గించడానికి సూచనలను పేర్కొంటూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ తాజాగా నివేదిక రూపొందించింది. దాని ప్రకారం రాష్ట్రంలో సిజేరియన్ కాన్పులు ఏకంగా 58 శాతంగా నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఏ ప్రాంతంలోనైనా ప్రసవాలలో సిజేరియన్లు గరిష్టంగా 15 శాతం మించకూడదు. ఇక ప్రసవించే సమయంలో మహిళలు మృతిచెందుతున్న శాతం సాధారణ కాన్పుల్లో 8.6 శాతంగా ఉంటే.. సిజేరియన్లలో 9.2 శాతంగా ఉంది. దీనిని బట్టి చూసినా సిజేరియన్ల నియంత్రణ అత్యావశ్యకమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. చాలా కారణాలున్నాయి ♦ కాన్పు కష్టమైన సమయాల్లో, తల్లీబిడ్డల్లో ఎవరికైనా ప్రాణహాని ఉండే సందర్భాల్లో మాత్రమే సిజేరియన్ చేయాలి. కానీ రాష్ట్రంలో వైద్యులు విచ్చలవిడిగా పెద్దాపరేషన్లు చేస్తున్నారు. తొలి ప్రసవం సిజేరియన్ అయితే రెండోసారి కాన్పు సమయంలో ఏ మాత్రం ఆలోచించకుండా ఆపరేషన్ చేసేస్తున్నారు. ♦ కొందరు మహిళలు తొలికాన్పు సమయంలో ఎదురైన నొప్పులు, ఇతర అనుభవాలకు భయపడి రెండో కాన్పు సిజేరియన్‌కు వెళ్తున్నారు. ♦ ఇటీవల మహిళలు ఆలస్యంగా పెళ్లి చేసుకుని ముప్పై ఏళ్ల వయసు దాటాక తొలి సంతానానికి జన్మ ఇస్తున్నారు. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు తల్లీబిడ్డలకు ప్రాణహా ని ఉంటుండటంతో వైద్యులు సిజేరియన్లు చేస్తున్నారు. ♦ ఆరోగ్య బీమా ఉన్న మహిళల్లో చాలా మంది సిజేరియన్ ఆపరేషన్లకు వెళుతుండడం గమనార్హం. కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి వైద్యపరంగా సాధారణ కాన్పు, శస్త్రచికిత్స ప్రక్రియ ఒక్కటే. కానీ సాధారణ కాన్పు అయినప్పుడు రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటే చాలు. సిజేరియన్ అయితే మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలి. ఇక సిజేరియన్ చేసినప్పుడు గర్భాశయానికి పేగులు అతుక్కుపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. దానివల్ల కడుపునొప్పి, పనులు చేసే సమయాల్లో ఇబ్బంది ఉంటుంది. కానీ ఇలా జరిగే అవకాశం చాలా తక్కువ. ఇక శస్త్రచికిత్స వల్ల నడుము నొప్పి వస్తుందనే అభిప్రాయం అవాస్తవం. సామాజికంగా, జీవనశైలిపరంగా వచ్చిన మార్పుల వల్లే సిజేరియన్ కాన్పులు పెరుగుతున్నాయి.. – డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్, గైనకాలజిస్ట్ సిజేరియన్ల శాతం తగ్గించేందుకు చర్యలు మన రాష్ట్రంలో సిజేరియన్ల శాతం ఎక్కువగానే ఉంది. ఈ పరిస్థితిని నివారించేందుకు బహుముఖ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కువ కాన్పులు చేయడం వల్ల.. సిజేరియన్ల సంఖ్య తగ్గుతోంది. కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణుల సంఖ్య పెరిగింది.. – వాకాటి కరుణ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ -
డెలి‘వర్రీ’
►‘బర్త్‌ప్లాన్’ లేక తప్పని ప్రసవ వేదన ►క్షేత్రస్థాయి నుంచి పర్యవేక్షణ శూన్యం ►పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ ►సర్వజనాస్పత్రిలోనూ ఆగని గర్భిణుల ఘోష ►తాజాగా ఆస్పత్రి ఆవరణలోనే ప్రసవం ►మూడ్రోజుల క్రితం బాలింత మృత్యువాత ⇒26,284 : 2016–17లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవాలు ⇒4,440 : ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన సిజేరియన్లు ⇒63 : గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవమైన 42 రోజుల్లోపు మృతి చెందిన వారి సంఖ్య ⇒830 : ప్రసవం తర్వాత ఏడాదిలోపు మృత్యువాత పడిన శిశువులు ⇒1159 : కడుపులోనే మృతి చెందిన శిశువులు పెద్దవడుగూరుకు చెందిన ఈమె పేరు అమీన్. ఈనెల 17వ తేదీన ప్రసవం కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చింది. కనీసం బెడ్ కూడా ఇవ్వలేదు. దీంతో రెండ్రోజుల నుంచి ఆరు బయటే ఉంటోంది. శనివారం అర్ధరాత్రి దాటాక నొప్పులొచ్చాయి. లేబర్ రూంకు తీసుకెళ్దామనుకునేలోపే ఆదివారం తెల్లవారుజామున ఆరుబయటే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత వార్డులోకి తీసుకెళ్లి తల్లీబిడ్డకు వైద్యం అందించారు. పెద్దాస్పత్రిలో గర్భిణులకు ఎలాంటి వైద్యం అందుతోందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. విడపనకల్లు మండలం గడేకల్లుకు చెందిన రాజేశ్వరి ఈనెల 12న రెండో కాన్పుకోసం సర్వజనాస్పత్రికి వచ్చింది. అదే రోజు సిజేరియన్ చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటి రోజు నుంచి కడుపు ఉబ్బరంగా ఉండడంతో పాటు రక్తస్రావం ఆగకపోవడంతో మళ్లీ ఆపరేషన్ చేశారు. చివరకు మూడ్రోజుల క్రితం ఆమె మృత్యువాతపడింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందన్న వాదనలున్నా వాస్తవానికి ఈమె గర్భం దాల్చినప్పటి నుంచి ‘బర్త్‌ప్లాన్’ సరిగా లేదు. వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం గాల్లో కలిసింది. అనంతపురం మెడికల్ : మాతాశిశు సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకొస్తున్నా వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంతో మృత్యుఘంటికలు మోగుతూనే ఉన్నాయి. గర్భం దాల్చినప్పటి నుంచి ‘బర్త్‌ప్లాన్’ సరిగా లేకపోవడం, ఎప్పటికప్పుడు సిబ్బంది పర్యవేక్షించకపోవడంతో ఈ దుస్థితి నెలకొంటోంది. మరోవైపు జిల్లాకే పెద్దదిక్కుగా ఉన్న సర్వజనాస్పత్రిలో గర్భిణులు ప్రసవ వేదన అనుభవిస్తున్నారు. సరిపడా పడకలు లేవన్న కారణంతో అక్కడి సిబ్బంది నిండు గర్భిణులను కూడా నిర్ధాక్షిణ్యంగా బయటకు గెంటేస్తున్నారు. ఫలితంగా ప్రసవాలు ప్రమాదభరితంగా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువు నిబంధనల ప్రకారం ఓ మహిళ గర్భం దాల్చిన ఏడవ నెల నుంచి తప్పనిసరిగా ఏఎన్ఎంలు గర్భిణి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు ఆరా తీసి వాటిని ఎంసీపీ (మదర్ చైల్డ్ ప్రొటెక్షన్) కార్డులో నమోదు చేయాలి. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. హై రిస్క్ (రక్తహీనత) ఉన్నట్లు తేలితే క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. 108 వాహనానికి ముందే సమాచారం ఇచ్చి ఉండాలి. ప్రసవానికి వారం ముందు ఈడీడీ (ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ) తెలుసుకుని ఐదు రోజుల ముందు ఆస్పత్రిలో అడ్మిషన్ చేసేలా చూడాలి. సాధారణంగా ప్రసవ సమయానికి 10 ఎంజీ కన్నా ఎక్కువగా హిమోగ్లోబిన్ ఉండాలి. 6 ఎంజీ లోపల ఉంటే తప్పనిసరిగా రక్తం ఎక్కించాలి. 8 నుంచి 10 ఎంజీ మధ్యలో ఉంటే ఐరన్ సిప్రోజ్ ఇంజెక్షన్లు (మూడు నుంచి నాలుగు) వేయించేలా చూడడంతో పాటు ఐరన్ ఫోలిక్ మాత్రలు ఉదయం, రాత్రి వేసుకునేలా చేయాలి. కానీ ఇవేవీ వైద్య ఆరోగ్యశాఖకు పట్టడం లేదు. జిల్లాలో ఒక బోధనాస్పత్రి, ఒక జిల్లా కేంద్ర ఆస్పత్రి, 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 15 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా ఆస్పత్రులు ఉండగా వీటిలో గర్భిణులకు సంతృప్తికర సేవలు అందడం లేదు. సబ్ సెంటర్లలో కూడా గర్భిణులపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉన్నా నామమాత్రంగా సేవలు అందుతున్నాయి. అసలు ఏఎన్ఎంలు గ్రామాల్లో అందుబాటులో ఉండడం లేదు. పట్టణాలు, నగరాల్లో అయితే పరిస్థితి మరీ ఘోరం. నెలవారీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన సూచనలు అందించాల్సి ఉన్నా... క్షేత్రస్థాయిలో సక్రమంగా ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ క్రమంలో ప్రసవ సమయంలో గర్భిణులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఏటా మరణాలు పెరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలు చేయడం మినహా క్షేత్రస్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోతోంది. సర్వజనాస్పత్రిలో మరీ ఘోరం క్షేత్రస్థాయిలో పరిస్థితి ఒకలా ఉంటే ప్రసవం కోసం సర్వజనాస్పత్రికి వచ్చే వారు అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. సిజేరియన్లు చేయాల్సి వస్తే ప్రాణం మీద ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక్కడి ఈఓటీ (ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్)లో నిత్యం 10కి పైగా సిజేరియన్లు జరుగుతుంటాయి. వీటికి తోడు అపెండిక్స్, సర్జికల్ కేసులు, ఈఎన్టీ కేసులు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ రెండు ‘టేబుల్స్’ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇతర కేసులు ఎలా ఉన్నా గర్భిణులు మాత్రం నరకయాతన పడాల్సి వస్తోంది. నొప్పులతో ఆర్తనాదాలు చేయాల్సి వస్తోంది. మూడ్రోజుల క్రితం గుత్తికి చెందిన లావణ్యకు సిజేరియన్ అవసరం కావడంతో ఈఓటీ వద్దకు తెచ్చారు. ఆపరేషన్ టేబుల్స్ ఖాళీగా లేకపోవడంతో బయట ఓ గదిలో కూర్చోబెట్టి సెలైన్ బాటిల్ ఎక్కించి అలాగే వదిలేశారు. ఈ క్రమంలో నొప్పులు భరించలేక ఆమె నరకయాతన అనుభవించింది. ప్రధానంగా ఇక్కడి ఆంటినేటల్ వార్డులో గర్భిణులు అవస్థలు పడుతున్నా జిల్లా యంత్రాంగానికి పట్టడం లేదు. వైద్యుల తీరూ తీసికట్టుగా ఉంటోంది. -
భర్త కన్నప్ప
తండ్రిది పేగుబంధం. కాబట్టి... కన్న కూతురికి చిన్న కష్టం వచ్చినా ఆ కన్నపేగు కలుక్కుమంటుంది. మరి భర్తది?... కట్టిపడేసిన తాడు బంధం. కానీ... భార్య గర్భందాల్చాక ఆ తాడుబంధం తోడుబంధం కావాల్సిందే. భర్తగా మీరు మీ భార్యను ఎంతగా ప్రేమించినా బిడ్డను కడుపున మోయలేరుగా! భార్యను ఎంత ఇష్టంగా చూసుకున్నా పురిటి నొప్పులు మీరు పడలేరుగా! భార్యను ఎంత గారాం చేయాలనుకున్నా వేవిళ్లు మీరు తెచ్చుకోలేరుగా! నిజమే... మీరు కనలేరు. బాధనూ కనలేరు. బిడ్డనూ కనలేరు. అందుకే మీరు భర్త ‘కన్న’ప్ప అయిపోండి. భర్తగా బాధ్యత పంచుకోండి. మీ భార్య ‘కన్న’ కలలను నెరవేర్చండి. ఆమె పురిటినొప్పులను మరిచేంతగా గారాం చేయండి. అన్ని జాగ్రత్తలను దగ్గరుండి మీరే తీసుకోండి. తన ఇంట పండంటి పాప నడయాడాలని కోరుకున్న ప్రతి భర్తా... తన భార్యను కంటిపాపలా చూసుకోవాలి. కంటి పాప బాగుంటేనే కదా చంటిపాపైనా, ఇంటి పాపైనా ఆరోగ్యంగా ఉండేది! అందుకోసం తొలుత దృష్టిసారించాల్సింది క్రమం తప్పకుండా కావాల్సిన ఆమె ఫాలో అప్లు. గర్భవతికి ఇచ్చే సంరక్షణలో ఒక్కరిని చూసుకుంటే ఇద్దరిని చూసుకున్నట్టు! అలా చూసేవాడే నిజమైన హీరో. గర్భవతిని ఒక్కసారి హాస్పిటల్‌కు తీసుకెళ్తే... ఇద్దరిని తీసుకెళ్లినట్లు... ఈ ఒక్క చర్యతో ఈ లోకంలోకి రాబోయే చిన్నారికి మరో వందేళ్ల జీవితాన్ని భరోసాగా ఇచ్చినట్టే! ఇక్కడి తొమ్మిదంశాలపై దృష్టిసారిస్తే తొమ్మిది నెలల భారాన్ని భర్తా మోసినట్టే... గర్భవతి తన కడుపున బిడ్డను మోసే వ్యవధి తొమ్మిది నెలలు. దీనికి సరిగా భర్త కనీసం తొమ్మిది అంశాలపై దృష్టి నిలిపితే నవమాసాల తర్వాత కువకువలడే చిన్నారి నట్టింట్లోని ఉయ్యాలలోకి వచ్చేస్తుంది. ఆ తొమ్మిది అంశాలివి... తొలి ప్రాధాన్యం సహజ ప్రసవం కోసం... గర్భం దాల్చిన ప్రతి మహిళా తనకు సహజ ప్రసవం (వెజైనల్ డెలివరీ) కావాలని కోరుకుంటుంది. ప్రసవం తర్వాత కోలుకునే సమయం తక్కువ కావడం, అంతా స్వాభావికంగా జరిగిపోవడం వంటి కారణాల వల్ల ఆమెలో ఈ కోరిక ఉంటుంది. అయితే... ఏదైనా ముప్పు వాటిల్లితే, పెద్ద ప్రాణాన్ని, చిన్న ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఆధునిక వైద్యశాస్త్రం శస్త్రచికిత్స ప్రక్రియను ఆవిష్కరించింది. అదే సిజేరియన్. దీనికి తోడు కాన్పు కష్టమవుతుందని అనిపిస్తే ఆ సమయంలో అనుసరించాల్సిన ప్రణాళికను బట్టి డెలివరీ విధానాలను ఎంచుకుంటారు. మొదట అసిస్టెడ్ వెజైనల్ డెలివరీ, ఫోర్సెప్స్ డెలివరీ... కోసం ప్రయత్నిస్తారు. ఇవేవీ కుదరకపోతే సిజేరియన్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ తల్లి, బిడ్డ ఇద్దరి క్షేమం కోరుతూ చేసే ప్రసవాలు. సహజ ప్రసవం అంటే... చాలామందిలో యోని మార్గం ద్వారా బిడ్డ సునాయాసంగా బయటకు వచ్చేస్తుంది. నిర్దిష్టంగా ఏ సమయానికి ప్రసవం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేరు. కానీ 36 వారాల గర్భధారణ సమయం పూర్తయ్యాక దాదాపుగా 37 – 40 వారాల మధ్యలో ఈ ప్రవసం జరుగుతుంది. రకరకాల ప్రసవాలివి... ప్రసవాలు అనేక రకాలుగా చేస్తారు. వీటన్నింటిలో యోని ద్వారా ప్రసవం కావడం సహజమైన ప్రక్రియ. తల్లి, బిడ్డ పరిస్థితిని బట్టి... ప్రతి గర్భవతి విషయంలో వారివారికి ఎదురయ్యే సంక్లిష్టతలు వేరుగా ఉంటాయి. వాటిని బట్టి వారికి అనుసరించాల్సిన ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. దానిని డాక్టర్లు నిర్ణయిస్తారు. అసిస్టెడ్ / ఆపరేటివ్ వెజైనల్ డెలివరీ: సాధారణ ప్రసవం జరిగే సమయంలో అసిస్టెడ్ డెలివరీ ప్రక్రియ సహాయపడుతుంది. ఈ ప్రక్రియలో శిశువు తల వద్ద శూన్య ప్రదేశం (వ్యాక్యూమ్) ఏర్పరచడం ద్వారా ప్రసవం తేలిగ్గా అయ్యేలా చూస్తారు. ఇది ప్రసవ సమయంలో అక్కడి పరిస్థితిని బట్టి డాక్టర్లు ఎంచుకునే ప్రక్రియ. ఇందులో డాక్టర్లు చిన్నారి తల వద్ద ఒక వాక్యూమ్ పంప్‌ను పంపుతారు. ఈ ప్రక్రియను అవలంబించడం వల్ల ద్వారా యోని మార్గం (బర్త్ కెనాల్) నుంచి బిడ్డ ప్రసవం తేలిగ్గా అయ్యేలా చూడవచ్చు. ఫోర్సెప్స్ డెలివరీ : ఈ ప్రక్రియలో యోని మార్గం ద్వారా బిడ్డను బయటకు తీసుకు వచ్చేందుకు డాక్టర్లు ఫోర్సెప్స్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. దీని ద్వారా బయటకు వచ్చేందుకు వీలుగా చిన్నారి తలకు ఒక మార్గదర్శనం దొరుకుతుంది. ఫలితంగా బిడ్డ తేలిగ్గా బయటకు వస్తుంది. సిజేరియన్ (సి–సెక్షన్) డెలివరీ : ఈ తరహా ప్రసవంలో పొట్ట మీది నుంచి గర్భసంచికి చిన్న గాటు (కోత) పెడతారు. బిడ్డను ఇలా బయటకు తీయడం అనేది ఒక్కోసారి ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. కొన్నిసార్లు సాధారణ ప్రసవం కష్టమైనప్పుడు... అంటే గర్భసంచి బిడ్డ కదలికలు మొదలయ్యి... బయటకు రావడానికి కష్టమవుతుంటుంది. అప్పుడు బిడ్డకు శ్వాస అందదు. అప్పుడు తక్షణం సిజేరియన్ చేయడానికి నిర్ణయం తీసుకుంటారు. అలాగే కడుపులో బిడ్డ అపసవ్య దిశలో ఉండడం, పేగు మెడకు చుట్టుకోవడం వంటి కాంప్లికేషన్స్ ఉన్నా కూడా సి సెక్షన్ చేయాల్సి రావచ్చు. వ్యాయామ రీతులు అనుసరించేలా చూడటం... క్రమం తప్పకుండా వ్యాయామం : గర్భంతో ఉన్నప్పుడు రోజూ వ్యాయామం చేయడం వల్ల పెల్విస్ కండరాలు, కాళ్లలో ఉండే కండరాలకు బలం చేకూరుతుంది. వీటిలో కీగల్స్ అనే తరహా వ్యాయామాలు కీలకం. పెల్విస్ స్ట్రెచెస్, టిల్ట్స్, డీప్ స్క్వాట్స్ లాంటివి చేయడం ద్వారా పెల్విస్ కండరాలు గట్టిపడి నార్మల్ డెలివరీకి దోహదం చేస్తాయి. అయితే పొట్ట మీద ఒత్తిడి పడే వ్యాయామాల వల్ల మొదటికే మోసం రావచ్చు. కాబట్టి డాక్టర్ సూచించిన వ్యాయామాలను మాత్రమే చేయించాలి. బ్రీతింగ్ వ్యాయామాలు : ఇవి తల్లిలోని ప్రతి అవయవానికి ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని పెంచి, బిడ్డనూ ఆరోగ్యంగా ఉంచుతాయి. ∙ప్రీనేటల్ యోగా: గర్భం దాల్చిన మహిళ మనసు ఎప్పుడూ శాంతంగా ఉండాలి. ప్రీ–నేటల్ యోగాసనాలు శరీరానికి సాగేగుణాన్నీ (ఫ్లెక్సిబిలిటీ) పెంచుతాయి. గర్భిణి వ్యాయామం చేసేటప్పుడు భర్త దగ్గర ఉండడం చాలా అవసరం. ప్రతికూలమైన అంశాలకు దూరంగా ఉండటం... ప్రసవ సమయంలో వారికి ఎదురైన చేదు అనుభవాలను గూర్చి ఎవరైనా చెబుతుంటే, గర్భిణి వాటిని వినకపోవడమే మంచిది. ఎందుకంటే పురిటి నొప్పులు, వాటి వల్ల కలిగే ఇబ్బందులు... ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండవు. అంతేకాదు... ఒకే మహిళలో సైతం నొప్పులు ఒక కాన్పులో ఉన్నట్లు మరొక కాన్పులో ఉండవు, తేడాలు ఉంటాయి. కాబట్టి ప్రసవం నొప్పుల గురించి ఆందోళన పడడం కంటే మానసికంగా సిద్ధమై ధైర్యంగా ఉండాలి. నొప్పులు లేకుండా ప్రసవం అయ్యేందుకు ‘పెయిన్లెస్ డెలివరీ’లు కూడా చేస్తున్నారు. దీన్నే ‘ఎపిడ్యూరల్ ఎనాల్జీషియా’ అంటారు. ఇతరుల చేదు అనుభవాలు భార్య దరిజేరకుండా భర్త కూడా జాగ్రత్త తీసుకోవాలి. సమతుల ఆహారం అందించడం సరైన పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. దీనివల్ల తల్లి ఆరోగ్యమే కాకుండా, బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆకుకూరలు, తాజాపండ్లు, పాలు, గుడ్లు, మాంసకృత్తులు ఎక్కువగా తీసుకోవాలి. రక్తహీనత రాకుండా కాపాడుకోవాలి. గర్భిణికి మంచి ఆహారాన్ని సమకూర్చడం, ఆమెకి తినాలనిపించిన రుచుల కోరిక తీర్చాల్సిన బాధ్యత భర్తదే. గర్భం... ప్రసవంపై అవగాహన! ప్రీ–నేటల్ బర్త్ విషయంలో నిర్వహించే తరగతులకు భార్యతోపాటు భర్త కూడా వెళ్లాలి. డాక్టర్‌ను అడిగి మీలో కలిగే చిన్న చిన్న సందేహాలను సైతం తీర్చుకోవాలి. ప్రెగ్నెన్సీకి సంబంధించిన పుస్తకాలు ఇద్దరూ చదవాలి. వాటి వల్ల ప్రసవం గురించి కలిగే అపోహలు తొలగిపోతాయి. అప్పుడు ధైర్యంగా ఉండగలుగుతారు. కంటి నిండా నిద్ర! గర్భవతులు నిద్రకు తగినంత ప్రాధాన్యం ఇవ్వాలి. సాధారణ సమయంలో నిద్ర కంటే గర్భిణికి ఎక్కువ నిద్ర అవసరం. ఏడో నెల దాటాక మధ్యాహ్నం నిద్ర తప్పనిసరి. దానివల్ల బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది. ప్రసవం కోసం ఆసుపత్రికి ఎప్పుడెళ్లాలి? గర్భం దాల్చారని తెలిసినప్పటి నుంచి ఓ చిన్నారి పాపాయి ఎప్పుడెప్పుడు తమ చేతుల్లోకి వస్తుందా, ఎప్పుడు తమ ఒళ్లోకి వస్తుందా అని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తారు. ప్రసవించే తేదీని ఉజ్జాయింపుగా డాక్టర్లు చెప్పిన నాటి నుంచి ఆ అద్భుతమైన ప్రసవ ఘడియ కోసం కాబోయే తల్లిదండ్రుల పాటు బంధుమిత్రులంతా ఉద్విగ్నంగా వేచిచూస్తారు. అయినా ప్రసవం అయ్యే తేదీ నిర్దిష్టంగా ఫలానా రోజనీ, ఫలానా సమయానికి తప్పక నొప్పులు వస్తాయని ఎవరూ చెప్పలేరు. అయినప్పటికీ కొన్ని సూచనల ద్వారా ప్రసవ చిహ్నాలను గుర్తుపట్టవచ్చు. అవి... ⇒ ఇది మొదటి గర్భ ధారణ అయితే... ప్రవవానికి కొద్ది రోజుల ముందు పొట్ట బరువంతా కిందికి జారినట్లుగా అనిపిస్తుంది. దాంతో తుంటి మీద బరువు తగ్గిన అనుభూతి ఉంటుంది. ⇒ రుతుస్రావం సమయంలో కండరాలు బిగుసున్న రీతిలోనే పొట్టపై కండరాలు బిగుసుకుపోతూ, వదులవుతుంటాయి. కొద్ది కొద్దిగా మ్యూకస్ జిగురు పదార్థం గర్భాశయ ముఖద్వారం నుంచి స్రవించడం వల్ల అక్కడి ప్రాంతం వదులవుతున్న అనుభూతి కలుగుతుంది. ⇒ ఉమ్మనీటి సంచి (బిడ్డ చుట్టూ ఆవరించుకుని ఉండే ద్రవం ఉన్న సంచి) అకస్మాత్తుగా పగిలిపోయి ఒక్కసారిగా ఉమ్మనీరంతా యోని నుంచి బయటకు చిమ్ముతుంది. ⇒ అప్పటి వరకూ అనుభవంలోకి వచ్చిన బిడ్డ కదలికలు కాస్త మందగిస్తాయి. ⇒ యోని నుంచి రక్తస్రావం లేదా అదేపనిగా నొప్పి కనిపిస్తాయి. పైన పేర్కొన్న లక్షణాల్లో ఏవైనా మీకు కనిపిస్తుంటే వెంటనే మీరు డాక్టర్‌ను సంప్రదించాలని గుర్తుంచుకోండి. రకరకాల ఇన్ఫెక్షన్స్ గర్భధారణ సమయంలో యోనిలో ఇన్ఫెక్షన్స్ రావడం చాలా సాధారణం. అందుకే ఆ సమయంలో డాక్టర్ సూచించిన మేరకు తరచూ వైద్యపరీక్షలు చేయించుకోవాలి. గర్భధారణ సమయంలో యోని సంబంధితమైన ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే డాక్టర్లు వాటికి తగిన మందులు ఉపయోగించి సురక్షితమైన ప్రసవం జరిగేలా చూస్తారు. యోనిలో ఇన్ఫెక్షన్: గర్భం దాల్చి ఉన్న సమయంలో మహిళల్లో యోనిలో ఇన్ఫెక్షన్ రావడం చాలా సాధారణ సమస్య. మరీముఖ్యంగా రెండో త్రైమాసికంలో. ఈ ఇన్ఫెక్షన్ క్యాండిడా అనే ఒక రకమైన ఫంగస్ వల్ల వస్తుంది. ఇక బ్యాక్టీరియల్ ప్రజాతికి చెందిన సూక్ష్మజీవుల పెరుగుదల వల్ల కూడా యోనిలో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. యోని సంబంధమైన ఇన్ఫెక్షన్ కనిపించినప్పుడు డాక్టర్ సహాయం తీసుకోండి. మీ సమస్య తీవ్రత, లక్షణాల తీవ్రత ఆధారంగా డాక్టర్లు తగిన చికిత్స అందిస్తారు. మూత్రనాళ ఇన్ఫెక్షన్ : గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల మూత్రనాళంలోనూ కొన్ని మార్పులు వస్తాయి. ఇవి మహిళల్లో మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ వచ్చేందుకు ఆస్కారమిస్తాయి. దీనికి తోడు గర్భవతుల్లో గర్భసంచి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఇవి మూత్రకోశం (బ్లాడర్)పై క్రమంగా ఒత్తిడిని పెంచుతూ పోతుంది. ఫలితంగా మూత్రవిసర్జనకు వెళ్లినప్పుడు మూత్రం అంతా బయటకు వెళ్లక కొంత మూత్రం లోపలే మిగిలిపోయేలా చేస్తుంది. ఇలా అక్కడే నిలిచిపోయిన మూత్రం ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. సమయానికి దీనికి చికిత్స అందించకపోతే అది మూత్రపిండాలను సైతం దెబ్బతీయవచ్చు. మూత్రనాళ ఇన్ఫెక్షన్ సమస్య చాలా అరుదుగా మాత్రమే తీవ్రమైన ఆరోగ్య సమస్యను ఎచ్చిపెడుతుంది. అది తీవ్రమైన ప్రభావం గనక చూపిందంటే... ఆ ఇన్ఫెక్షన్ మూత్రపిండాల వరకు పాకుతుంది. గర్భందాల్చినప్పుడు ఇలాంటి దుష్ప్రభావాల వల్ల నెలలు నిండకముందే ప్రవసం కావడం, తక్కువ బరువుతో నెల తక్కువ బాలలు పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. సహాయం కోసం డాక్టర్‌ను ఎప్పుడు కలవాలి? ⇒ చాలా ఎక్కువ మొత్తంలో తెల్లబట్ట అవుతున్నప్పుడు ⇒ యోనిలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా లక్షణాలు కనబడుతున్నప్పుడు ⇒ మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ ఉన్న లక్షణాలు కనబడుతున్నప్పుడు రెగ్యులర్‌గా మందులు... భార్య క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించేలా చూడాల్సిన బాధ్యత భర్తదే. డాక్టర్ రాసిన మందులు... అంటే ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియమ్ టాబ్లెట్స్ లాంటివి తప్పనిసరిగా వాడేలా చూడాలి. ఆమెకి తినాలనిపించినవ రుచులు కూడ. భార్య ప్రసవ వేదనను భర్త అనుభవించడు. కనీసం పైన పేర్కొన్న తొమ్మిదంశాలను పాటిస్తే భార్యపడే అదనపు వేదనను పంచుకున్నవాడవుతాడు. డాక్టర్ పి. సరోజ సీనియర్ కన్సల్టెంట్, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ బర్త్‌రైట్ బై రెయిన్ బో, ఎల్.బి.నగర్ హైదరాబాద్ -
అందరికీ ఆదర్శం .. కలెక్టర్ మురళి
-
కాన్పుకు పోతే.. కడుపు కోతే!
- ప్రైవేటు ఆసుపత్రుల్లో 75% సిజేరియన్లతో తెలంగాణ టాప్ - రాష్ట్రంలో 81 శాతంతో తొలిస్థానంలో కరీంనగర్ - సామాజిక ఆర్థిక సర్వే–2017లో వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే కాన్పుల్లో 74.9 శాతం సిజేరియన్ ఆపరేషన్లు చేస్తూ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 70.9 శాతం సిజేరియన్ ఆపరేషన్లతో పశ్చిమబెంగాల్ రెండో స్థానంలో నిలిచింది. అయితే తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే కాన్పుల్లో 40.6 శాతమే సిజేరియన్ ద్వారా జరుగుతున్నా యని తాజాగా విడుదలైన రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే–2017 వెల్లడిం చింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి జరిగే కాన్పుల్లో సరాసరి 58 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని, అదికూడా అన్ని రాష్ట్రాల కన్నా అధికమని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో జరిగే కాన్పుల్లో 63 శాతం, గ్రామాల్లో జరిగే కాన్పుల్లో 53 శాతం సిజేరి యన్ ద్వారానే జరుగుతున్నాయి. పాత జిల్లాల ప్రకారం.. కరీంనగ ర్లో అత్యధికంగా 81.1 శాతం కాన్పులు సిజేరియన్ ద్వారా జరుగుతున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగా రెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనూ సిజే రియన్ ఆపరేషన్లు అధికంగా జరుగు తున్న జిల్లాలుగా నిలిచాయి. రాష్ట్రం లో 91.5 శాతం కాన్పులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనే జరుగు తున్నాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం 70.8 శాతమే ఆసు పత్రుల్లో జరుగుతున్నాయి. దీంతో తల్లుల మరణాల రేటు అక్కడ 152గా ఉంది. అనవసర సిజేరియన్లపై ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరి వివరణ ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయాన్ని కూడా ఆర్థిక సర్వే పేర్కొంది. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు. -
ఆపరేషన్లే మార్గమా?
పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపునకు సౌకర్యాలు అధికారుల తీరుతోనే బిల్లుల ఆలస్యం కేజీబీవీల్లో అవాంఛనీయ ఘటనలకుపోలీసు, రెవెన్యూ ఉద్యోగులదే బాధ్యత సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం శ్రీహరి హన్మకొండ : సాధారణ ప్రసవాలు చేసేందుకు అత్యధిక అవకాశాలు ఉన్నప్పటికీ వైద్యులు ఇష్టం వచ్చినట్లు సిజేరియన్లు చేస్తుండడం దారుణమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశా రు. గర్భిణులు ప్రసవం కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే సిజేరియన్ చేసి రూ.20వేల నుంచి రూ.30వేల బిల్లులు తీసుకోవడమే కాకుండా గర్భసంచి తొలగిస్తుండడం ఆందోళనకు గురిచేస్తోందన్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లోనే సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రభుత్వ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని శ్రీహరి సూచించారు. వరంగల్ రూరల్ జిల్లా సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన హన్మకొండలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయా విభాగాల అధికారులతో కడియం సుదీర్ఘంగా సమీక్షించారు. పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ మేరకు పాఠశాలల్లో ఫర్నీచర్, నీరు, మరుగుదొడ్లు తదితర మౌళిక సౌకర్యాల కల్పనకు అవసరమైనన్ని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఇక కేజీబీవీలు, ఇతర బాలికల పాఠశాలల్లో అవాంఛనీయ ఘటనలు జరిగితే స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులదే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన బిల్లులు, వలంటీర్ల వేతనాలకు సంబంధించి ట్రెజరీ నియంత్రణ లేనందున ఎప్పటికప్పుడు చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా పెండింగ్‌లో ఉంటే అధికారుల లోపమేనని శ్రీహరి స్పష్టంంంం చేశారు. కాపీ లేకుండా ఉత్తీర్ణత పెంచాలి పదో తరగతి పరీక్షల సందర్భంగా చూచి రాతలు జరగకుండా చూస్తూనే గతంలో ఉన్న ఉత్తీర్ణత శాతం రికార్డులను నిలబెట్టాలని విద్యాశాఖ అధికారులకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సూచించారు. పాఠశాలల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలకు సంబంధించి వివరాలు సమర్పిస్తే కొత్తవి మంజూరు చేస్తామన్నారు. పాఠశాలల గోడలపై విద్యార్థులకు స్ఫూర్తి కలిగించే సూక్తులు రాయాలే తప్ప ఇతర ఎలాంటి రాతలున్నా సహించేది లేదన్నారు. కేజీ టూ పీజీలో భాగంగా ఆంగ్ల మాధ్యమం పాఠశాలల పెంపు, అంగన్వాడీలను పాఠశాలల్లోనే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు సూచించగా, ఇది విధాన నిర్ణయం కనక ప్రభుత్వంతో మాట్లాడతానని కడియం తెలిపారు. కాగా, ఆసరా పింఛన్లు మొదటివారంలోనే ఇచ్చేలా చూడాలని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద ఇచ్చే చెక్కులను పెళ్లికి రెండురోజుల ముందే ఇవ్వాలని సూచించిన కడియం.. చలివాగు ప్రాజెక్టు వద్ద మిషన్ భగీరథ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసి మార్చి 31లోగా ట్రయల్ రన్ చేయాలని ఆదేశించారు. ఇంకా యాసంగికి సంబంధించి ఇరిగేషన్ శాఖ తైబందీ ఖరారు చేయాలని కడియం సూచించారు. బయోమెట్రిక్ తప్పనిసరి.. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని తెలుస్తున్నందున బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా అమలుచేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ అధికారులను ఆదేశించారు. తద్వారా పాఠశాలల్లో బోధన మెరుగుపడుతుందన్నారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ కేజీబీవీలు, బాలికల వసతిగృహాల విద్యార్థులను తల్లిదండ్రులు వస్తేనే పంపించాలని సూచించారు. బయోమెట్రిక్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, అరూరి రమేష్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జాయింట్ కలెక్టర్ హరిత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ప్రతిసారీ ఎందుకిలా?
సందేహం నా వయసు 22. బరువు 41 కిలోలు. తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతూ ఉంటున్నాను. నేను చాలా జాగ్రత్తగా శుభ్రంగా ఉంటాను. అయినా ప్రతిసారీ ఇలా ఎందుకవుతుందో అర్థం కావడం లేదు. - దివ్య, కర్నూలు ఆడవారిలో మూత్రం బయటికి వచ్చే రంధ్రం, యోని రంధ్రం, మలం బయటకు వచ్చే రంధ్రం చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి. మూత్రాశయం నుంచి మూత్రం బయటకు వచ్చే మూత్రం వైపు (యురెత్రా) ఆడవారిలో కేవలం 4సె.మీ. పొడవే ఉంటుంది. అదే మగవారిలో 15 సె.మీ పైన ఉంటుంది. అందువల్ల, మలాశయం నుంచి వచ్చే క్రిములు తొందరగా మూత్రం పైపు ద్వారా మూత్రాశయంలోకి పాకి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి మాటిమాటికి వస్తుంటాయి. కొందరిలో రక్తహీనత ఉన్నా, షుగర్ వ్యాధి ఉన్నా, కిడ్నీలో సమస్యలు, ఇంకా ఎన్నో కారణాల వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ మాటిమాటికీ వస్తుంటాయి. మంచినీళ్లు తక్కువగా తాగడం వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. రోజుకు కనీసం 2-3 లీటర్ల నీళ్లు త్రాగాలి. మలవిసర్జన తర్వాత, ముందు నుంచి వెనక్కి శుభ్రం చేసుకోవాలి. వెనకాల నుంచి ముందుకి శుభ్రం చేసుకోవడం వల్ల మల ద్వారం దగ్గర క్రిములు, మూత్రాశయంలోకి తొందరగా పాకే అవకాశాలు ఉంటాయి. ఒకసారి డాక్టర్ని సంప్రదించి, సీయూఈ, యూరిన్ కల్చర్ చేయించుకుంటే ఇన్ఫెక్షన్ ఎంత ఉంది, ఏ యాంటిబయాటిక్ వాడితే తొందరగా తగ్గుతుందో తెలుస్తుంది. దానినిబట్టి ఇన్ఫెక్షన్కి తగ్గ మందులు వాడవచ్చు. అశ్రద్ధ చేస్తే ఇన్ఫెక్షన్ కిడ్నీలకు పాకి అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. భయపడడం మాని డాక్టర్ని సంప్రదించి, చికిత్స తీసుకోవడం మంచిది. నా వయసు 24. పెళ్లై మూడేళ్లు అవుతోంది. ఇప్పుడు ఆరు నెలల బాబు ఉన్నాడు. నార్మల్ డెలివరీ కష్టమని, సిజేరియన్ చేశారు. కొన్ని రోజులకే ట్యూబెక్టమీ కూడా చేయించుకున్నాను. ఇప్పుడు నేను ఎన్నిరోజుల తర్వాత నా భర్తను శారీరకంగా కలవచ్చు? కలిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - నళిని, ఊరు పేరు రాయలేదు సిజేరియన్ తర్వాత కుట్లు మానిపోయి కడుపులో నొప్పి, ఇంకా ఇతర ఇబ్బందులు లేనప్పుడు మూడునెలలు పూర్తయిన తర్వాత నుంచి కలవవచ్చు. సాధారణంగా కాన్పు తర్వాత ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, మామూలు స్థితికి రావడానికి మూడు నుంచి ఆరునెలలు పట్టవచ్చు. నీకు ఆపరేషన్ అయ్యి ఆరు నెలలు అయ్యింది. అలాగే ట్యూబెక్టమీ కూడా చేయించుకున్నావు కాబట్టి కలవడానికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం లేదు. నాకు పెళ్లై ఏడాది కూడా కాలేదు. మొదట్నుంచి నాకు పీరియడ్స్‌కు వారం రోజుల ముందు నుంచి ఒళ్లు నొప్పులు, కాళ్ల నొప్పులు విపరీతంగా ఉంటాయి. అలాగే వక్షోజాలు కూడా భరించలేనంత నొప్పిగా ఉంటాయి. పీరియడ్స్ పూర్తయ్యాక గానీ నొప్పులు తగ్గవు. డాక్టర్‌ను సంప్రదిస్తే, కొందరి శరీరతత్వం ఇలా ఉంటుందని, పెళ్లయ్యాక తగ్గుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు పెళ్లైనా తగ్గడం లేదు. నెలకు పదిహేను రోజులు శారీరకంగా కలవకుండా ఉండడంతో మా వారికి కోపం, చిరాకు వస్తున్నాయి. నాకు ఈ నొప్పులతో ఇబ్బందిగా ఉంటోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - కిరణ్మయి, మియాపూర్ కొందరిలో పీరియడ్స్‌కు వారం పదిరోజుల ముందు నుంచి ఒంట్లో నీరు చేరి, వక్షోజాలు బరువు ఎక్కి నొప్పి పుట్టడం, కీళ్లనొప్పులు, కాళ్ళవాపులు వంటివి వచ్చి, పీరియడ్స్ అవగానే తగ్గిపోతాయి. కొందరిలో శారీరక మార్పులే కాకుండా మానసిక మార్పులు అంటే కోపం, చిరాకు, డిప్రెషన్ వంటివి కూడా ఏర్పడవచ్చు. దీనినే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) అంటారు. ఈ లక్షణాలు అన్నీ అందరిలో ఉండాలని లేదు. ఒక్కొక్కరిలో ఒక్కోలాగ ఉండవచ్చు. 85 శాతం మందిలో చిన్నపాటి లక్షణాలు ఉంటాయి. 5 నుంచి10 శాతం మందిలో లక్షణాలు తీవ్రంగా ఉండవచ్చు. పీరియడ్స్ ముందు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లలో మార్పులు, కొన్ని రకాల మినరల్స్ లోపాలు, ఇంకో ఎన్నో తెలియని కారణాల వల్ల ఈ లక్షణాలు ఏర్పడవచ్చు. వీటికి చికిత్సలో భాగంగా మందులతో పాటు, జీవనశైలిలో మార్పులు, మానసిక, శారీరక ఒత్తిడిని అధిగమించడం, యోగా, మెడిటేషన్, వ్యాయామాలు కూడా చెయ్యవలసి ఉంటుంది. ఈ సమయంలో కాఫీ, టీ, ఉప్పు, చక్కెర వంటివి తగ్గించుకోవడం, పండ్లు, కూరగాయలు, నీళ్ళు అధికంగా తీసుకోవడంతో పాటు, తగిన విశ్రాంతి ఉండేలా చూసుకోవలసి ఉంటుంది. చికిత్సలో భాగంగా విటమిన్ బి-6, ఈ వంటి విటమిన్స్, కాల్షియం, మెగ్నీషియం, మినరల్స్, పైమ్రోజ్ ఆయిల్‌తో కూడిన మందులు మూడు నుంచి ఆరు నెలలు పైగా వాడి చూడవలసి ఉంటుంది. నొప్పులు మరీ ఎక్కువగా ఉంటే పారసెటమాల్ టాబ్లెట్ అప్పుడప్పుడు వాడుకోవచ్చు. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
మళ్లీ పిల్లలు పుట్టడం సాధ్యమేనా?
సందేహం నా వయసు 30. పెళ్లయ్యి ఎనిమిదేళ్లయ్యింది. మొన్ననే సిజేరియన్ ద్వారా ఒక బాబు పుట్టాడు. కానీ నెలరోజులకే చనిపోయాడు. ఇన్ఫెక్షన్ వల్లే అలా జరిగిందన్నారు. సమస్య ఏంటంటే బాబు పుట్టినప్పుడు నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకున్నాను. దాంతో ఇప్పుడు పిల్లలు లేకుండా పోయారు. మళ్లీ పిల్లలు పుట్టటానికి ఏదో ఆపరేషన్ చేస్తారని విన్నాను. అది సాధ్యమేనా? సాధ్యమైతే ఎంత ఖర్చవుతుందో తెలపండి. - మాధురి, తగరపువలస ఒక్కొక్కరి కుటుంబ, ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక బిడ్డ చాలు అనుకోవడం సబబే. కానీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేది ఇకపై పిల్లలు పుట్టకుండా చేసుకునే శాశ్వత మార్గం. కాకపోతే ఒక బిడ్డ చాలనుకున్నప్పుడు, బిడ్డకు కనీసం నాలుగైదు సంవత్సరాల వయసు వచ్చేవరకు ఉంటే మంచిది. ఎందుకంటే అప్పటికి ఆ బిడ్డలో ఏవైనా సమస్యలు ఉంటే బయటపడతాయి. అంతేకాకుండా అప్పటికి టీకాలు తీసుకోవడం కూడా అయిపోతుంది. కాబట్టి కొంచెం ఓపిక పట్టి, టెంపరరీ పద్ధతులయిన కండోమ్స్, పిల్స్, లూప్ వంటివి పాటిస్తే మంచిది. లేదంటే మీరు చెప్పిన సమస్య వస్తుంది. పైగా ఒక బిడ్డ చాలు అని నిర్ణయించుకున్న కొంతకాలానికి పరిస్థితులు మారవచ్చు. లేదంటే ఈ బిడ్డకి ఇంకో బిడ్డ తోడుంటే బాగుణ్ను అనిపించొచ్చు. కాబట్టి బిడ్డకు నాలుగైదేళ్లు వచ్చేవరకూ ఆగితే బాగుంటుంది. అప్పటికీ నిర్ణయంలో మార్పు లేకపోతే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఇది ఒక బిడ్డ చాలనుకునే వారికి ఓ డాక్టర్‌గా నేనిచ్చే సలహా. ఇక మీ విషయానికొస్తే, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసినప్పుడు గర్భాశయానికి రెండు వైపులా ఉండే ట్యూబ్స్‌ను మధ్యలో ముడివేసి కత్తిరిస్తారు. మళ్లీ పిల్లలు కావాలనుకున్నప్పుడు, కత్తిరించిన ట్యూబులను మళ్లీ అతికి ంచడం (రీ క్యానలైజేషన్) ద్వారా ప్రయత్నించవచ్చు. కానీ దీని సక్సెస్ రేటు ఆపరేషన్ ఎక్కడ, ఎలా చేశారు, ఎంత ట్యూబ్ కత్తిరించారు వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అధైర్యపడకుండా బాగా అనుభవం ఉన్న డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్‌ను బట్టి, హాస్పిటల్‌ను బట్టి పదిహేను వేల నుంచి యాభై వేల వరకూ ఖర్చు కావచ్చు. అలా ప్రయత్నించినా పిల్లలు పుట్టకపోతే, టెస్ట్‌ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ప్రయత్నించవచ్చు. నా వయసు 23. బరువు 50 కిలోలు. బ్లడ్ గ్రూపు ‘ఒ’ పాజిటివ్. మావారి వయసు 26. ఆయనది కూడా ‘ఒ’ పాజిటివే. పెళ్లయ్యి పదిహేడు నెలలయ్యింది. ఎనిమిది నెలల వరకూ నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. డాక్టర్ సలహాపై మందులు వాడితే వచ్చింది. కానీ నాలుగో నెల నిండేవరకూ కొద్దికొద్దిగా బ్లీడింగ్ అవుతూనే ఉంది. డాక్టర్ స్కాన్ చేసి సమస్య ఏమీ లేదని చెప్పారు. తొమ్మిదో నెల వచ్చాక విపరీతమైన కడుపునొప్పి వచ్చి, బిడ్డ కడుపులోనే చనిపోయాడు. కానీ నార్మల్ డెలివరీ అయ్యింది. మాది మేనరికం కాదు. ఇలా ఎందుకు జరిగింది? నాలుగో నెల నుంచి డెలివరీ అయ్యేవరకూ డాక్టర్ స్కాన్ చేయించలేదు. అది కరెక్టేనా? మళ్లీ గర్భం వస్తే సమస్యలు వస్తాయా? - తరుణి, తూర్పుగోదావరి తొమ్మిదో నెలలో బిడ్డ కడుపులో చనిపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. సాధారణంగా గర్భాశయంలో పెరిగే బిడ్డకి, తల్లి నుంచి మాయ (ప్లాసెంటా), బొడ్డు తాడు ద్వారా రక్తప్రసారం జరిగి, తద్వారా ఆహారం, ఆక్సిజన్, కొంత ఉమ్మనీరు సరఫరా అవుతుంటాయి. నెలలు నిండేకొద్దీ కొంతమందిలో మాయ పనితీరు తగ్గి, బిడ్డకు అందాల్సిన రక్తం, ఆక్సిజన్ ప్రసరణ మెల్లగా తగ్గి, తర్వాత పూర్తిగా ఆగిపోవడం వల్ల బిడ్డ కడుపులోనే చనిపోవచ్చు. కొన్నిసార్లు ఉమ్మనీరు బాగా తగ్గిపోవడం, బిడ్డ మెడచుట్టూ పేగు బిగుతుగా చుట్టుకోవడం, తల్లికి బీపీ బాగా పెరగడం, గర్భాశయం నుంచి బిడ్డ బయటకు రాకముందే మాయ విడిపోవడం వంటి కారణాల వల్ల కూడా బిడ్డ కడుపులోనే చనిపోవచ్చు. అవసరాన్ని బట్టి రెండో నెల చివర్లో, ఐదో నెలలో బిడ్డ అవయవాలు అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయా అని, తర్వాత తొమ్మిదో నెలలో బిడ్డ బరువు, పొజిషన్, ఉమ్మనీరు ఎలా ఉన్నాయా అని స్కానింగ్ చేస్తారు. కొంతమందికి మాత్రం ఆరోగ్య పరిస్థితిని బట్టి, రెగ్యులర్ చెకప్‌లో బిడ్డ పెరుగుదలలో ఏమైనా తేడా కనిపించిప్పుడు మధ్యలో కూడా స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు గర్భంతో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనేది మిమ్మల్ని పరీక్ష చేసిన డాక్టర్‌కి తెలియవచ్చు. కాబట్టి మీరు ఓసారి తననే సంప్రదించి మీ నుమానాలను నివృత్తి చేసుకుంటే బాగుంటుంది. ఒక కాన్పులో ఇలా అయ్యిందని మళ్లీ అలాగే అవ్వాలని లేదు. మీకు కాన్పు ఈ మధ్యనే అయ్యింది కాబట్టి, ఆరునెలల నుంచి సంవత్సరం పాటు గ్యాప్ ఇచ్చి మళ్లీ గర్భం కోసం ప్రయత్నిస్తే మంచిది. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
ఒక్కసారి సిజేరియన్ అయితే... ప్రతిసారీ అంతేనా?!
సందేహం నా వయసు 28. నాలుగేళ్ల బాబు ఉన్నాడు. సిజేరియన్ చేసి తీశారు. ఇప్పుడు రెండోసారి గర్భంతో ఉన్నాను. ఆరో నెల. మొదటిసారి సిజేరియన్ పడితే తర్వాత కూడా సిజేరియన్ తప్పదు అని మా అత్తగారు అంటున్నారు. అది నిజమేనా? - కె.సునంద, డోర్నకల్ ఒక్కసారి సిజేరియన్ ఆపరేషన్ అయినంత మాత్రాన తర్వాత కాన్పు కూడా తప్పనిసరిగా ఆపరేషన్ ద్వారానే అవ్వాలనేం లేదు. కాకపోతే రిస్క్ ఎక్కువ. మొదటి ఆపరేషన్ తర్వాత సాధారణ కాన్పు కోసం ప్రయత్నం చేయడాన్ని వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ అంటారు. ఇలా ప్రయత్నం చేయాలంటే కొన్ని అంశాలను పరి గణనలోకి తీసుకోవాలి. ముందు ఆపరేషన్ ఏ సమస్య వల్ల చేశారు, ఎక్కడ చేశారు, ఆపరేషన్ తర్వాత కనీసం మూడేళ్లైనా తేడా ఉందా, కుట్లు తొందరగా మానాయా లేదా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయా అనేవి చూడవలసి ఉంటుంది. వెంటవెంటనే కాన్పు రావడం, ముందు కాన్పులో కుట్లు సరిగా మానకపోవడం లాంటివి ఉంటే... గర్భాశయం పైన ఉన్న కుట్లు, గర్భంలో శిశువు పెరిగే కొద్దీ పల్చబడి, పురుటి నొప్పులు వచ్చినప్పుడు విచ్చుకొని, గర్భసంచి పగిలి బిడ్డ, తల్లి ఇద్దరూ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ బరువు, మీ బిడ్డ బరువు తక్కువగా ఉండి, బిడ్డ పొజిషన్ సరిగా ఉండి, బిడ్డ వచ్చే దారి బిడ్డకు సరిపడా ఉండి, బిడ్డ తల కిందికి పెల్విస్లోకి వచ్చి ఉండి, ఉమ్మ నీరు సరిపడా ఉంటే.... నొప్పులు వాటంతట అవే వచ్చేవరకు ఆగవచ్చు. కానీ డాక్టర్ పర్య వేక్షణలో, అప్పటికప్పుడు అవసరమైతే ఆప రేషన్ చేయడానికి అన్ని వసతులూ ఉన్న ఆస్పత్రిలోనే కాన్పు చేయించుకోవాలి. నొప్పుల తీవ్రత పెరిగే కొద్దీ, కాన్పు సమయం పెరిగే కొద్దీ కొందరిలో గర్భాశయం కుట్ల మీద ఎక్కువ ఒత్తిడి పడి, బిడ్డ బయటికి వచ్చే లోపలే కుట్లు పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ అంశా లన్నీ పరిగణలోకి తీసుకొని, మీ ఆరోగ్య పరి స్థితి, బిడ్డ పొజిషన్ బట్టి నిర్ణయం తీసుకోండి. నా వయసు 19. సంవత్సరం క్రితం పెళ్లయ్యింది. తర్వాత ఐదు నెలలకు కడుపులో గడ్డ ఉందని తెలిసింది. ఆపరేషన్ చేశారు. ఆపరేషన్‌కి ముందు నా జననాంగం వద్ద చిన్న చిన్న పింపుల్స్‌లాగా వచ్చి తగ్గిపోయాయి. గత రెండు నెలలుగా పీరియడ్స్‌కి ముందు వస్తున్నాయి. పీరియడ్స్ అయ్యాక తగ్గి పోతున్నాయి. ఎందుకిలా అవుతోంది? - రవళి, మెయిల్ బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల జననాంగం వద్ద చిన్న చిన్న గుల్లల్లాగా రావచ్చు. రక్తహీనత, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నా ఇలాంటివి మాటిమాటికీ రావచ్చు. పీరియడ్స్ ముందు శరీరంలో ఉండే హార్మోన్స్‌లో మార్పుల వల్ల ఆ సమయంలో జననాంగం వద్ద ఇన్ఫెక్షన్స్ ఏర్పడే అవకాశం ఉంది. కలయిక ద్వారా భర్తకు ఉన్న ఇన్ఫెక్షన్ భార్యకు సోకే అవకాశమూ ఉంది. జననాం గాలు శుభ్రంగా ఉంచుకోకపోవడం, అక్కడ ఉన్న వెంట్రుకలు రెగ్యులర్‌గా తొలగించుకోక పోవడం వల్ల కూడా రావచ్చు. కొందరిలో ఏ్ఛటఞ్ఛటౌ్డట్ట్ఛట అనే వైరస్ కొన్ని నరాల్లో దాగుండి, అప్పుడప్పుడూ ఆ నరాలు స్పందించే చోట నీటిగుల్లల్లాగా (ఠ్ఛిటజీఛిఠ్చట ట్చటజి) ఏర్పడి, నొప్పిగా ఉంటాయి. కానీ వారం పది రోజుల్లో మానిపోతుంటాయి. మానకపోతే ఒకసారి గైన కాలజిస్ట్ను సంప్రదించండి. వారు కొన్ని రక్త పరీక్షలు చేసి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే, దానికి తగ్గ చికిత్స తీసుకోవచ్చు. మా అమ్మగారి వయసు 48. షుగర్, బీపీ లేవు. కానీ కొన్నాళ్లుగా పొత్తి కడుపులో కుడిపక్క నొప్పి వస్తోంది. అది కిడ్నీ వరకూ వ్యాపింది. కిందికి వంగినప్పుడల్లా నొప్పి వస్తోందని అనడంతో యూరాలజిస్టుకు చూపించాం. స్కాన్ చేసి ఏ సమస్యా లేదన్నారు. మందులిస్తే వాడినా తగ్గలేదు. ఆకలి లేదు. రాత్రిళ్లు ఐదారుసార్లు యూరిన్‌కి వెళ్లాల్సి వస్తోంది. అండాశయ క్యాన్సర్ ఉన్నవాళ్లకి ఈ లక్షణాలుంటాయని తెలిసింది. అది నిజమేనా? - భాస్కరరావు, విజయవాడ అండాశయ క్యాన్సర్ ఉంటే పొట్టలో ఇబ్బంది, తెలియని నొప్పి, పొట్ట ఉబ్బడం, అలసిపోవడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, బద్దకం, మందులు వాడినా తగ్గక పోవడం వంటి లక్షణాలుంటాయి. అయితే ఏ గ్యాస్ వల్లో, ఎసిడిటీ వల్లో అలా ఉంటోం దని చాలా మంది ఏవో మందులు వాడేసి ఊరుకుంటారు. అండాశయ క్యాన్సర్‌ని ఆరంభ దశలో కనుక్కోవడం చాలా కష్టం. పెరిగేకొద్దీ స్కానింగ్‌లో చిన్న గడ్డలాగా కనిపిస్తుంది. అలా అన్నీ క్యాన్సర్ గడ్డలే కానక్కర్లేదు. నిర్ధారణ కోసం ఇ్చ125, ఇఉఅ, అఊ్క వంటి ట్యూమర్ మార్కర్స రక్తపరీక్షలు చేయించుకోవాలి. సీటీ, ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించుకుంటే వ్యాధి ఎంతవరకూ పాకిందో తెలుస్తుంది. వ్యాధి ముదిరిన తర్వాత స్కాన్ చేస్తే అండాశయంలో పెద్ద పెద్ద ట్యూమర్లు, పొట్టలో నీరు చేరడం వంటివి కనిపిస్తాయి. ట్రాన్స వెజైనల్ పెల్విక్ స్కాన్ చేయించుకుంటే అండాశయాల్లో ఏవైనా చిన్న చిన్న గడ్డలు లేదా ఏవైనా అనుమానాస్పద మార్పులుంటే తెలుస్తుంది. కొందరికి కనిపించ కుండా మిస్సయ్యే అవకాశాలూ ఉంటాయి. వ్యాధి నిర్ధారణ అయితే... స్టేజిని బట్టి ఆపరేషన్ ద్వారా ట్యూమర్ తొలగించి, చుట్టుపక్కల పాకిందా అనేది గమనించి, పక్కన ఉన్న టిష్యూస్‌ని కూడా బయాప్సీకి పంపిస్తారు. రిపోర్టని బట్టి అవసరమైతే కీమోథెరపీ తీసుకో వాల్సి ఉంటుంది. మీరు చెప్పిన లక్షణాలకి క్యాన్సరే కారణం అవ్వాలని లేదు. కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్, పేగుల్లో టీబీ ఉన్నా కూడా ఈ లక్షణాలు ఉండొచ్చు. కాబట్టి డాక్టర్ని సంప్ర దించి, అవసరమైన పరీక్షలు చేయించండి. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్