ఒక్కసారి సిజేరియన్ అయితే... ప్రతిసారీ అంతేనా?! | once a cesarean, but ... every time?! | Sakshi
Sakshi News home page

ఒక్కసారి సిజేరియన్ అయితే... ప్రతిసారీ అంతేనా?!

Published Sun, Apr 10 2016 1:02 PM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

ఒక్కసారి సిజేరియన్ అయితే... ప్రతిసారీ అంతేనా?!

ఒక్కసారి సిజేరియన్ అయితే... ప్రతిసారీ అంతేనా?!

సందేహం
నా వయసు 28. నాలుగేళ్ల బాబు ఉన్నాడు. సిజేరియన్ చేసి తీశారు. ఇప్పుడు రెండోసారి గర్భంతో ఉన్నాను. ఆరో నెల. మొదటిసారి సిజేరియన్ పడితే తర్వాత కూడా సిజేరియన్ తప్పదు అని మా అత్తగారు అంటున్నారు. అది నిజమేనా?
- కె.సునంద, డోర్నకల్

 
ఒక్కసారి సిజేరియన్ ఆపరేషన్ అయినంత మాత్రాన తర్వాత కాన్పు కూడా తప్పనిసరిగా ఆపరేషన్ ద్వారానే అవ్వాలనేం లేదు. కాకపోతే రిస్క్ ఎక్కువ. మొదటి ఆపరేషన్  తర్వాత సాధారణ కాన్పు కోసం ప్రయత్నం చేయడాన్ని వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ అంటారు. ఇలా ప్రయత్నం చేయాలంటే కొన్ని అంశాలను పరి గణనలోకి తీసుకోవాలి. ముందు ఆపరేషన్ ఏ సమస్య వల్ల చేశారు, ఎక్కడ చేశారు, ఆపరేషన్ తర్వాత కనీసం మూడేళ్లైనా తేడా ఉందా, కుట్లు తొందరగా మానాయా లేదా, ఏమైనా ఇన్‌ఫెక్షన్స్ వచ్చాయా అనేవి  చూడవలసి ఉంటుంది.

వెంటవెంటనే కాన్పు రావడం, ముందు కాన్పులో కుట్లు సరిగా మానకపోవడం లాంటివి ఉంటే... గర్భాశయం పైన ఉన్న కుట్లు, గర్భంలో శిశువు పెరిగే కొద్దీ పల్చబడి, పురుటి నొప్పులు వచ్చినప్పుడు విచ్చుకొని, గర్భసంచి పగిలి బిడ్డ, తల్లి ఇద్దరూ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ బరువు, మీ బిడ్డ బరువు తక్కువగా ఉండి, బిడ్డ పొజిషన్ సరిగా ఉండి, బిడ్డ వచ్చే దారి బిడ్డకు సరిపడా ఉండి, బిడ్డ తల కిందికి పెల్విస్‌లోకి వచ్చి ఉండి, ఉమ్మ నీరు సరిపడా ఉంటే.... నొప్పులు వాటంతట అవే వచ్చేవరకు ఆగవచ్చు.  

కానీ డాక్టర్ పర్య వేక్షణలో, అప్పటికప్పుడు అవసరమైతే ఆప రేషన్ చేయడానికి అన్ని వసతులూ ఉన్న ఆస్పత్రిలోనే కాన్పు చేయించుకోవాలి. నొప్పుల తీవ్రత పెరిగే కొద్దీ, కాన్పు సమయం పెరిగే కొద్దీ కొందరిలో గర్భాశయం కుట్ల మీద ఎక్కువ ఒత్తిడి పడి, బిడ్డ బయటికి వచ్చే లోపలే కుట్లు పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ అంశా లన్నీ పరిగణలోకి తీసుకొని, మీ ఆరోగ్య పరి స్థితి, బిడ్డ పొజిషన్ బట్టి నిర్ణయం తీసుకోండి.
 
నా వయసు 19. సంవత్సరం క్రితం పెళ్లయ్యింది. తర్వాత ఐదు నెలలకు కడుపులో గడ్డ ఉందని తెలిసింది. ఆపరేషన్ చేశారు. ఆపరేషన్‌కి ముందు నా జననాంగం వద్ద చిన్న చిన్న పింపుల్స్‌లాగా వచ్చి తగ్గిపోయాయి. గత రెండు నెలలుగా పీరియడ్స్‌కి ముందు వస్తున్నాయి. పీరియడ్స్ అయ్యాక తగ్గి పోతున్నాయి. ఎందుకిలా అవుతోంది?
- రవళి, మెయిల్

 
బ్యాక్టీరియల్, వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల జననాంగం వద్ద చిన్న చిన్న గుల్లల్లాగా రావచ్చు. రక్తహీనత, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నా ఇలాంటివి మాటిమాటికీ రావచ్చు. పీరియడ్స్ ముందు శరీరంలో ఉండే హార్మోన్స్‌లో మార్పుల వల్ల ఆ సమయంలో జననాంగం వద్ద ఇన్‌ఫెక్షన్స్ ఏర్పడే అవకాశం ఉంది. కలయిక ద్వారా భర్తకు ఉన్న ఇన్ఫెక్షన్ భార్యకు సోకే అవకాశమూ ఉంది. జననాం గాలు శుభ్రంగా ఉంచుకోకపోవడం, అక్కడ ఉన్న వెంట్రుకలు రెగ్యులర్‌గా తొలగించుకోక పోవడం వల్ల కూడా రావచ్చు.

కొందరిలో ఏ్ఛటఞ్ఛటౌ్డట్ట్ఛట అనే వైరస్ కొన్ని నరాల్లో దాగుండి, అప్పుడప్పుడూ ఆ నరాలు స్పందించే చోట నీటిగుల్లల్లాగా (ఠ్ఛిటజీఛిఠ్చట ట్చటజి) ఏర్పడి, నొప్పిగా ఉంటాయి. కానీ వారం పది రోజుల్లో  మానిపోతుంటాయి. మానకపోతే ఒకసారి గైన కాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు కొన్ని రక్త పరీక్షలు చేసి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే, దానికి తగ్గ చికిత్స తీసుకోవచ్చు.
 
మా అమ్మగారి వయసు 48. షుగర్, బీపీ లేవు. కానీ కొన్నాళ్లుగా పొత్తి కడుపులో కుడిపక్క నొప్పి వస్తోంది. అది కిడ్నీ వరకూ వ్యాపింది. కిందికి వంగినప్పుడల్లా నొప్పి వస్తోందని అనడంతో యూరాలజిస్టుకు చూపించాం. స్కాన్ చేసి ఏ సమస్యా లేదన్నారు. మందులిస్తే వాడినా తగ్గలేదు. ఆకలి లేదు. రాత్రిళ్లు ఐదారుసార్లు యూరిన్‌కి వెళ్లాల్సి వస్తోంది. అండాశయ క్యాన్సర్ ఉన్నవాళ్లకి ఈ లక్షణాలుంటాయని తెలిసింది. అది నిజమేనా?
- భాస్కరరావు, విజయవాడ

 
అండాశయ క్యాన్సర్ ఉంటే పొట్టలో ఇబ్బంది, తెలియని నొప్పి, పొట్ట ఉబ్బడం, అలసిపోవడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, బద్దకం, మందులు వాడినా తగ్గక పోవడం వంటి లక్షణాలుంటాయి. అయితే ఏ గ్యాస్ వల్లో, ఎసిడిటీ వల్లో అలా ఉంటోం దని  చాలా మంది ఏవో మందులు వాడేసి ఊరుకుంటారు. అండాశయ క్యాన్సర్‌ని ఆరంభ దశలో కనుక్కోవడం చాలా కష్టం. పెరిగేకొద్దీ స్కానింగ్‌లో చిన్న గడ్డలాగా కనిపిస్తుంది. అలా అన్నీ క్యాన్సర్ గడ్డలే కానక్కర్లేదు. నిర్ధారణ కోసం ఇ్చ125,  ఇఉఅ, అఊ్క వంటి ట్యూమర్ మార్కర్‌‌స రక్తపరీక్షలు చేయించుకోవాలి.

సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్ కూడా చేయించుకుంటే వ్యాధి ఎంతవరకూ పాకిందో తెలుస్తుంది. వ్యాధి ముదిరిన తర్వాత స్కాన్ చేస్తే అండాశయంలో పెద్ద పెద్ద ట్యూమర్లు, పొట్టలో నీరు చేరడం వంటివి కనిపిస్తాయి. ట్రాన్‌‌స వెజైనల్ పెల్విక్ స్కాన్ చేయించుకుంటే అండాశయాల్లో ఏవైనా చిన్న చిన్న గడ్డలు లేదా ఏవైనా అనుమానాస్పద మార్పులుంటే తెలుస్తుంది. కొందరికి కనిపించ కుండా మిస్సయ్యే అవకాశాలూ ఉంటాయి.

వ్యాధి నిర్ధారణ అయితే... స్టేజిని బట్టి ఆపరేషన్ ద్వారా ట్యూమర్ తొలగించి, చుట్టుపక్కల పాకిందా అనేది గమనించి, పక్కన ఉన్న టిష్యూస్‌ని కూడా బయాప్సీకి పంపిస్తారు. రిపోర్‌‌టని బట్టి అవసరమైతే కీమోథెరపీ  తీసుకో వాల్సి ఉంటుంది. మీరు చెప్పిన లక్షణాలకి క్యాన్సరే కారణం అవ్వాలని లేదు. కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్, పేగుల్లో టీబీ ఉన్నా కూడా ఈ లక్షణాలు ఉండొచ్చు. కాబట్టి డాక్టర్‌ని సంప్ర దించి, అవసరమైన పరీక్షలు చేయించండి.
 
- డా॥వేనాటి శోభ
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement