అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా పైలట్‌! | New Yorks Youngest Female Pilot | Sakshi
Sakshi News home page

అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా పైలట్‌!

Published Tue, Mar 26 2024 1:25 PM | Last Updated on Tue, Mar 26 2024 3:30 PM

New Yorks Youngest Female Pilot - Sakshi

కమోరా ఫ్రీలాండ్‌ న్యూయార్క్ స్టేట్‌లో అతి పిన్న వయస్కురాలైన ఆఫ్రికన్‌ మహిళా పైలట్‌. 17 ఏళ్ల వయసులోనే పైలెట్‌గా లైసెన్స్‌ పొందిన మహిళగా రికార్డు సృష్టించింది. దీంతో  న్యూయార్స్‌ ఏవియేషన్‌ ఆమెకు సుమారు 12 మంది ప్రయాణికులతో కూడిన విమానాన్ని నడిపేందుకు అనుమతిస్తూ లైసెన్స్‌ జారీ చేసింది. ఆమె ఎల్లప్పుడూ సముద్ర జీవశాస్త్రంపై దృష్టి పెట్టేది. అయితే అనుకోని విధంగా ఏవియేషన్‌ వైపుకి దృష్టి మళ్లించింది. ఆమె 15 ఏళ్ల వయసులోనే విమానం నడపడం నేర్చుకుంది. అయితే కమోరా తానెప్పుడూ పైలట్‌ కావాలని అనుకోలేదని చెబుతోంది.

కానీ తొలిసారిగా విమానం నడిపాక కచ్చితంగా జీవనోపాధికి దీన్నే ఎంచుకోవాలని డిసైడ్‌ అయ్యాను అంటోంది కమోరా. 2019లో మిల్టన్‌ డేవిస్‌, క్లెట్‌ టైటస్‌ అనే అధికారులు ఈ యునైటెడ్‌ యూత్‌ ఏవియేటర్స్‌  కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో విమాన శిక్షకులుగా 13 నుంచి 18 ఏళ్ల వారికి అవకాశం ఇస్తుంది. అయితే విమానం నడపేందుకు లైసెన్స్‌ మాత్రం 16 ఏళ్లు నిండితేనే ఇస్తారు. కమోరా కూడా ఈ కార్యక్రమంలో 12 ఏళ్ల వయసు నుంచే విమానా పాఠాలు నేర్చుకుంది. యూనైట్‌ యూత్‌ ఏవియేషన్‌ అధికారుల మాత్రం ఆమెకు 15 ఏళ్ల వయసు వచ్చినప్పుడూ విమానం నడిపేందుకు అంగీకరించంది.

చాలా చకచక​ వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం, కాక్‌పీట్‌లో ఎలాంటి తప్పులు చేయకూడదనే విషయాలపై అవగాహన ఏర్పరచుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు బెల్జియన్‌ సంతతి బ్రిటిష్‌ జాతీయుడు రూథర్‌ఫోర్డ్‌పై పేరిట ఉంది. ఆయన కేవలం 15 ఏళ్ల వయసులోనే పైలట్‌గా విమానం నడిపే లైసెన్స్‌ పొందాడు. ఇక కమోరా ఆ తర్వాత స్థానాన్ని దక్కించుకుంది. పైగా న్యూయార్క్‌ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కురాలైన పైలట్‌గా ఘనత సాధించింది. అంతేగాదు రూథర్‌ఫోర్డ్‌ మాదిరిగానే రెండు గంటల క్రాస్‌ కంట్రీ సోలో ఫ్లైట్‌ను కూడా పూర్తి చేసింది. ఈ మేరకు కమోరా మాట్లాడుతూ..ఈ ఘనత సాధించినందుకు ఎంతగానో సంతోషంగా ఉంది. ఏదీ అసాధ్యం కాదని నమ్మండి. సాధించాలనే తప్పన ఉంటే ఎంతటి అడ్డంకినైనా అధిగమించొచ్చు అని పేర్కొంది కమోరా. ఇక్కడ కమోరా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కంటే ముందే పైలట్‌గా లైసెన్స్‌ పొందడం విశేషం

(చదవండి: ఇలాంటి తల్లలు కూడా ఉంటారా?..మాటలు కూడా రాని ఆ చిన్నారిని..)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement