మూడు నెలల్లోనే 23 కిలోలు తగ్గిన నటుడు! కానీ.. | Orlando Blooms Transformation Drastic Weight Loss Of 23 Kgs In 3 Months, Know His Inspirational Story In Telugu | Sakshi
Sakshi News home page

జస్ట్‌ మూడు నెలల్లో 23 కిలోలు తగ్గిన హాలీవుడ్‌ హీరో! ఐతే ఆ సమస్యలు..

Published Tue, Sep 10 2024 12:28 PM | Last Updated on Tue, Sep 10 2024 7:01 PM

Orlando Blooms Transformation  Drastic Weight Loss Of 23 Kgs In 3 Months

ప్రముఖులు, సెలబ్రిటీల వెయిట్‌ లాస్‌ జర్నీలను స్ఫూర్తిగా తీసుకుని అనుసరిస్తూ ఉంటాం. అయితే వాళ్లలో చాలామంది నిధానంగా ఓ క్రమ పద్ధతిలో బరువు తగ్గితే కొందరూ తమ సినిమాలో పాత్రకు తగ్గటు సన్నగా ఉండేందుకు త్వరితగతిన బరువు తగ్గుతుంటారు. జస్ట్‌ రెండు లేదా మూడు నెలలకే కిలోల కొద్ది బరువు తగ్గడం ఆశ్యర్యం తోపాటు మనం కూడా అలాగే తగ్గాలనే ఆత్రుత పెరిగిపోతుంది. వాళ్లు అంత తక్కువ వ్యవధితో బరువు తగ్గేందుకు ఏం చేశారు?, ఎలా కష్టపడ్డారు తదితరాల గురించి తెలుసుకుని మరీ ఫాలో అయిపోతారు. కానీ పాపం వాళ్లు సినిమా కోసం అని తగ్గడం వల్ల ఎలాంటి సమస్యలు ఫేస్‌ చేస్తారనేది చాలామందికి తెలియదు. అవగాహన కూడా ఉండదు. ఇక్కడొక హాలీవుడ్‌ నటుడు కూడా అలానే ఓ సినిమా షూట్‌ కోసం తక్కువ టైంలోనే కిలోలకొద్ది బరవు తగ్గి ఎలాంటి సమస్యలు ఫేస్‌ చేశాడో షేర్‌ చేసుకున్నాడు. ఎవరా హీరో అంటే..

హాలీవుడ్‌కి చెందిన ఓర్లాండ్‌ బ్లూమ్‌​ ఇటీవల తన చిత్రం ది కట్‌ కోసం పడిన కష్టం గురించి షేర్‌ చేసుకున్నారు. ఈ చిత్రంలో తాను బాక్సర్‌ పాత్ర పోషించినట్లు తెలిపారు. ఆ పాత్ర కోసం తాను మూడు నెలలకే ఏకంగా 52 పౌండ్లు(23 కిలోలు) బరువు కోల్పోయినట్లు వెల్లడించాడు. అందుకోసం ఎంతలా స్ట్రిక్ట్‌గా కఠినమైన డైట్‌ని ఫాలో అవ్వాల్సి వచ్చిందో వివరించారు. తాను డైట్‌ ప్రారంభించేటప్పుడూ 85 కిలోలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం చాలా బరువు తగ్గానని అన్నారు. దీని కారణంగా తాను మానసికంగా, శారీరకంగా చాలా సవాళ్లును ఎదుర్కొన్నానని అన్నారు. ఈ వెయిట లాస్‌ జర్నీ భయంకరమైనదని భయపెట్టడం కాదు గానీ ఈ క్రమంలో కొన్ని సమస్యలను ఫేస్‌ చేయక తప్పదని అన్నారు. 

కేలరీలు తగ్గుతున్నందుకు బాధలేదు కానీ ఆ క్రమంలో నిద్రలేమి వంటి సమస్యలు ఫేస్‌ చేస్తున్నప్పుడూ శరీరంలో సంభవించే ప్రతి మార్పు తనను ఆశ్యర్యానికిలోను చేసిందన్నారు. ఇక బ్లూమ్‌ తన సినిమాలో పాత్ర ప్రకారం బరువు పెరిగేందుకు కష్టపడుతున్న బాక్సర్‌గా కనిపించేందుకు ఇంతలా బరువు కోల్పోవడం జరిగింది. ఆ క్రమంలో తన మెదడు ప్రాథమిక కేలరీల కొరతతో ఉంది కాబట్టి పని చేయడం సాధ్యం కాదు. అందువల్ల తాను రెస్ట్‌ తీసుకుంటూ ఫిట్‌నెస్‌ నిపుణులు సమక్షంలో ఇలా త్వరిగతిన బరువు తగ్గినట్లు తెలిపారు. ఇలా తమ రోజువారీ కార్యక్రమాలు తామే చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్న సామాన్యులు ఈ డైట్‌ని అనుసరించడం అత్యంత ప్రమాదకరమని కూడా చెప్పారు. 

ఇలా స్పీడ్‌గా బరువు తగ్గే క్రమంలో ఆకలిని బాగా నియంత్రించేలా మనసుని మానసికంగా సిద్ధ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తీసుకునే ఆహారం పరిమితి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మెదడుని, శరీరాన్ని కష్టపెట్టడం చాలా కష్టం అని చెప్పారు. నిపుణులు కూడా ఇలా తక్కువ టైంలో కిలోలకొద్ది బరువు తగ్గడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే అవకాశాలు ఎక్కువని పదేపదే హెచ్చరిస్తుంటారు. అదే విషయాన్ని ఇక్కడ ఈ బాలీవుడ్‌ హీరో ధైర్యంగా బహిర్గతం చేశారు. చాలామంది ఇలా చెప్పకపోవడం లేదా సమస్యలు వస్తాయనే అవగాహన లేక గుడ్డిగా అనుసరించి ఆరోగ్యాన్ని చేజేతులారా పాడు చేసుకుంటున్నారని అన్నారు నిపుణులు.

(చదవండి: తన తాతను గుర్తుచేసుకున్న కమలా హారిస్‌ ! నెటిజన్లు ఫైర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement