ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. గతంలో ఆయన అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ, బాంబే హైకోర్టు న్యాయమూర్తిగానూ పనిచేశారు. ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. సుదీర్ఘకాలంపాటు పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ కుమారుడే ఈ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్. ఇక ఆయన ఒక మీడియా ఇంటర్వ్యూలో తన జీవనశైలి, ఫాలో అయ్యే డైట్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అంతేగాదు తన దైనందిన జీవితంలో ఆహార ప్రాధాన్యతలు, అలాగే తన రోజు ఎలా ప్రారంభమవుతుందనే వాటి గురించి కూడా చెప్పుకొచ్చారు డివై చంద్రచూడ్. అవేంటో తెలుసుకుందాం!
ఆయన మంచి జీవనశైలే ఆరోగ్యంగా ఉండటంలోనూ రోజంతా ఉత్సాహంగా ఉండంటంలోనూ ఉపకరిస్తుందని అన్నారు. తాను ఉదయం 3.3 గంలకు యోగాతో రోజు ప్రారంభిస్తానని, ప్రాధమిక ఆయుర్వే ఆహార జీవనశైలిని అనుసరిస్తానని అన్నారు. ఇక తాను తన భార్య శాకాహారులమని చెప్పారు. తనకు ఎక్కువుగా మొక్కల ఆధారిత డైట్ బాగా పనిచేసిందన్నారు. ఎందుకంటే మన నాలుక మీదే మన శరీరం తీరు, మానసికోల్లాసం ఆధారపడి ఉందన్నారు. అంటే నాలుక రుచి కావాలనుకుంటే శరీరం బరువు అదుపుతప్పుతుంది. తద్వారా మానసిక ఆరోగ్యం ప్రభావితమవుతుందని అర్థం.
ఇక్కడ నాలుకను నియంత్రణలో ఉంచుకుంటే ఎలాంటి ఆహారమైన అమృతంగా తీసుకోగలమని చంద్రచూడ్ చెబుతున్నారు. మరాఠి అయిన చంద్రచూడ్ తాను సాబుదానా కంటే రామాదాన ఇష్టపడతానన్నారు. అంటే ఇక్కడ రామదానా అంటే ఉసిరికాయ అని అర్థం. అలాగే తాను ఆరోగ్యకరమైన తృణధాన్యాలను తీసుకుంటానని చెప్పారు. ఈ డ్రైట్ ఒక్కోసారి తాను కూడా స్ట్రిట్‌గా ఫాలో అవ్వలేనని అన్నారు. ఎందుకంటే ఒక్కోసారి నాకిష్టమైన ఐసీక్రీ కూడా వచ్చి చేరుతుందిగ అంటూ నవ్వేశారు. కానీ తాను నాలుకును, మనసును నియంత్రణలో పెట్టుకోగలనని అందువల్లో ఒక్కోసారి స్కిప్ అయ్యినా, ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోగలనని అన్నారు.
మొక్కల ఆధారిత డైట్ అంటే..
- గత కొన్నేళ్లుగా ప్రజల జీవనశైలిలో పలు మార్పులు వచ్చాయి. ఎక్కువగా శాకాహారంవైపుకు మళ్లుతున్నారు. ఒకకరకంగా జంతు హింస జరగకుండా ఉండేలా చేయడం నుంచి మొదలయ్యిందే ఈ మొక్కల ఆధారిత డైట్ అని చెప్పొచ్చు. ఈ డైట్‌లో పచ్చగా ఉండే వాటితో ఆరోగ్యాన్ని మెరుగ్గు ఉంచుకుంటారు. ఈ శాకాహారం డైట్‌లో తప్పనిసరిగా తీసుకోవాల్సినవి పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాలు, కాయధాన్యలు తోపాటు ఆకకూరలకు సంబంధించిన మొక్కల ఆధారిత ఆహారాలు.
- ఇక్కడ శాకాహార అనంగానే పాల ఉత్పత్తులను కూడా దగ్గరకు రానియ్యరు.
- దాని బదలు, బాదంపాలు, సోయా పాలు, కొబ్బరి పాలు, తదితర మొక్కల ఆధారిత పాలను ప్రత్నామ్నాయంగా తీసుకుంటారు
- కానీ ఇక్కడ ఇలా భారత అత్యున్నత న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మాదిరిగా మొక్కల ఆధారిత డైట్ ఫాలో అవ్వాలంటే శరీరం, మనస్సు నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే సులభంగా, రుచికరంగా శాకాహారాన్ని వండుకునే యత్నం చేయాలి. అప్పుడే ఈ డైట్‌ని సక్రమంగా ఫాలో అయ్యి, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇక్కడ ఏదైనా ఇష్టంతో, ఆరోగ్య స్ప్రుహతో చేయగలిగితేన మెరుగైన ఫలితాలు పొందగలరనేది అత్యంత కీలకం.
(చదవండి: 90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు! అసలైన పద్ధతి ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment