Best Keema Recipes In Telugu: How To Prepare Tomato Keema Balls In Easy Process - Sakshi
Sakshi News home page

Tomato Keema Balls Recipe: టొమాటో కీమా బాల్స్‌.. తయారీ ఇలా!

Published Thu, Oct 13 2022 2:16 PM | Last Updated on Thu, Oct 13 2022 2:57 PM

Recipes In Telugu: Tomato Keema Balls Easy Process - Sakshi

టొమాటో కీమా బాల్స్‌ ఇలా ఈజీగా తయారు చేసుకోండి. 
కావలసినవి:
►కీమా – పావు కిలో (మెత్తగా ఉడికించుకోవాలి)
►టొమాటో – 3 (మిక్సీ పట్టుకోవాలి జ్యూస్‌లా)
►నిమ్మరసం – 1 టేబుల్‌ స్పూన్
►పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్‌

►ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు
►క్యారెట్, బీట్‌రూట్‌ తురుము – 1 టేబుల్‌ స్పూన్‌ చొప్పున
►మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం – 1 టీ స్పూన్‌ చొప్పున

►బ్రెడ్‌ స్లైసెస్‌ – సుమారుగా 10 (నాలుగువైపులా అంచులు కట్‌ చేసి పెట్టుకోవాలి)
►పాలు – కొద్దిగా
►ఉప్పు – తగినంత
►నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ:
►ముందుగా టేబుల్‌ స్పూన్‌ నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్‌ తురుము, బీట్‌రూట్‌ తురుము ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి.
►వీటిని దోరగా వేయించుకుని.. మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కూడా వేసి.. కలిపాలి.
►కాసేపు మూతపెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి.
►అందులో కీమా వేసుకుని, 2 నిమిషాల పాటు గరిటెతో బాగా కలిపి, టొమాటో జ్యూస్, నిమ్మరసం వేసుకుని దగ్గరపడేవరకూ చిన్న మంట మీదుంచాలి.

►దగ్గరపడిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.
►తర్వాత ప్రతి బ్రెడ్‌ స్లైస్‌ని పాలలో ముంచి.. రెండు చేతుల మధ్య పెట్టి, పాలు లేకుండా గట్టిగా ఒత్తుకోవాలి.
►అందులో కొద్దికొద్దిగా కీమా మిశ్రమం పెట్టుకుని.. ఉండల్లా చేసుకోవాలి.
►అనంతరం నువ్వుల్లో ఆ బాల్స్‌ని దొర్లించి.. వాటిని నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement