
అప్పుటికి
అడివి మా సేతుల్లో ఉండీది!
ఓ కాటా ... ఓ జంగిడితో ...
అతగాడొచ్చేడు.
నయవంచన కళ్ల నులకమంచం మీద
జంగిడి పరిచీ ... అంగడన్నాడు.
కాటా ధర్మం తప్పదన్నాడు.
కళ్లు మూసుకొని నమ్మాలన్నాడు.
కళ్లు మూసుకున్నాం.
కాటా అడివిని తూకమేసింది.
తీరా కళ్లు తెరిచేసరికి
యింకేముంది?
అడివి అతగాడి సేతుల్లో కెలిపోయింది!
అంగట్లో జంగిడి మాకు మిగిలింది!!
♦సిరికి స్వామినాయుడు
Comments
Please login to add a commentAdd a comment