సింగర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. మీథికా పుట్టింది, పెరిగింది లక్నోలో. సంగీతం, భరతనాట్యంలో శిక్షణ పొందింది. స్కూల్ స్థాయి నుంచి పాటల పోటీల్లో పాల్గొని ప్రైజులు, అవార్డులు గెలుచుకుంది. 2021లో The Sound Blaze పేరుతో యూట్యూబ్ చానల్‌ను స్టార్ట్ చేసింది. ఆ ఏడే ఆమె పాడిన ‘కహో నా కహో’ ఎక్స్‌టెండెడ్ వర్షన్ వీడియో సాంగ్ 1.76 లక్షల వ్యూస్‌తో పెద్ద హిట్ అయింది. ఆ టాలెంట్‌ని మెచ్చిన అమెజాన్ ప్రైమ్ వీడియో మీథికాతో షార్ట్ వీడియోస్ చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది.
వాటిని ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో అమెజానే పోస్ట్ చేస్తుంటుంది. తన కళ్ల ముందు జరుగుతున్న విషయాలను వ్యంగ్య ధోరణిలో రీల్స్‌గా, షాట్స్‌గా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో చూపిస్తుంటుంది మీథికా. ఆమె ఇన్‌స్టా, యూట్యూబ్, ఫేస్‌బుక్ అకౌంట్స్‌కి పెద్దవాళ్ల నుంచి జెనరేషన్ ఆల్ఫా వరకు అందరూ అభిమానులే! అర్బాజ్‌ఖాన్, అనురాగ్ కశ్యప్, ప్రియంకా చోప్రా లాంటి సెలబ్రిటీలూ ఫాలోవర్సే!
Comments
Please login to add a commentAdd a comment