Steps For Prevention Of Liver Cirrhosis | Cirrhosis Symptoms - Sakshi
Sakshi News home page

శరీరంతోపాటు కాలేయం బరువు కూడా.. సిర్రోసిస్‌ లక్షణాలు.. నివారణ ఇలా..

Published Sun, Nov 27 2022 9:52 PM | Last Updated on Mon, Nov 28 2022 8:46 AM

Steps For Prevention Of Liver Cirrhosis - Sakshi

Liver Cirrhosis: సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ... కొంతమంది బరువు కూడా పెరుగుతుంటారు. దేహం బరువు పెరగడం అంటే లోపల కాలేయం బరువు కూడా పెరుగుతోందని గ్రహించాలి. అదెలాగంటే... దేహంలో కొవ్వు పేరుకుంటుందంటే, కాలేయంలోనూ కొవ్వు పెరుగుతోందన్నమాట. ఆ కొవ్వు కణాలు కాలేయంలోని రక్తప్రవాహానికీ అడ్డురావడంవల్ల సిర్రోసిస్‌ ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కాలేయానికి ఉండే సహజ ఆకృతి, దాని సహజమైన రంగు దెబ్బతిని జిగురు జిగురుగా, పచ్చరంగుకు మారిపోవచ్చు. 

సిర్రోసిస్‌ లక్షణాలు:

  • ఒంటిపై భాగంలో రక్తనాళాలు సాలీడు ఆకృతిలో బయటకు కనిపించడం. 
  • దీర్ఘకాలం పాటు ఆకలి లేకుండా బాగా నీరసంగా, నిస్సత్తువగా అనిపిస్తుండటం.  
  • పొట్టలో విపరీతంగా గ్యాస్‌ పేరుకుంటుండటం. 
  • కళ్లు పసుపురంగుకు మారుతుండటం.

ఈ లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్‌ను సంప్రదిస్తే అల్ట్రాసౌండ్‌ అబ్డామిన్, లివర్‌ఫంక్షన్‌ టెస్ట్‌ వంటివి చేసి, సమస్య ఉందా, లేదా అన్నది నిర్ధారణ చేస్తారు. 

నివారణ కోసం : ఈ పరిస్థితికి చేరువ కాకుండా... ఆరోగ్యంగా ఉన్నప్పుడే కాలేయం ఆరోగ్యాన్ని పరిరక్షించుకుని, సిర్రోసిస్‌ను నివారించుకునేందుకు చేయాల్సినవి. 

  • వాకింగ్‌ వంటి వ్యాయామాలు చేస్తూ బరువును ఎప్పుడూ నియంత్రించుకోవడం. 
  • ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండటం. 
  • మందులు వాడేటప్పుడు డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోవాలి. సొంతవైద్యం, ఆన్‌ కౌంటర్‌ మెడిసిన్స్‌ తీసుకోవడం మానేయాలి. 
  • అన్ని పోషకాలు ఉండే మంచి సమతులాహారం తీసుకోవడం.
  • పోషకాలలో అన్ని విటమిన్లతో పాటు మరీ ముఖ్యంగా విటమిన్‌–బి కాంప్లెక్స్‌ ఉండే ఆహార ధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement