ఫీల్‌ గుడ్‌.. స్ట్రీట్‌ ఫుడ్‌! | Street food stalls In hyderabad | Sakshi
Sakshi News home page

ఫీల్‌ గుడ్‌.. స్ట్రీట్‌ ఫుడ్‌!

Published Tue, Oct 1 2024 7:05 AM | Last Updated on Tue, Oct 1 2024 7:05 AM

Street food stalls In hyderabad

నగరవాసులను ఊరిస్తున్న వెరైటీలు 

వైవిధ్యమైన కల్చర్‌కు వేదికగా భాగ్యనగరం 

కిటకిటలాడుతున్న స్ట్రీట్‌ ఫుడ్‌ స్టాల్స్‌ 

నైట్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్న నగర యువత

స్ట్రీట్‌ ఫుడ్‌ అనగానే ఠక్కున గుర్తొచ్చే ప్లేస్‌ చార్మినార్. ఎంత రాత్రి అయినా సరే చార్మినార్‌ దగ్గరికి వెళ్తే చాలు ఎలాంటి ఫుడ్‌ కావాలంటే అలాంటి ఫుడ్‌ లాగించేయొచ్చు. మొఘల్‌ నుంచి నిజాం కాలం వరకూ ఏ రకం ఫుడ్‌ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. పత్తర్‌ కా ఘోష్‌ చాలా ఫేమస్‌. ఒక్కసారైనా ఈ వంటకాన్ని టేస్ట్‌ చేయాలని అనుకుంటారు. హైదరాబాద్‌ కా ఫేమస్‌ హలీమ్, షావర్మా, కోవా జిలేబీ, కోవా గులాబ్‌జామ్, షాదూద్‌ మలాయ్, మాషా అల్లా ఫలూదా, టర్కిష్‌ మరగ్, సీక్‌ కబాబ్, ఫిర్నీ, హోటల్‌ షాబాద్‌లో నాస్టా, ఖట్టి కిచిడీ, కీమా, భాజీ గుర్డా, ఇరానీ చాయ్‌ ఇలా చెప్పుకొంటూ పోతే జాబితాకు ముగింపే ఉండదు. తెల్లవారుజాము వరకూ ఇక్కడి ఫుడ్‌ స్టాల్స్‌ కిటకిటలాడుతుంటాయి.  

నైట్‌ లైఫ్‌కి ఐకాన్‌..
నైట్‌ లైఫ్‌కు హైదరాబాద్‌ ఐకాన్‌గా మారుతోంది. చాలా ప్రాంతాల్లో లేట్‌ నైట్‌ వరకూ ఫుడ్‌ స్టాళ్లకు అనుమతులు ఇస్తుండటంతో యూత్‌ కూడా వీకెండ్స్‌లో నైట్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తోంది. నలుగురైదుగురు ఫ్రెండ్స్‌ కలిసి బైక్‌లు, కార్లలో నగరాన్ని రాత్రి వేళల్లో చుట్టేస్తున్నారు. ఉదయం సమయంలో ట్రాఫిక్‌తో విసిగిపోయిన వారు.. అర్ధరాత్రి ప్రశాంతమైన నగరాన్ని చూస్తూ మైమరిచిపోతున్నారు. మొజంజాహీ మార్కెట్, రాంకీబండి, సికింద్రాబాద్, లోయర్‌ ట్యాంక్‌బండ్, ఉప్పల్‌ భగా    యత్‌.. నైట్‌లైఫ్‌కు కేంద్రాలుగా ఉంటున్నాయి. ఇక్కడ దొరికే స్ట్రీట్‌ ఫుడ్‌ను లొట్టలేసుకుంటూ తింటూ.. ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ లైఫ్‌టైం మెమరీస్‌ దాచిపెట్టుకుంటున్నారు.

ఫుడ్‌ హబ్‌గా సచివాలయం.. 
స్ట్రీట్‌ ఫుడ్‌ అనగానే ఇప్పటికీ చారి్మనార్‌ పేరే గుర్తొస్తుంది. కానీ ఇటీవల కాలంలో సచివాలయం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌గా మారాయి. రాత్రి పొద్దుపోయే వరకూ ఇక్కడ ఫుడ్‌ లవర్స్‌ రోడ్డు పక్కన దొరికే తినుబండారాలను తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో.. విద్యుత్‌ కాంతుల్లోని సచివాలయం, అమరవీరుల జ్యోతి చుట్టు పక్కల ప్రదేశాలు సందర్శకులతో రద్దీగా మారతాయి.  

చాట్‌ నుంచి చాక్లెట్‌ కేక్‌ వరకూ.. 
వెనీలా, చాక్లెట్‌ కప్‌ కేక్స్, మల్బరీ, స్ట్రాబెర్రీ చాక్లెట్, పానీపూరీ, చాట్, బ్రెడ్‌ ఆమ్లెట్, కారం, ఉప్పు చల్లిన మామిడి, స్వీట్‌ కార్న్, మసాలా కార్న్, ఉడకబెట్టిన మొక్కజొన్న, ట్విస్టెడ్‌ పొటాటో, వెజ్, చికెన్, ఫ్రైడ్‌ మోమూస్, స్టీమ్‌ మోమూస్, చైనీస్‌ ఫుడ్‌ ఇలా ఒక్కటేంటి.. నగరంలో వివిధ ప్రాంతాల్లో దొరికే అన్ని రకాల ఆహారం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. స్మైలీ, ఎగ్‌ దోశ, ఎగ్‌ ఆమ్లెట్‌ షావర్మా, చికెన్‌ కబాబ్స్, క్రిస్పీ స్పైసీ చికెన్, సమోలీ, కుబూస్, రుమాలీ షావర్మా, చాట్, పానీపూరీ చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. హుస్సేన్‌ సాగర్‌ అందాలను చూసుకుంటూ ఎంచక్కా ఫుడ్‌ను 
 ఎంజాయ్‌ చేయొచ్చు.

అదిరే ఫుడ్‌ నెక్లెస్‌ రోడ్‌..! 
నెక్లెస్‌ రోడ్డులో అలా కారులో, బైక్‌పై వెళ్తుంటే అక్కడక్కడా వచ్చే సువాసనలు చూస్తుంటేనే ఆ ఫుడ్‌ లాగించేయాలని అనిపిస్తుంది. ఎంచక్కా కారు లేదా బైక్‌ ఆపి చక్కగా ఆర్డర్‌ చేసుకుని, తింటుంటే ఆ మజానే వేరు. ఇక, నెక్లెస్‌ రోడ్డులోని ఈట్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ గురించి వేరే చెప్పాల్సిన పనే లేదు. అక్కడ దొరకని ఫుడ్‌ అంటూ లేదంటే అతిశయోక్తి లేదు. ఫుడ్‌తో పాటు చిన్న పిల్లలు, పెద్దలు ఆడుకునేందుకు అనేక రకాలా ఆటవస్తువులు, మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ అందుబాటులో ఉంటుంది.

హైటెక్‌ సిటీ–మాదాపూర్‌.. 
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల అడ్డా అయిన హైటెక్‌ సిటీ, మాదాపూర్‌లో ఇటీవల స్ట్రీట్‌ ఫుడ్‌ కల్చర్‌ విపరీ  తంగా పెరిగిపోయింది. చాలా మంది ఐటీ ఉద్యోగులకు నైట్‌ డ్యూటీలు ఉంటాయి. అర్ధరాత్రి ఆకలిగా అనిపించినా.. కాస్త బోర్‌ కొట్టినా కొలీగ్స్‌తో కలిసి ఎంచక్కా స్ట్రీట్‌ ఫుడ్‌ స్టాళ్ల దగ్గరికి వచ్చి డిఫరెంట్‌ ఫుడ్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. రెగ్యులర్‌ టిఫిన్లయిన ఇడ్లీ, దోశతో పాటు స్నాక్‌ ఐటెమ్స్‌ అయిన సమోసా, మిర్చీ, కట్లెట్, పానీపూరీ ఆహారం ఏదైనా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా దొరుకుతుంది. హైదరాబాద్‌ యువతకు మాదాపూర్‌ స్ట్రీట్‌ 
ఫుడ్‌ ఫేవరెట్‌గా మారాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement