nightlife
-
సన్నీలియోన్ షోకు పోలీసుల అనుమతి నిరాకరణ
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్.10లోని ఇల్లీయూజన్ పబ్‌లో శనివారం వీకెండ్ నైట్‌లైఫ్‌లో భాగంగా ప్రముఖ బాలివుడ్ నటీ సన్నీ లియోన్ లైవ్ ఫెర్ఫార్మెన్స్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రాత్రి 11 గంటల నుంచి 12.30 గంటల వరకు ఆమె ఈ పబ్‌లో ఒప్పందం ప్రకారం డీజే ప్లే చేస్తూ కుర్రకారుకు హుషారు తెప్పించాలి. ఇందుకోసం నిర్వాహకులు జూబ్లీహిల్స్ పోలీసుల అనుమతి కోరగా, ఇందుకు నిరాకరించారు. ఉదయం నుంచే సన్నీ లియోన్ రాకకోసం కుర్రకారు ఎదురు చూస్తుండగా, అనుమతి నిరాకరిస్తూ పోలీసులు ఫైల్ పక్కన పెట్టారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సన్నీ లియోన్ ప్రోగ్రామ్ నిర్వహించాలని నిర్ణయించుకున్న నిర్వాహకులు ఉన్నతాధికారులను కూడా కలిశారు. ఎలాగైనా ఆమెను పబ్‌కు తీసుకు రావాలని ప్రయత్నించారు. మరోవైపు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్‌లోకి రానివ్వొద్దంటూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పబ్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. టికెట్లు కొనుగోలు చేసిన యువతీ యువకులు రాత్రి 8 గంటల నుంచే పబ్‌కు చేరుకోవడం ప్రారంభించారు. ఒక వైపు పోలీసుల మోహరింపు..మరో వైపు అనుమతుల నిరాకరణ...ఇంకో వైపు హోటల్లో సన్నిలియోన్ ఎదురు చూపుల మధ్య హైడ్రామా రక్తి కట్టింది. ఈ క్రమంలో చివరకు నిర్వాహకులు సన్నీలియోన్ ఆరోగ్యం బాగాలేనందున ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినట్లు ఓ వీడియోను విడుదల చేశారు. రూ.లక్షలు పోసి టికెట్లు కొన్న యువతీ యువకులు నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అడ్డదారిలోనైనా ఆమెను తీసుకొస్తారేమోనని అనుమానించి పబ్ చుట్టూ 100 మంది పోలీసులను మోహరించారు. రాత్రి 1 గంటకు ఇక ఆమె రాదని నిర్ధారించుకున్న పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
డార్క్ ఫాంటసీ..
నగరం నిద్రపోవడం మర్చిపోయి చాన్నాళ్లైంది.. అయ్యో.. ఇదేదో స్లీప్ డిజార్డరో, మానసిక రుగ్మతో కాదు. ఇదో అధునాతన జీవనశైలి. నగర యువత డార్క్ ఫాంటసీకి అలవాటుపడుతోంది.. అర్ధరాత్రుళ్లయినా హైదరాబాద్ రోడ్లు అలసిపోవు, ఆఫీసులు ముగిసినా ఆహ్లాదానికి విసుగు రాదు. నగరానికున్న ఎన్నో విశిష్టతల్లో సిటీ నైట్ లైఫ్ ఒకటి. అది కూడా ఎదో ఒక ప్రాంతానికే పరిమితం కాదు. నగరానికి నలుమూలలా ఫేవరెట్ స్పాట్లున్నాయి. సెంట్రల్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ మొదలు లండన్‌ను తలపించే మాదాపూర్ స్ట్రీట్స్ వరకూ నైట్ లైఫ్ ఒక అనుభూతి, ఒక ఎమోషన్. ఆ అర్ధరాత్రి రంగుల హరివిల్లుపై ఓ లుక్కేద్దామా..?!! ఒకప్పుడు రాత్రి తొమ్మిది దాటిందంటే ఎదో టీవీ షో చూస్తూనో, డిన్నర్ చేస్తూనో లేదా ఆ పాటికే నిద్రపోవడమో జరిగేది. కానీ.. ప్రస్తుతం పగలు ఓ రోజు, రాత్రి మరో రోజు అనేలా మారింది. అలా అందరికీ కాకపోయినప్పటికీ సగానికి పైగా యువతకు ఇప్పుడిదే ట్రెండ్ అయ్యింది. అర్ధరాత్రి వరకూ ఆహ్లాదం కోసం సిటీ రైడ్ వేయడం సర్వసాధారణమైపోయింది. దీనికి తోడు నగరంలోని పలు చోట్ల అర్ధరాత్రి వరకూ ఇరానీ ఛాయ్ నుంచి హైదరాబాద్ బిర్యానీ వరకూ అందుబాటులో ఉండటం ఓ కారణం. ముఖ్యంగా సాఫ్ట్ వేర్, ఐటీ ఉద్యోగుల షిఫ్టింగ్ విధానంతో ఈ నైట్ కల్చర్ మరింత పెరిగింది. అలా అని హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చి»ౌలి, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ వంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ సందడి ఉందనుకుంటే పొరపాటే. ఓల్డ్‌సిటీ మొదలు ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ నుంచి ఎయిర్ పోర్ట్ రోడ్ వరకూ ఈ నిశాచర జీవితం అంతులేని ఆహ్లాదానికి, యువత సంతోషాలకు వేదికలుగా నిలుస్తున్నాయి. వినోదం కోసం విహారం.. మాదాపూర్ టూ హైటెక్‌సిటీ రోడ్. రాత్రి 10, 11 గంటలు దాటినా ఇక్కడి టిఫిన్ల కోసం 10 నిమిషాలైనా ఆగాల్సిందే. అంత మంది అక్కడికి చేరుకుంటారు. రాత్రి 12 గంటలైనా ట్యాంక్ బండ్ రోడ్ జాతరలా ఉంటుంది. ఇప్పుడిది కేక్ కటింగ్ స్పాట్‌గా మారింది. ఈ మధ్య కాలంలో సంబంధిత అధికారులు ఇక్కడ కేక్ కటింగ్ నిషేదించినా బర్త్‌డే పార్టీల సందడి అంతగా తగ్గనే లేదు. ఇక నెక్లెస్ రోడ్, ప్రసాద్ ఐమ్యాక్స్, ఈట్ స్ట్రీట్ రోడ్లో పాత ఆనవాయితే. అయితే కొత్తగా సెక్రటేరియేట్, భారీ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం నైట్సెల్ఫీ స్పాట్‌గా మారింది.నైట్ ఈటింగ్.. నగరంలోని ఛాయ్ ప్రేమికుల కోసం వీధి వీధినా చాయ్ స్టాల్స్ ఉన్న నంగతి తెలిసిందే. కానీ రాత్రి సమయంలో చాయ్ తాగాలంటే ఐతే నీలోఫర్‌లో తాగాలి.. లేదా చార్మినార్ నిమ్రా కేఫ్‌లో తాగాల్సిందే, సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాల్సిందే. ముజాంజాహి మార్కెట్ వేదికగా రాత్రి వెన్నెలలో చల్లని ఐస్‌క్రీం తినడం మరో స్పెషల్. ఇక ఫ్లేవర్ ఆఫ్ హైదరాబాద్ ‘బిర్యానీ’ అంటే షాదాబ్ నుంచి ప్యారడైస్ వరకూ.., మేఫిల్ నుంచి కేఫ్ బాహర్ వరకూ ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. కాక్టేల్కు మించిన కిక్.. క్లబ్‌లు, పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు.. ఒకటా రెండా.. నగరంలో విహరించాలంటే ఎన్నో కారణాలు, ఎన్నెన్నో అనుభవాలు. ఈ మధ్య కాలంలో ఐతే దుర్గం చెరువు పై రంగురంగుల లైట్లతో నైట్ రెయిన్ బోను తలపించే కేబుల్ బ్రిడ్జ్ పై సెల్ఫీ దిగడమో, రీల్స్ చేయడమో ఒక ట్రెండ్‌గా మారింది. ఎంతలా అంటే.. కేబుల్ బ్రిడ్జ్ పై ట్రాఫిక్ పెరగిపోయి అవస్థలు పడేంతలా. అందుకే సీసీ టీవీ కెమెరాలతో కట్టడి చేస్తున్నారు. రాత్రిళ్లు మాదాపూర్, గచ్చి»ౌలి మధ్య బైక్ రైడ్ చేయడం ఈ తరం యూత్‌కు ఒక సరదా. అంతేకాదు.. ఏకంగా శంషాబాద్‌లోని ఎయిర్ పోర్ట్‌కు ఓ రైడ్ వేసి అక్కడే పిజ్జానో, బర్గరో తిని.. మర్చిపోకుండా మళ్లీ ఓ సెల్ఫీ దిగడం కూడా స్పెషల్ అచీవ్మెంట్. కొండాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకూ.. బొల్లారం నుంచి ఆరాంఘర్ వరకూ అర్ధరాత్రిళ్లు అనుమతులకు అనుగుణంగా నిర్వహిస్తున్న ఫుడ్‌స్టాల్, ఐస్‌క్రీం పార్లర్లలో సందడి చేయడం నగరవాసులకొక హాబీలా మారింది. అయితే ఈ సంస్కృతి ఆరోగ్యానికి హానికరం ఐనప్పటికీ.. మిక్స్డ్ కాక్టేల్కు మించిన కిక్ ఇస్తుందనేది నైట్ లైఫ్ లవర్స్ అభిప్రాయం. -
ఫీల్ గుడ్.. స్ట్రీట్ ఫుడ్!
స్ట్రీట్ ఫుడ్ అనగానే ఠక్కున గుర్తొచ్చే ప్లేస్ చార్మినార్. ఎంత రాత్రి అయినా సరే చార్మినార్ దగ్గరికి వెళ్తే చాలు ఎలాంటి ఫుడ్ కావాలంటే అలాంటి ఫుడ్ లాగించేయొచ్చు. మొఘల్ నుంచి నిజాం కాలం వరకూ ఏ రకం ఫుడ్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. పత్తర్ కా ఘోష్ చాలా ఫేమస్. ఒక్కసారైనా ఈ వంటకాన్ని టేస్ట్ చేయాలని అనుకుంటారు. హైదరాబాద్ కా ఫేమస్ హలీమ్, షావర్మా, కోవా జిలేబీ, కోవా గులాబ్‌జామ్, షాదూద్ మలాయ్, మాషా అల్లా ఫలూదా, టర్కిష్ మరగ్, సీక్ కబాబ్, ఫిర్నీ, హోటల్ షాబాద్‌లో నాస్టా, ఖట్టి కిచిడీ, కీమా, భాజీ గుర్డా, ఇరానీ చాయ్ ఇలా చెప్పుకొంటూ పోతే జాబితాకు ముగింపే ఉండదు. తెల్లవారుజాము వరకూ ఇక్కడి ఫుడ్ స్టాల్స్ కిటకిటలాడుతుంటాయి. నైట్ లైఫ్‌కి ఐకాన్..నైట్ లైఫ్‌కు హైదరాబాద్ ఐకాన్‌గా మారుతోంది. చాలా ప్రాంతాల్లో లేట్ నైట్ వరకూ ఫుడ్ స్టాళ్లకు అనుమతులు ఇస్తుండటంతో యూత్ కూడా వీకెండ్స్‌లో నైట్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. నలుగురైదుగురు ఫ్రెండ్స్ కలిసి బైక్‌లు, కార్లలో నగరాన్ని రాత్రి వేళల్లో చుట్టేస్తున్నారు. ఉదయం సమయంలో ట్రాఫిక్‌తో విసిగిపోయిన వారు.. అర్ధరాత్రి ప్రశాంతమైన నగరాన్ని చూస్తూ మైమరిచిపోతున్నారు. మొజంజాహీ మార్కెట్, రాంకీబండి, సికింద్రాబాద్, లోయర్ ట్యాంక్‌బండ్, ఉప్పల్ భగా యత్.. నైట్‌లైఫ్‌కు కేంద్రాలుగా ఉంటున్నాయి. ఇక్కడ దొరికే స్ట్రీట్ ఫుడ్‌ను లొట్టలేసుకుంటూ తింటూ.. ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ లైఫ్‌టైం మెమరీస్ దాచిపెట్టుకుంటున్నారు.ఫుడ్ హబ్‌గా సచివాలయం.. స్ట్రీట్ ఫుడ్ అనగానే ఇప్పటికీ చారి్మనార్ పేరే గుర్తొస్తుంది. కానీ ఇటీవల కాలంలో సచివాలయం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు స్ట్రీట్ ఫుడ్ హబ్‌గా మారాయి. రాత్రి పొద్దుపోయే వరకూ ఇక్కడ ఫుడ్ లవర్స్ రోడ్డు పక్కన దొరికే తినుబండారాలను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో.. విద్యుత్ కాంతుల్లోని సచివాలయం, అమరవీరుల జ్యోతి చుట్టు పక్కల ప్రదేశాలు సందర్శకులతో రద్దీగా మారతాయి. చాట్ నుంచి చాక్లెట్ కేక్ వరకూ.. వెనీలా, చాక్లెట్ కప్ కేక్స్, మల్బరీ, స్ట్రాబెర్రీ చాక్లెట్, పానీపూరీ, చాట్, బ్రెడ్ ఆమ్లెట్, కారం, ఉప్పు చల్లిన మామిడి, స్వీట్ కార్న్, మసాలా కార్న్, ఉడకబెట్టిన మొక్కజొన్న, ట్విస్టెడ్ పొటాటో, వెజ్, చికెన్, ఫ్రైడ్ మోమూస్, స్టీమ్ మోమూస్, చైనీస్ ఫుడ్ ఇలా ఒక్కటేంటి.. నగరంలో వివిధ ప్రాంతాల్లో దొరికే అన్ని రకాల ఆహారం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. స్మైలీ, ఎగ్ దోశ, ఎగ్ ఆమ్లెట్ షావర్మా, చికెన్ కబాబ్స్, క్రిస్పీ స్పైసీ చికెన్, సమోలీ, కుబూస్, రుమాలీ షావర్మా, చాట్, పానీపూరీ చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. హుస్సేన్ సాగర్ అందాలను చూసుకుంటూ ఎంచక్కా ఫుడ్‌ను ఎంజాయ్ చేయొచ్చు.అదిరే ఫుడ్ నెక్లెస్ రోడ్..! నెక్లెస్ రోడ్డులో అలా కారులో, బైక్‌పై వెళ్తుంటే అక్కడక్కడా వచ్చే సువాసనలు చూస్తుంటేనే ఆ ఫుడ్ లాగించేయాలని అనిపిస్తుంది. ఎంచక్కా కారు లేదా బైక్ ఆపి చక్కగా ఆర్డర్ చేసుకుని, తింటుంటే ఆ మజానే వేరు. ఇక, నెక్లెస్ రోడ్డులోని ఈట్ స్ట్రీట్ ఫుడ్ గురించి వేరే చెప్పాల్సిన పనే లేదు. అక్కడ దొరకని ఫుడ్ అంటూ లేదంటే అతిశయోక్తి లేదు. ఫుడ్‌తో పాటు చిన్న పిల్లలు, పెద్దలు ఆడుకునేందుకు అనేక రకాలా ఆటవస్తువులు, మంచి ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉంటుంది.హైటెక్ సిటీ–మాదాపూర్.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల అడ్డా అయిన హైటెక్ సిటీ, మాదాపూర్‌లో ఇటీవల స్ట్రీట్ ఫుడ్ కల్చర్ విపరీ తంగా పెరిగిపోయింది. చాలా మంది ఐటీ ఉద్యోగులకు నైట్ డ్యూటీలు ఉంటాయి. అర్ధరాత్రి ఆకలిగా అనిపించినా.. కాస్త బోర్ కొట్టినా కొలీగ్స్‌తో కలిసి ఎంచక్కా స్ట్రీట్ ఫుడ్ స్టాళ్ల దగ్గరికి వచ్చి డిఫరెంట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. రెగ్యులర్ టిఫిన్లయిన ఇడ్లీ, దోశతో పాటు స్నాక్ ఐటెమ్స్ అయిన సమోసా, మిర్చీ, కట్లెట్, పానీపూరీ ఆహారం ఏదైనా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా దొరుకుతుంది. హైదరాబాద్ యువతకు మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్ ఫేవరెట్‌గా మారాయి. -
కారు చీకటిలో పెద్దపులి.. వీడియో వైరల్!
ఒకవేళ మీరు రాత్రి పూట పొలం మీదుగా వెళుతున్నప్పుడు హఠాత్తుగా పెద్ద పులి కనిపిస్తే ఏం చేస్తారు? ఇది ఊహకు వస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇటీవల కారులో చెరకు తోట పక్కగా వెళుతున్న కొంతమందికి ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది. కారులో ఉన్న వారికి దారిలోపెద్ద పులి కనిపించింది. అంత భయంలోనూ వారు ఆ పెద్ద పులిని వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ 17 సెకన్ల వీడియో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని తేరాయ్కు చెందినదని తెలుస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో @prashant_lmp పేరుతో ఉన్న ఖాతాతో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన జనం తెగ ఆశ్చర్యపోతున్నారు. వీడియోను చూసినప్పుడు దీనిని వాహనంలో నుండి చిత్రీకరించారని గమనించవచ్చు. కారు బానెట్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్ ‘ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లా తేరాయ్లోని కొన్ని చెరకు పొలాల్లో పులులు సరదాగా తిరుగుతాయి. ఈ వీడియో కుక్రా ప్రాంతానికి చెందినది’ అనిరాశారు. ఈ పోస్ట్‌ను రీపోస్ట్ చేస్తూ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)అధికారి రమేష్ పాండే ..‘చెరకు పొలాలు అటు వేటగాళ్లకు, ఇటు వేటాడే క్రూర జంతువులకు ఇష్టమైన ప్రదేశం. అందుకే ఇటువంటి చోట్ల మనుషులు, క్రూరమృగాలు ఎదురుకావడం జరుగుతుంటుంది. శీతాకాలంలో ఇలా జరిగేందుకు అవకాశాలున్నాయి. కారు హెడ్ లైట్ల కాంతి పెద్దపులిపై పడుతుండటం వీడియోలో కనిపిస్తుంది’ అని రాశారు. ఇది కూడా చదవండి: ఆశారాం నుంచి రామ్ రహీం వరకూ ఏం చదువుకున్నారు? यूपी के तराई में पड़ने वाले लखीमपुर खीरी जिले में टाइगर्स कुछ ऐसे गन्ने के खेतों में मस्ती भरी चाल से घूमते हैं। वीडियो कुकरा इलाके की बताई जा रही। #Canetigers@rameshpandeyifs @DudhwaTR @raju2179 pic.twitter.com/ewhdJvbcPJ — Prashant pandey (@prashant_lmp) September 30, 2023 -
ఇంటర్నెట్, నైట్ లైఫ్, న్యూడిటీ..!
సముద్ర తీరంలో తీరొక్క రీతిలో ఎంజాయ్ చేస్తారు జనం. అప్పుడు మొబైల్ గిబైల్ పక్కనపెట్టి ఆనందంలో మునిగితేలుతారు. అయితే భారతీయులు మాత్రం అలా ఎంజాయ్ మెంట్ లో పూర్తిగా మునిగిపోవడానికి ఇష్టపడట్లేదు. ఆ..ఆనందాన్ని నలుగురితో షేర్ చేసుకోవాలనుకుంటారు. అందుకే బీచ్ టూర్లలో సైతం ఇంటర్నెట్ ను వదిలిపెట్టట్లేదు. నైట్ లైఫ్, న్యూడిటీ కూడా భారతీయ పర్యాటకుల ప్రాధాన్యతల్లో ముఖ్యమైనవి. ప్రఖ్యాత ట్రావెల్ పోర్టల్ ఎక్స్ పీడియా తాజాగా 12 వేల మందితో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 24 దేశాల్లో పర్యాటకులను పరిశీలించి, ప్రశ్నలు వేసి రూపొందించిన ఎక్స్ పీడియా ఈ రిపోర్టు తయారు చేసినట్లు చెబుతోంది. దాని ప్రకారం తీర ప్రాంతాలకు టూర్లకు వెళ్లేవారిలో థాయిలాండ్ వాసుల(82 శాతం) తర్వాతి స్థానం భారతీయులదే. ఇండియన్ టూరిస్టులలో 81 శాతం మంది బీచ్ లలో గడిపేందుకు ఇష్టపడుతున్నారట. వారిలో 39 శాతం మంది నైట్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేయగలిగే ప్రాంతాలను ఎంచుకుంటామనగా, బీచ్ లలో న్యూడిటీని ఎంజాయ్ చేస్తామని 24 శాతం మంది చెప్పుకొచ్చారు. ప్రతీ నలుగురు ఇండియన్ టూరిస్టుల్లో ఒకరు హాలీడేస్ లో కూడా ఆఫీస్ ఈ మెయిల్స్ కు సమాధానాలివ్వడం, 24 గంటలూ ట్యాబ్ ను క్యారీ చేయడం వంటివి తప్పనిసరిగా భావిస్తారట. అలానే ప్రతి 10 మందిలో నలుగురు బీచ్ లలో కూడా వైఫై అందుబాటులో ఉండాలని, తద్వారా ఎప్పటికప్పుడు స్టేటస్ పోస్ట్ చేసుకునే వీలుంటుందని కోరుకుంటున్నారట. భలే ఉందికదూ.. భారతీయ టూరిస్టుల వ్యవహారం!