టొమాటో, అటుకులతో వడియాలు తయారు చేసుకోండిలా!
కావలసినవి:
►నువ్వులు – 50 గ్రాములు
►టొమాటోలు – పావు కేజీ
►అటుకులు – ఒక కప్పు
►మిరప్పొడి – టీ స్పూన్ లేదా రుచిని బట్టి
►ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి
►జీలకర్ర – టీ స్పూన్
►పచ్చిమిర్చి– 3
►ఉల్లిపాయలు – 3 (తరగాలి)
►కరివేపాకు – నాలుగు రెమ్మలు.
తయారీ:
►నువ్వులను కడిగి వడపోసి ఆరబెట్టాలి.
►టొమాటోలను శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్ చేసి వెడల్పుగా ఉన్న పాత్రలో వేయాలి
►పచ్చిమిర్చి, జీలకర్ర, మిరప్పొడి, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బి టొమాటో ప్యూరీలో కలపాలి.
►ఇందులో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అటుకులు వేసి కలిపి పది నిమిషాల సేపు నాననివ్వాలి.
►చివరగా నువ్వులు వేసి కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న గోళీలుగా చేసుకోవాలి.
►తడి వస్త్రం మీద లేదా పాలిథిన్ పేపర్ మీద ఒక్కో గోళీని వడల్లా వత్తి ఎండబెట్టాలి.
►రెండు రోజులు ఎండిన తర్వాత మూడవ రోజు ఉదయం క్లాత్ నుంచి ఒలిచి రెండవ వైపు ఎండబెట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment