బొర్రా గోవర్ధన్
తెనాలి: తెలుగునాట ప్రసిద్ధి చెందిన బౌద్ధ రచయిత బొర్రా గోవర్ధన్‌కు మహాకవి గుర్రం జాషువా సాహి తీ పురస్కారం ప్రదానం చేయనున్నారు. జాషువా కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో గుంటూరులోని కార్డ్స్, ఆర్నాల్డ్ పౌలస్ ఆడిటోరియంలో శనివారం ఉదయం 10గంటలకు ఏర్పాటయ్యే మహాకవి గుర్రం జాషువా జయంతి ఉత్సవంలో ఈ అవార్డు అందజేస్తారు. డాక్టర్ పోలె ముత్యం అధ్యక్షతన జరి గే సభలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, రిటైర్డ్ డీఐజీ ఎస్.బాలస్వామి, వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌జే విద్యాసాగర్, జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్, భీమ్ సేనా సేవాదళ్ అధ్యక్షుడు ఎన్.నీలాంబరం పాల్గొంటారు. ప్రజాగాయకుడు పీవీ రమణ సభను నిర్వహిస్తారు.
గొప్ప సృజనకారుడు
గేయ రచయితగా, గాయకుడిగా, సమాజ చైతన్యానికి అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సాగుతున్న గొప్ప సృజనకారుడు బొర్రా గోవర్ధన్. ఇంకిపోయిన నీరులాగ ఉండిపోయిన బౌద్ధ ధర్మ ఊటను సాహిత్య రూపంలో పైకి రప్పించడానికి తెలుగు నా ట కొన్నేళ్లుగా రచయితలు కృషి చేస్తున్నారు. దానిని మరింత విస్తారంగా ప్రజల్లోకి తీసుకెళుతున్న ఘనత గోవర్ధన్‌కు దక్కుతుంది. స్వస్థలం నిజాంపట్నం మండలం బొర్రావారిపాలెం. వ్యవసాయ కూలీ కుటుంబం. హైస్కూలు చదువులో దేశభక్తి గీతాలతో రచన అలవడింది. విప్లవ గ్రూపుతో ఏర్పడిన పరిచయంతో ఇంటర్‌లో చదు వు మానేశారు. పౌరహక్కుల ఉద్యమంలో విప్లవ గీతా లు రాయడం, గానం చేయడం సాగించారు. 1985 తర్వాత విప్లవ రాజకీయాలకు స్వస్తి పలికి, నగరంలో పాఠశాల ప్రారంభించారు. వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, షట్‌దర్శనాలతో సహా ప్రాచీన భారతాన్ని అధ్యయనం చేశారు.
బుద్ధుని బోధనలే ఏకై క పరిష్కారం
కులసమాజ నిర్మూలనకు బుద్ధుని బోధనలే ఏకై క పరిష్కారమని బొర్రా గోవర్ధన్ విశ్వసించారు. బౌద్ధంలోని మానవత్వ పరిమళాలు తననూ ఆ దిశగా నడిపించాయంటారు. అంబేడ్కర్ స్ఫూర్తితో 2005 నుంచి బౌద్ధ రచనలు ఆరంభించారు గోవర్ధన్. బౌద్ధ భిక్షువు శాసన రక్షతి నుంచి బోధలు తీసుకుని, 2006లో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. సంక్లిష్టమైన బౌద్ధ సాహిత్యాన్ని సరళ భాషలో ప్రజలకు చేరువచేయసాగారు. రాహుల్ సాంకృత్యాయన్ ‘బౌద్ధ దర్శన్’ను ‘బౌద్ధ దర్శనం’గా తెలుగులోకి అనువదించారు. హిందీలోంచి తెలుగులోకి అనువదించిన మరో పుస్తకం ‘భగవాన్ బుద్ధ’కు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ అనువాద గ్రంథ పురస్కారం అందజేసింది. వివిధ అంశాలపై 101 పుస్తకాలు రాస్తే, అందులో 35 వరకు బౌద్ధ సాహిత్యమే. మహాకవి జాషువాపై రచించిన ‘నా కథ’ ప్రసిద్ధి చెందినది. వీరి బౌద్ధ రచనలకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అకాడమీ ఆఫ్ యూనివర్సిల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్‌ను బహూకరించింది.
Comments
Please login to add a commentAdd a comment