పాలిటెక్నిక్‌ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్స్‌ | - | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్స్‌

Oct 1 2023 1:36 AM | Updated on Oct 1 2023 1:36 AM

- - Sakshi

గుంటూరు రూరల్‌: నల్లపాడులోని ఎమ్‌బీటీఎస్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో 2023–24 విద్యా సంవత్సరానికి సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాలలో డిప్లమో కోర్సులకు మొదటి సంవత్సరం ప్రవేశాలకు స్పాట్‌ అడ్మిషన్స్‌ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ టి. శేఖర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3వ తేదీన ఉదయం 9–30 గంటలకు కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్స్‌ జరుగుతాయన్నారు. పాలిసెట్‌– 2023లో అర్హత సాధించినా, సాధించకపోయినా ఆసక్తిగల విద్యార్థులు తమ పదవ తరగతి మార్కుల జాబితా, టీసీ, స్టడీ సర్టిఫికెట్‌, కుల ధృవీకరణ పత్రం, రూ.5,800 ఫీజు చెల్లించి అడ్మిషన్స్‌ పొందవచ్చని తెలిపారు.

గణనాథుని లడ్డూ

రూ.8,11,111

గుంటూరు రూరల్‌: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని నగర శివారుల్లోని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఫేజ్‌–2 శ్రీరాంనగర్‌ 11వ లైనులో గణనాథునికి ప్రత్యేక మండపం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి లడ్డూ ప్రసాదం విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో వేలం నిర్వహించగా నగరాలు డివిజన్‌ వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ ఆరిక శ్రీనివాసరెడ్డి, చల్లా బసివిరెడ్డి, మున్నంగి సాయిసుందర్‌రెడ్డి, పొన్నపాటి శ్రీకాంత్‌రెడ్డిలు 8,11,111 రూపాయలకు దక్కించుకున్నారు. ఈ సందర్బంగా స్వామి ప్రసాదం లడ్డూతో ఊరేగింపుగా భక్తుని ఇంటికి చేర్చారు. అనతరం స్వామి నిమజ్జనోత్సవాన్ని ఘనంగా చేశారు.

126 కేజీల

శివలింగాకార లడ్డూ

అద్దంకి రూరల్‌: వినాయక పందిరిలో ప్రసాదంగా ఉంచేందుకు అద్దంకిలోని నవయుగ స్వీట్‌ షాప్‌ యజమానులు వెంగళరావు, హనుమాన్‌ సిబ్బంది 126 కేజీల శివలింగాకారంలో లడ్డూ ను తయారు చేశారు. కాజు, బాదం, డ్రై ప్రూట్స్‌ ఉపయోగించి మూడు అడుగుల ఎత్తులో ఆకర్షణీయంగా తయారు చేశారు.

రేపు తెనాలిలో త్రోబాల్‌ రాష్ట్ర జట్ల ఎంపిక

తెనాలి: ఆంధ్రప్రదేశ్‌ పురుషులు మహిళల త్రోబాల్‌ జట్ల ఎంపిక అక్టోబరు 2వ తేదీన తెనాలిలో జరగనుంది. ఇక్కడి బుర్రిపాలెం రోడ్డులోని శ్రీవివేకానంద సెంట్రల్‌ స్కూల్‌ క్రీడామైదానంలో ఉదయం 10 గంటలకు జట్ల ఎంపిక జరుగుతుందని త్రోబాల్‌ అసోసియేషన్‌, గుంటూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రావిపాటి వీరనారాయణరావు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎంపికై న జట్లు అక్టోబరు 22, 23, 24 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న జాతీయ పోటీల్లో పాల్గొంటాయని వివరించారు.

2న పోలీస్‌ స్పందన రద్దు

నగరంపాలెం: ఈనెల 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరగాల్సిన స్పందనను తాత్కలికంగా రద్దు చేసినట్లు కార్యాలయం నుంచి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు గమనించాలన్నారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement