రేపల్లెరూరల్: మెగా లోక్‌అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించి కక్షిదారులకు న్యాయం చేకూరేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ టీ వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక సబ్‌కోర్టు ప్రాంగణంలో మార్చి 8వ తేదీన జరగనున్న జాతీయ లోక్‌అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కారం అయ్యేలా పనిచేయాలని కోరుతూ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో శనివారం స్థానిక కోర్టు హాలులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించి కక్షిదారులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో న్యాయశాఖ ప్రతినెలా లోక్‌అదాలత్ నిర్వహిస్తోందన్నారు. కోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పి.రాజశేఖర్, లోక్‌అదాలత్ సభ్యులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
కక్షిదారులకు న్యాయం చేకూరేలా అధికారులు కృషి చేయాలి సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు
Comments
Please login to add a commentAdd a comment