జలపాలేశ్వరుడిపై సూర్యకిరణాలు
ఫిరంగిపురం: మండలంలోని వేములూరిపాడు గ్రామంలోని జలపాలేశ్వర ఆలయంలో స్వామిపై మంగళవారం సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ సమయంలో అనేకమంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామికి అభిషేకాలు చేయించుకున్నారు. గ్రామంలో చోళుల కాలంనాటి జలపాలేశ్వర ఆలయం ఉంది. 16వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలోని జలపాలేశ్వరుడిపై ఏటా పాల్గుణ మాసంలో కొద్దిరోజులపాటు సూర్యోదయ కాలంలో సరాసరి స్వామివారి లింగాకృతి కింది భాగం నుంచి పూర్తిగా స్వామిపై వరకు సూర్యకిరణాలు ప్రసరిస్తాయని ఆలయ అర్చకులు ఉమాపతి శాస్త్రి తెలిపారు. మళ్లీ అవి తగ్గుముఖం పట్టి పూర్తిగా సూర్యకిరణాలు ప్రసరించడం ఆగుతుందని తెలిపారు.
నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ
మంగళగిరిటౌన్: మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎగువ సన్నిధిలోని పానకాలస్వామి వారి ముఖ మండపంలో మంగళవారం భక్తులు నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ మహోత్సవం జరిగింది. దేవస్థానం ప్రధాన అర్చకులు, గురుస్వామి మాల్యవంతం శ్రీనివాసదీక్షితులు భక్తులకు మాలవేసి దీక్ష ఇచ్చారు. స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్ అధ్యక్షులు తోట శ్రీనివాసరావు మాలధారణ దీక్ష స్వీకరించే భక్తులకు దీక్షా వస్త్రాలను ఉచితంగా అందజేశారు. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు, న్యాయవాది రంగిశెట్టి లక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో శివారెడ్డి గురుస్వామి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు గోగినేని వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్ ప్రతినిధి సైదా నాయక్, శివాలయం మాజీ ధర్మకర్త అన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి, భక్త బృందం ప్రతినిధులు బుర్రి సతీష్, హను మంత నాయక్, మాదల గోపీ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ సమావేశాలకు ఐదుగురికి ఆహ్వానం
సత్తెనపల్లి: అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో ప్రత్యేకత చాటుకున్న ఎంపీడీవో, గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు ఈనెల 4, 5 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న జాతీయ సమావేశానికి ఆహ్వానం అందింది. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఎంపీడీవో లక్ష్మీదేవి, గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం సర్పంచ్ ఎం.లలితకుమారి, వెంగళాయపాలెం కార్యదర్శి వి.రవి, కొల్లిపర మండలం వల్లభాపురం సర్పంచ్ భ్రమరాంబ, పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడు సర్పంచ్ షేక్ గౌసియా బేగం స్నేహపూర్వక పంచాయతీల (ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ) పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను పంచాయతీలో అమలు చేస్తున్నారు. ఇందుకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి సమావేశాలకు వీరికి ఆహ్వానం అందడంతో సోమవారం పయనమై వెళ్లారు.
ఎండీయూ వాహనం తనిఖీ
మంగళగిరిటౌన్: మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలోని ఎర్రబాలెంలో రేషన్ బియ్యాన్ని ఇంటింటికీ సరఫరా చేసే ఎండీయూ వాహనాన్ని మంగళవారం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. స్థానికులతో మాట్లాడి రేషన్ పంపిణీ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎంత మందికి రేషన్ అందజేస్తున్నారన్న విషయాన్ని పరిశీలించారు.
జలపాలేశ్వరుడిపై సూర్యకిరణాలు
జలపాలేశ్వరుడిపై సూర్యకిరణాలు
Comments
Please login to add a commentAdd a comment