కిక్కిరిసినఆడిటోరియం
వైద్య విద్యార్థులకు పట్టా ప్రదానం వేడుకను కనులారా వీక్షించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఫలితంగా వైద్య కళాశాల ఆవరణం, కళాశాల ఆడిటోరియం కిక్కిరిసిపోయాయి. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా కళాశాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఎక్కువగా రైతు కుటుంబాలకు చెందిన పిల్లలు వైద్యులుగా పట్టాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ కమనీయ దృశ్యాలను బంధించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లను పెట్టుకుని హాజరవడం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు పట్టాలు చేతపట్టుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కళాశాల ప్రాంగణంలోనే ఫొటోలు దిగి మురిసిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment