ముగిసిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ
నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలో గౌడ, గౌడ్ సామాజిక వర్గాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 13 మద్యం షాపులను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ షాపుల కేటాయింపు సంబంధించి గురువారం లాటరీ ప్రక్రియ కలెక్టరేట్‌లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె.శ్రీనివాసులు, ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారి ఎ.అరుణకుమారి తదితరుల సమక్షంలో లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 13 షాపులను జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా తన చేతుల మీదుగా లాటరీ నిర్వహించి షాపులకు సంబంధించి లైసెన్సు దారులను ఎంపిక చేశారు. ఉదయం 9 గంటల నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించి అరగంటలోనే ముగించారు. జిల్లాలో 13 షాపులకు సంబంధించి దరఖాస్తుదారుల సమక్షంలోనే ప్రక్రియను బహిరంగంగా నిర్వహించారు. ఏఈఎస్ ఇ.మారయ్య బాబు, ఎకై ్సజ్ శాఖ సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
తాడికొండ: గుంటూరు జిల్లా తాడికొండ ఏపీ గురుకుల విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎ.జోజారావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 5వ తరగతిలో 80 సీట్లు, 6, 7, 8 తరగతుల్లో మిగిలిపోయిన ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఏపీఆర్‌ఎస్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఘనంగా చంద్రమౌళేశ్వరస్వామి దివ్య రథోత్సవం
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలోని గంగాపార్వతి సమేత చంద్రమౌళేశ్వరస్వామి వారి రథోత్సవం గురువారం కనుల పండువగా జరిగింది. స్వామి వారి కల్యాణోత్సవం అర్చకస్వాముల బృందం వేద మంత్రోచ్ఛారణలతో ఘనంగా నిర్వహించింది. కల్యాణోత్సవం అనంతరం కల్యాణమూర్తులు చంద్రమౌళేశ్వరస్వామి, గంగాదేవి, పార్వతి దేవి అమ్మవార్లు రథంపై పురవీధుల్లో విహరించారు. కల్యాణమూర్తులను దర్శించుకోవటం కోసం వడ్లమూడి పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు రథం తాడును లాగటానికి ఉత్సాహం చూపారు. దేవదాయశాఖాధికారి నరసింహారావు రథోత్సవ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆలయ ధర్మకర్తలు జి అమర్చంద్, గణపతిరావు భక్తులు పాల్గొన్నారు.
17న వేణుగోపాల ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట
ఫిరంగిపురం: మండలంలోని 113 తాళ్లూరులోని వేణుగోపాలస్వామి ఆలయం ధ్వజస్తంభ ప్రతిష్ట ఈనెల 17న నిర్వహించనున్నట్లు దేవదాయ ధర్మాదాయ శాఖాధికారి జె.శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 10.25 గంటలకు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని వేదపండితులు దీవి పవన్‌కుమార్, దీవి ప్రసన్నమూర్తిలు నిర్వహిస్తారన్నారు. పూజా కార్యక్రమంలో దాత డేగల ప్రభాకర్, భువనేశ్వరి దంపతులు పాల్గొంటారని చెప్పారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహిస్తామన్నారు.
ముగిసిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ
Comments
Please login to add a commentAdd a comment