విజయవంతం చేద్దాం
తిరుపతమ్మ చిన్న తిరునాళ్లను
పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో చిన్న తిరునాళ్లను అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని నందిగామ డివిజన్ ఆర్డీఓ కె. బాలకృష్ణ ఆదేశించారు. మార్చి 14 నుంచి 18 వరకు ఐదు రోజుల పాటు జరిగే తిరునాళ్ల ఉత్సవాలకు సంబంధించి గురువారం ఆలయ బేడామండలంలో అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమర్థంగా పనిచేయాలన్నారు. తిరునాళ్ల ఉత్సవాలు జరిగే ఐదు రోజులు పారిశుద్ధ్యం, తాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మార్చి 17న పుట్టింటి పసుపు–కుంకుమ బండ్లకు విద్యుత్ దీప కాంతులు ఏర్పాటు చేసే సందర్భంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ఆలయం వద్ద పలు శాఖల సమాచార కేంద్రాలతో పాటు, తాగునీటి సౌకర్యం, తాత్కాలికంగా బస్టాండ్‌ల ఏర్పాటు ఉంటుందన్నారు. పుట్టింటి పసుపు కుంకుమ బండ్లకు ప్రభలు 11 అడుగులకు మించి ఉండకూడదన్నారు. సీసీ కెమెరాలు అన్నీ ఒకే చోట పెట్టకుండా గ్రామంలోకి వచ్చే అన్ని దారుల్లో ఏర్పాటు చేయాలని దేవాలయ అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment