మంగళగిరి టౌన్ : పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ హుండీలను గురువారం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. దేవస్థానానికి సంబంధించి ఎగువ, దిగువ సన్నిధులు, ఘాట్ రోడ్డులో ఉన్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలకు మొత్తం రూ. 38,70,176లు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎగువ సన్నిధి హుండీ ఆదాయం రూ.16,13,384, దిగువ సన్నిధి హుండీ ఆదాయం రూ. 21,76,972, ఘాట్ రోడ్డులోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 43,011తో పాటు అన్నదానానికి రూ. 36,809 వచ్చినట్లు సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి రామకోటిరెడ్డి తెలిపారు. గతంలో మూడు నెలలకు గాను రూ. 50,97,560 వచ్చిందని, ఇప్పుడు ఒక నెల ముందుగా లెక్కింపు కారణంగా రూ. 12,27,844 తక్కువ వచ్చినట్లు ఆయన వివరించారు. లెక్కింపును కాజ గ్రూపు దేవస్థాన కార్యనిర్వహణాధికారి పి. వెంకటరెడ్డి పర్యవేక్షించారు.


