నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఉగాది పండగ సందర్భంగా మార్కెట్ కూడలిలోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం జిల్లా పర్యాటక, సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మదాయ శాఖ, నగరపాలక సంస్థ సంయుక్తంగా విశ్వావసు నామ ఉగాది ఉత్సవాలు నిర్వహించాయి. ఎమ్మెల్యేలు నసీర్‌అహ్మద్ (తూర్పు), బూర్ల రామాంజనేయులు (ప్రత్తిపాడు), జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, రాష్ట్ర లిడ్‌క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు, రాష్ట్ర ఇండస్ట్రీయల్ డవలప్‌మెంట్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఇన్‌ఛార్జ్ మేయర్ సజీలా, కార్పొరేటర్లు సమత, ఈరంటి వరప్రసాద్ జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. తొలుత నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. శ్రీమాన్ గుదిమెళ్ల శ్రీకూర్మనాధస్వామి పంచాగపఠనం ఆకట్టుకుంది. అనంతరం పలు రంగాల ప్రముఖులు, కవులను సత్కరించారు. శ్రీమాన్ గుదిమెళ్ల శ్రీకూర్మనాథస్వామి, అర్చకులు షణ్ముఖ రఘుకిషోర్‌శర్మ, గంజాం రాధాకృష్ణమాచార్యులు, జంధ్యాల వెంకటరామలింగేశ్వరశాస్త్రి, వేద పండితులు చింతపల్లి నరసింహమూర్తి, పలు రంగాల్లోని ప్రముఖులు సాంబశివరావు, భట్టు సిదానందశాస్త్రి, మండవ నరసిహారావు, గోగినేని రామారావు, హాజీబేగ్‌సాహెబ్, సయ్యద్ జానీభాషా, కోల్లా వీరయ్య చౌదరి, కవులు డాక్టర్ రావి రంగారావు, షేక్.ఖాసింబీ, డాక్టర్ నల్లాన చక్రవర్తుల సుధామైథిలీ, చల్లా సత్యవతిరెడ్డి, డాక్టర్ గడల శివప్రసాద్, షేక్.అస్మతున్నీసాబేగం, నూతక్కి ప్రజ్ఙాచారి, ఏవీకే.సుజాత, జానీభాషా, బొమ్మ మహేశ్వరరెడ్డి తదితరులు జ్ఙాపికలు, ప్రశంస పత్రాలు, నగదు పురస్కారాలతో సత్కారాలు అందుకున్నారు.
అందరికీ మంచి జరగాలి
ఎమ్మెల్యేలు నసీర్‌అహ్మద్, బూర్ల రామాంజనేయులు, గళ్లా మాధవి మాట్లాడుతూ ఈ ఉగాది అందరికీ మంచి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కమిషనర్ పులి శ్రీనివాసులు, స్టెప్ సీఈఓ చంద్రమౌళి, జిల్లా టూరిజం అధికారిణి రమ్య, దేవదాయ, ధర్మదాయ శాఖ డీసీ శ్రీనివాసులు, జీఎంసీ ఏసీ ఓబులేస్, పీవో రామారావు, ఈఈ సుందరరామిరెడ్డి, కార్పొరేటర్లు, ప్రముఖులు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.
కుర్చీలన్నీ ఖాళీగా..
శ్రీమాన్ గుదిమెళ్ల శ్రీకూర్మనాథస్వామి పంచాగ పఠనం పూర్తయిన తర్వాత ఆడిటోరియం ఖాళీగా మారింది. అయినా ఎమ్మెల్యేలు, కమిషనర్ ప్రసంగం చేశారు. అలాగే కవులకు సత్కారం చేశారు. ఈ క్రమంలో కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలు తక్కువగా ఉండడంతో కమి సమ్మేళనం జరగకుండానే కార్యక్రమాన్ని ముగిద్దామని ప్రతిపాదించడాన్ని కవులు వ్యతిరేకించారు. దీంతో కవి సమ్మేళనం కొనసాగింది.
గుంటూరులో ఉగాది వేడుకలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ మధ్యలోనే నిష్క్రమించిన ప్రజలు ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు
విశ్వావసు.. విజయోస్తు


