
రేపల్లె నుంచి దూరప్రాంతాలకు సర్వీసులు నడపాలి
రేపల్లె రూరల్: తీరప్రాంతమైన రేపల్లె ఆర్టీసీ నుంచి వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులను నడపాలని పట్టణ ఆదర్శ వేదిక కార్యదర్శి యడ్లపల్లి కిషోర్‌బాబు విన్నవించారు. రేపల్లె ఆర్టీసీ అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరుతూ డిపో వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణలకు సోమవారం వినతిపత్రం అందజేశారు. రేపల్లె – విశాఖపట్నం – శ్రీకాకుళం, రేపల్లె – మచిలీపట్నం – కాకినాడ – విశాఖపట్టణం – శ్రీకాకుళం పోర్టు, రేపల్లె – తిరుపతి – బెంగళూరు, రేపల్లె – హైదరాబాద్ (బెర్త్‌తో కూడుకున్న బస్సులు)లతో పాటు శ్రీశైలం, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలకు సర్వీసులు నడపాలన్నారు. అదేవిధంగా మోపిదేవి మీదగా చల్లపల్లికి మినీ సర్వీసులను ఏర్పాటు చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఎన్.సాయికృష్ణమాచార్యులు, కొడాలి ఆనందరావు, నటరాజ్ ఉన్నారు.