అమ్మ చారిటబుల్ ట్రస్టు సేవలు అబినందనీయం
ఐటీసీ మాజీ ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు
చేబ్రోలు: మూఢనమ్మకాలను విడనాడి ప్రజలే ముందుకు వచ్చి నిర్మించుకుంటే శ్మశానాలే దేవాలయాలుగా మారతాయని ఐటీసీ మాజీ ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు అన్నారు. చేబ్రోలు మండలం వేజెండ్లలో బుధవారం కొత్తగా నిర్మించిన శ్మశాన వాటికను అద్దంకి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. వేజండ్లలో కెలిన్, దహనశాలను నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికై నా చివరి మజిలీ ఇదేనన్నారు. గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉంటే ఎన్నో అద్భుతాలు చేయవచ్చనన్నారు. శ్మశాన వాటిక నిర్మాణంలో కీలక భూమిక పోషించిన అమ్మా చారిటబుల్ ట్రస్ట్ సేవకులు స్వామి జ్ఞాన ప్రసన్న గిరి సేవలు అభినందనీయమన్నారు. వారి సేవలను కొనియాడారు. అన్ని పనులు ప్రభుత్వం చేయదని కొన్ని మనమే చేసుకోవాలని ఇది సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. అమ్మ చారిటబుల్ ట్రస్టు సేవకులు స్వామి జ్ఞాన ప్రసన్న గిరి మాట్లాడుతూ మనిషి మరణిస్తే కనీసం గౌరవంగా సాగరంపాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. దానికి ఊర్లో ఉండే స్మశాన వాటిక ఎంతో ముఖ్యమన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, అమ్మా ఆశ్రమం సేవకులు, సత్య హరిశ్చంద్ర సేవా సమిత కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


