● రెండేళ్ల నుంచి ఐఆర్, డీఏలు లేవు ● మూడేళ్ల నుంచి సరెం
పీఆర్సీకి మోక్షం ఎప్పుడు ?
గుంటూరు మెడికల్: ప్రభుత్వ ఉద్యోగులకు రెండేళ్లుగా పీఆర్సీ లేదని, డీఏ, ఐఆర్ లేవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల నుంచి సరెండర్ లీవు లేదని, చివరకు సీపీఎస్ రద్దు ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తి చేసుకొన్నా ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణంలోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చాంద్‌బాషా మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీని నియమించి సమస్యలు పరిష్కరించాలన్నారు. లేకుంటే ఉద్యోగులు ధర్మ పోరాటానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పోతురాజు, ఉపాధ్యక్షుడు రహెమాన్, సంయుక్త కార్యదర్శి లక్ష్మీనారాయణ, కోటా సాహె బ్, నగరశాఖ అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు, నగర శాఖ ఆర్గనైజింగ్ కార్యదర్శి పెదరత్తయ్య, జాను, నగర శాఖ కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.


