గుంటూరు
శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వైభవంగా మహా కుంభాభిషేకం
పొన్నూరు: పొన్నూరు పట్టణంలోని తెలగ పాలెంలో ఉన్న కోదండ రామాలయంలో మహా కుంభాభిషేకం మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు.
రిఫ్రిజిరేటర్ బహూకరణ
పిడుగురాళ్ల: పట్టణ పోలీస్ స్టేషన్‌కు రిఫ్రిజిరేటర్‌ను తిరుమల ఆక్స్‌ఫర్డ్ విద్యాసంస్థల తరఫున శుక్రవారం అందించారు. డీఎస్పీ జగదీష్ పాల్గొన్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 517.50 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 3,031 క్యూసెక్కులు విడుదలవుతోంది.
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ, రాజ్యసభలో ప్రవేశ పెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే రద్దు చేయాలని, ముస్లింల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పెద్దలందరూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ షేక్ నూరిఫాతిమా డిమాండ్ చేశారు. స్ధానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, సీపీఐ, ముస్లిం ఐక్యవేదిక, ఆవాజ్ కమిటీ, పలు ముస్లిం సంఘాలన్నీ ఐక్యంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టాయి. ముందుగా బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద నుంచి భారీ సంఖ్యలో ముస్లింలు ప్రదర్శనగా బయలుదేరారు. మార్కెట్ సెంటర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా ముస్లింలు చంద్రబాబుడౌన్ డౌన్, నరేంద్రమోదీ డౌన్ డౌన్, వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే రద్దు చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
పెమ్మసాని రాజీనామా చేయాలి
అనంతరం నూరిఫాతిమా మాట్లాడుతూ ఎన్నికల ముందు ముస్లిం మైనార్టీల హక్కులకు భంగం కలిగితే రాజీనామాలకూ వెనకాడబోమని గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారని, ఇప్పుడు వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుపై ఎందుకు మాట్లడడం లేదని నిలదీశారు. పెమ్మసాని తక్షణం రాజీనామా చేసి ముస్లింల పక్షాన పోరాడాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వక్ఫ్‌బోర్డు బిల్లుపై తక్షణం స్పందించాలని, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతును వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. గుంటూరు తూర్పులో ముస్లింల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఇంట్లో కూర్చోవడం సరికాదని, ముస్లింల పక్షాన పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా పలువురు ముస్లిం ప్రముఖులు వక్ఫ్ సవరణ బిల్లుపై గళమెత్తారు. టీడీపీ, జనసేన ద్వంద్వ వైఖరిపై ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ముస్లిం సంఘాలు, వామ పక్ష నాయకులు, మతపెద్దలు, ముస్లిం సోదరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
7
న్యూస్‌రీల్
బిల్లుపై ముస్లింల ఆగ్రహం
పోరాటానికి సిద్ధం
కేంద్రమంత్రి పెమ్మసాని రాజీనామా చేయాలని డిమాండ్
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఇంట్లో
కూర్చుంటే కుదరదని హెచ్చరిక
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేయాలి
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అన్యాయం. పార్లమెంటులో దీనిని ఆమోదించుకోవడం తగదు. మోదీ ప్రభుత్వం ముస్లింలపై కక్ష కట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 50 శాతం వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. ఇప్పుడు ఈ బిల్లు వల్ల కలెక్టర్ల ద్వారా వక్ఫ్ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. ఈ బిల్లుకు మద్దతు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
– షేక్ వలి,
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు
బాబు, పవన్ ముస్లిం ద్రోహులు
ముస్లింలపై కక్ష కట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక నల్ల చట్టాలను తీసుకొచ్చింది. తాజాగా వక్ఫ్ సవరణ బిల్లును కుట్రపూరితంగా ఆమోదించుకుంది. ముస్లింలు బ్రిటిష్‌వారి తూటాలకే భయపడ లేదు. బీజేపీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ దేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనలేదు. ఇప్పుడు దేశం కోసం అంటూ బీజేపీ కాకమ్మ కబుర్లు చెబుతోంది. రాష్ట్రంలో ముస్లింల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమికి తగిన బుద్ధి చెబుతాం. ముస్లిం ద్రోహులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మిగిలిపోతారు.
– గులాం రసూల్,
వైఎస్సార్ సీపీ మైనారిటీ నాయకులు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు


