ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో శుక్రవారం స్థానిక ఎన్జీఓ రిక్రియేషన్ హాల్లో జరిగింది. సమావేశానికి జిల్లా జేఏసీ చైర్మన్, సంఘం జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జగదీష్, రాష్ట్ర కార్యదర్శి రాంప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన సుమారు రూ. 25వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని ఎన్జీఓ సంఘ నాయకులు చేసిన విజ్ఞప్తి మేరకు సర్కారు రూ. 7,200 కోట్లు విడుదల చేసిందని వివరించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శిగా శ్యామ్ సుందర్ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సుకుమార్, మహిళా ఉపాధ్యక్షురాలుగా శ్రీవాణి, మహిళా సంయుక్త కార్యదర్శిగా విజయలక్ష్మి, జిల్లా సంయుక్త కార్యదర్శిగా సయ్యద్ జానీ భాష, కృష్ణకిషోర్, విజయబాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగూర్ షరీఫ్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, పివి నాగేశ్వరరావు, ధనుంజయ నాయక్, ట్రెజరర్ శ్రీధర్ రెడ్డి గుంటూరు నగర శాఖ అధ్యక్ష కార్యదర్శులు సూరి, కళ్యాణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన మహిళా విభాగం నాయకురాలు రాధా రాణిని, బదిలీపై వెళ్లిన మహిళా సంఘం నాయకురాళ్ళు శివజ్యోతి, లక్ష్మీరమ్యలను సత్కరించారు.


