ఎస్‌ఆర్‌ఎం విద్యార్థికి ‘బెస్ట్ పేపర్ ఇన్ ట్రాక్’ అ
నగరి : గుంటూరు జిల్లాలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, పారి స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో సెకండ్ ఇయర్ పీహెచ్‌డీ చదువుతున్న సయ్యదాహఫ్సా అనే విద్యార్థికి ‘బెస్ట్ పేపర్ ఇన్ ట్రాక్ అవార్డు‘ దక్కింది. గత నెల 21వ తేదీన బిట్స్ పిలానీ క్యాంపస్ నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎవిడెన్స్ బేస్డ్ మేనేజ్‌మెంట్ (ఐసీఈబీఎం)లో పాల్గొన్న ఆమె ‘బియాండ్ ది డెస్క్: ఫ్యూయలింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ త్రూ వర్క్‌ప్లేస్ ఫ్లెక్సిబిలిటీ’ అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఇందుకు గాను ఆమెకు ‘బెస్ట్ పేపర్ ఇన్ ట్రాక్ అవార్డు’ ప్రదానం చేశారు. కాగా ఆమె భర్త షేక్ సలీమ్ రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్‌గా ఉన్నారు. కళాశాల డీన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఎఆర్‌ఎం పీఎస్‌బీలు అందించిన మద్దతు, మార్గదర్శకత్వంతోనే అవార్డు సాధించగలిగానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. విలువైన సలహాలు సూచనలు అందించిన డాక్టర్ జుమాన్ ఇక్బాల్‌కు, ప్రోత్సాహం అందించిన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


