గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Apr 10 2025 12:39 AM | Updated on Apr 10 2025 12:39 AM

గుంటూ

గుంటూరు

గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

సదరం క్యాంప్‌ పునఃప్రారంభం

తెనాలిఅర్బన్‌: వికలాంగుల ధ్రువపత్రాల పునఃపరిశీలనలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం ప్రత్యేక సదరం క్యాంప్‌ నిర్వహించారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం బుధవారం 515.60 అడుగుల వద్ద ఉంది. కుడికాలువకు 2,053 క్యూసెక్కులు విడుదలవుతోంది.

ఆలయ నిర్మాణానికి విరాళం

నరసరావుపేట రూరల్‌: ఇస్సప్పాలెం మహంకాళి గుడి పునర్నిర్మాణానికి వినుకొండకు చెందిన కె.వెంకటమాధవ్‌, లక్ష్మీప్రియ దంపతులు బుధవారం రూ.1,00,116 అందజేశారు.

పట్నంబజారు(గుంటూరు ఈస్ట్‌) : ఆలయాల్లో కూటమి నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయి. పూజా కార్యక్రమాల పేరుతో భక్తులను దోచుకోవడమేకాక ఖర్చులకు అధిక బిల్లులు పెట్టి ఇష్టారాజ్యంగా దిగమింగుతున్నారు. తాజాగా ఆలయ కమిటీల నామినేటెడ్‌ పదవుల పేరుతో ఆశావహుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం. గుంటూరు నగరంలో కొన్ని ఆలయాలకు కమిటీలు ఉన్నా.. వాటిని పక్కన పెట్టి కూటమి నేతలే పెత్తనం చెలాయిస్తున్నారు. పట్నంబజారులోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో కమిటీకి చైర్మన్‌ సభ్యులు ఉన్నా.. వారికి విలువ ఇవ్వడం లేదు. ఓ టీడీపీ కార్పొరేటరే అంతా తానై పెత్తనం చేస్తున్నారు. ఉత్సవాల సమయంలోనూ భారీగా దోపిడీకి పాల్పడ్డారు. రూ.90లక్షలకు మించి ఖర్చు చేయకుండా రూ.కోటి 25 లక్షల వరకు ఖర్చయిందని చెప్పి జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లెక్కలు చూపమంటే చల్లగా జారుకుంటున్నారని సమాచారం. దీనిపై ఆర్యవైశ్య సంఘాలు భగ్గుమంటున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు.

● పాతగుంటూరలోని గంగపార్వతీ సమే అగస్తేశ్వరస్వామి ఆలయంలో జనసేనలో చేరిన ఓ కార్పొరేటర్‌ కుమారుడు రాజ్యమేలుతున్నాడని తెలుస్తోంది. కమిటీలో తాను చెప్పిన వారికే ప్రాధాన్యం ఉంటుందని భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం.

● కొత్తపేటలోని గంగాపార్వతి సమేత మల్లికార్జున స్వామి గుడిలో కూడా ఒక జనసేన కార్పొరేటర్‌ ఓవరాక్షన్‌ చేస్తున్నారు. తానే తర్వాతి ఛైర్మన్‌నని ప్రకటించుకుంటూ అధికారులు, అర్చకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సమాచారం.

● చౌత్రా సెంటర్‌లోని కోదండ రామాలయంలో టీడీపీ నేత వసూళ్ళ పర్వానికే తెరదీశాడు. పూజా కార్యక్రమాల పేరుతో భక్తుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం.

● రైలుపేటలోని ఆంజనేయస్వామి దేవస్థానంలోనూ ఇదే దుస్థితి నెలకొంది.

● లాలాపేట వేంకటేశ్వరస్వామి గుడికి ప్రస్తుతం ఉన్న కమిటీని ఎలాగైనా రద్దు చేయాలే ఉద్దేశంతో సమావేశాల పేరుతో కూటమి నేతలు, ఆలయ కార్యనిర్వహణ అధికారి కుట్రలు పన్నుతున్నారు. వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాకపోవతే కమిటీ రద్దవుతుందని చెబుతున్నారు. శ్రీరామనవమి ఉత్సవాల్లోనూ కమిటీ సభ్యులకు ప్రాధాన్యం లేకుండా చేశారు. టీడీపీ నేతలే కీలకపాత్ర పోషిస్తున్నారు.

కోల్డ్‌వార్‌

నామినేటడ్‌ పదవులపై కూటమి నేతల్లోనే కోల్డ్‌వార్‌ నడుస్తోంది. పదవుల కోసం ఎవరికి వారు పైరవీలు నడుపుతున్నారు. అధికార పార్టీ నేతల వద్దకు వెళ్లి తమకు స్థానం కల్పించాలని కోరుతున్నారు. అయితే టీడీపీ ప్రజాప్రతినిధులు వారి పార్టీ వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని జనసేన, బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం.

పదవుల అమ్మకం

7

న్యూస్‌రీల్‌

ఈఓల నుంచి వివరాలు తెలుసుకుంటాం

ఆలయాల్లో జరుగుతున్న అక్రమాల గురించి మా దృష్టికి రాలేదు. కమిటీల ఏర్పాటుకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్‌ రాలేదు. లాలాపేట వేంకటేశ్వరస్వామి ఆలయ ఈవో, చౌత్రా రామాలయం ఈవోలు సెలవులో ఉన్నారు. మిగతా ఆలయాల గురించి పూర్తి వివరాలు ఈవోలను అడిగి తెలుసుకుంటాం. వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, లాలాపేట గ్రూప్‌ టెంపుల్స్‌ ఆలయాల కమిటీలు ఉన్నాయి. మిగతా గుడుల వివరాలు అడిగి తెలుసుకుంటాం.

– కేబీ శ్రీనివాస్‌,

డెప్యూటీ కమిషనర్‌, దేవదాయశాఖ

ఆలయాల్లో కూటమి నేతల

కాసుల కక్కుర్తి

కమిటీల పేరుతో ఆశావహుల

నుంచి భారీగా వసూళ్లు

దోపిడీకి దేవదాయ శాఖ

అధికారుల వత్తాసు

కూటమి అధినాయకత్వం ఆశీస్సులు

గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని టీడీపీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఆలయాల్లోని కమిటీ పదవుల అమ్మకం వ్యాపారం జరుగుతోందని తెలుస్తోంది. 6ఏ, 6బీ, 6సీ ప్రామాణికంగా రేట్లు ఫిక్స్‌ చేస్తున్నారని చెబుతున్నారు. రూ 5 లక్షల మొదలుకొని, రూ 15 లక్షల వరకు కమిటీల ఏర్పాటు కోసం.. ఒకటికి నలుగురి దగ్గర వసూళ్ళకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో తూర్పు నియోజకవర్గ ప్రజాప్రతినిధి అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు లేకపోలేదు.

గుంటూరు1
1/9

గుంటూరు

గుంటూరు2
2/9

గుంటూరు

గుంటూరు3
3/9

గుంటూరు

గుంటూరు4
4/9

గుంటూరు

గుంటూరు5
5/9

గుంటూరు

గుంటూరు6
6/9

గుంటూరు

గుంటూరు7
7/9

గుంటూరు

గుంటూరు8
8/9

గుంటూరు

గుంటూరు9
9/9

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement