చీరాల టౌన్: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం చీరాల వస్తున్నారని ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు గురువారం తెలిపారు. గవర్నర్ కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటనకు వస్తున్నారని రాజ్ భవన్ నుంచి సమాచారం అందడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలకు గవర్నర్ వాడరేవులోని ఐటీసీ అతిథి గృహానికి చేరుకుని బస చేస్తారని, శనివారం విజయవాడ రాజ్‌భవన్‌కు ప్రయాణమవుతారని సమాచారం అందించారు. ఈ మేరకు ఆర్డీఓ చంద్రశేఖరనాయుడు, తహసీల్దార్ గోపీకృష్ణలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్ వ్యక్తిగత పర్యటన నేపథ్యంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
ఎయిమ్స్‌లో కార్డియాక్ ఐసీయూ విభాగం ప్రారంభం గుండె జబ్బు రోగులకు
పూర్తి స్థాయిలో వైద్య సేవలు
మంగళగిరి: నగర పరిధిలోని ఎయిమ్స్‌లో గురువారం నూతనంగా కార్డియాక్ ఐసీయూ విభాగాన్ని ప్రారంభించారు. ఇప్పటికే కార్డియాక్ విభాగంలో యాంజియోప్లాస్టీతో పాటు అన్ని రకాల సేవలందుతున్నాయి. అయితే, ఐసీయూ విభాగం లేకపోవడంతో గుండె సంబంధిత రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకతప్పడం లేదు. అన్ని రకాల వైద్య సేవలతో ఐసీయూ విభాగం అందుబాటులోకి రావడంతో రోగులకు ఎంతో మేలు జరుగుతుందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
కుడికాలువకు నీటి విడుదల నిలుపుదల
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువకు అధికారులు గురువారం నీటిని నిలుపుదల చేశారు. సాయంత్రం 4 గంటలకు పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం 515.30 అడుగుల వద్ద ఉంది. ఇది 140.8451 టీఎంసీలకు సమానంగా ఉంది. ఇక్కడ నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 841 క్యూసెక్కులు విడుదలవుతోంది.
దుర్గమ్మ సన్నిధిలో ఎన్నికల కమిషనర్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఏపీ, తెలంగాణ ఎన్నికల కమిషనర్లు గురువారం దర్శించుకున్నారు. తెలంగాణ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ ఇంద్రకీలాద్రికి విచ్చేయగా ఆలయ అధికారులు వారిని సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్‌డీ ప్రసాద్, ఏఈవో చంద్రశేఖర్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టు వస్త్రాలతో వారిని సత్కరించారు.
నిత్యాన్నదానానికి విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు గురువారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన డి. మాల్యాద్రి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,11,116 విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఆలయ అధికారి లక్ష్మణ్ దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ చీరాల రాక
నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ చీరాల రాక
నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ చీరాల రాక


