ఇంటర్ ఫలితాల్లో శ్రీ చైతన్య విజయ దుందుభి
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో శ్రీ చైతన్య జూనియర్ కళాశాలల విద్యార్థులు విజయ దుందుభి మోగించినట్లు విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్ తెలిపారు. గుంటూరులోని లక్ష్మీపురం శ్రీచైతన్య క్యాంపస్‌లో జరిగిన విద్యార్థుల అభినందన సభలో ఆయన మాట్లాడారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఎం. వినూత్న అత్యధికంగా (467) మార్కులు సాధించగా, షేక్ బుష్రా అంజుమ్ (466), షేక్ గౌస్ ఆజామ్ (466), కె. శ్రావ్య (466), కె. శ్రీనిధి (466), పి. సౌమ్య (466), జి. పూర్ణిమ (466) మార్కులు సాధించినట్ల చెప్పారు. ఎంపీసీ విభాగంలో 465 మార్కులకు పైగా 37 మంది, 464కు పైగా సాధించిన విద్యార్థులు 70 మంది, 460కి పైగా సాధించిన వారు 838 మంది, 450కి పైగా సాధించిన వారు 2,357 మంది, 400 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 5,219 మంది ఉన్నట్లు వివరించారు. బైపీసీలో ఏ.రమ్య( 435), ఏ. గాయత్రీదేవి (435), ఆర్. గీతిక (435), టి. లీలా భవాని (435), వై. సాయి వాసంతి (435), షేక్ నఫీసా (435), ఎం. రత్నశ్రీ (435), ఆర్. తేజస్వి (435) మార్కులు సాధించారని చెప్పారు. బైపీసీ విభాగంలో 430కి పైగా సాధించిన విద్యార్థులు 154 మంది ఉండగా, 420కి పైగా సాధించిన వారు 222 మంది, 400కు పైగా 557 మంది సాధించారని వివరించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో టి. శరణ్య (991), ఆర్. చంద్రశేఖర్ (990), ఎం. బాలాజీ (989), కె. ప్రేరణ (989), కె. ఉషారాణి (988), ఎండీ రహీలా సుల్తానా (9870, బి. శ్రీవిద్య (987) మార్కులు సాధించినట్లు తెలిపారు. 980కి పైగా మార్కులతో 471 మంది, 970కి పైగా మార్కులతో 815 మంది, 950కి పైగా మార్కులతో 1,752 మంది, 900కు పైగా మార్కులు పొందిన వారు 3,915 మంది ఉన్నారని తెలిపారు. గుంటూరులోని విద్యాసంస్థలన్నింటిలో శ్రీచైతన్య అగ్రస్థానంలో నిలిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీన్స్ కిశోర్, చంద్రశేఖర్, సురేష్‌కృష్ణ, అసోసియేట్ డీన్ హరిబాబు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.


