షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్న ప్రభుత్వ కళాశాల విద్
గుంటూరు ఎడ్యుకేషన్: ఇటీవల విడుదలైన ఇంట ర్మీడియెట్ ఫలితాల్లో గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నుంచి ఎంఈసీ విభాగంలో 967 మార్కులతో టాపర్‌గా నిలిచిన విద్యార్థిని సర్వేపల్లి రాజేశ్వరిని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. మంగళవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థినికి షైనింగ్ స్టార్ అవార్డుతో పాటు ల్యాప్‌టాప్ బహూరించారు. ప్రభుత్వ కళాశాలల విభాగంలో ఎంఈసీ గ్రూప్‌లో గుంటూరు జిల్లా నుంచి అత్యధికంగా మార్కులు సాధించిన సర్వేపల్లి రాజేశ్వరి జలగం రామారావు నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాలలో చదివి, టెన్త్‌లో 568 మార్కులు సాధించింది. జూనియర్ ఇంటర్‌లో 500 మార్కులకు 485, తాజాగా సీనియర్ ఇంటర్లో 967 మార్కులతో కళాశాల టాపర్‌గా నిలిచింది.


