సూర్యలంకలో పర్యాటకుల సందడి
బాపట్ల: వరుస సెలవుల నేపథ్యంలో సూర్యలంకకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బాపట్ల జిల్లాతోపాటు గుంటూరు, కృష్ణా, హైదరాబాద్ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుంచి సూర్యలంక సముద్ర తీర ప్రాంతం పర్యాటకులతో కళకళలాడుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు యువకులు, చిన్నారులు కేరింతలు కొడుతూ తీరంలో ఆహ్లాదకరంగా గడిపారు. స్నానాల అనంతరం తీరం వెంబడి సేద తీరేందుకు ఏపీ టూరిజం శాఖకు చెందిన రిసార్ట్స్ అందుబాటులో ఉండటంతో ఆన్‌లైన్ బుక్‌చేసుకున్న పర్యాటకులు శనివారం రోజునే ఇక్కడికి చేరుకొని ఆదివారం సాయంత్రం తిరుగుపయనమవుతున్నారు. సూదూర ప్రాంతాల నుంచి వివిధ వాహనాల ద్వారా సూర్యలంక చేరుకున్న పర్యాటకులు స్నానాల అనంతరం తీరం వెంబడి ఉన్నటువంటి జీడిమామిడి తోటలో వనభోజనాలు చేసి సేదతీరారు.
సెలవుల నేపథ్యంలో పెరుగుతున్న పర్యాటకులు జీడిమామిడి తోటలో సేదతీరుతున్న వైనం


